ఇచ్చాపురం(శ్రీకాకుళం జిల్లా): వేగంగా వెళ్తున్న లారీలోంచి ప్రమాదవశాత్తు జారిపడి క్లీనర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల కేంద్రంలో జాతీయరహదారి-16పై జరిగింది. వివరాలు.. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన శ్రీను(35), లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు.
కాగా, ఆదివారం నేపాల్ నుంచి హైదరాబాద్ లోడ్‌తో వస్తున్న లారీ గాలి కోసం డోర్ తీసి కూర్చున్నాడు. అయితే, ప్రమాదవశాత్తు వెళ్తున్న లారీలోంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని 108లో ఇచ్చాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఒడిశ్సాలోని భరంపూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడని తునికి చెందిన డ్రైవర్ నాగేశ్వరరావు తెలిపాడు.
లారీలోంచి పడి క్లీనర్ మృతి
Published Sun, Aug 9 2015 11:18 PM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM
Advertisement
Advertisement