‘బ్రేవ్’ కాదు.. ‘బేర్’మనాల్సిందే
అమలాపురం :రగిలే ఎండలు జీవనాన్ని దుర్భరం చేస్తుండగా మండే నిత్యావసర వస్తువుల ధరలు జిహ్వకు రుచుల ను దూరం చేస్తున్నాయి. కూరగాయ లు, మాంసం, చేపలు, బియ్యం.. ఇ లా.. సాపాటుకు సంబంధించిన ప్రతి దినుసు ధరా సామాన్యుడికి అందనంతగా పెరిగిపోవడంతో పూట గడవడం భారమవుతోంది. జిహ్వ తృప్తి చెందే లా తిని, ‘బ్రేవ్’మని తేన్చాలంటే శక్తికి మించిన పనవుతోంది. కూరగాయ ధ రలు మార్కెట్‌లో తారాజువ్వల్లా దూ సుకుపోతున్నాయి. రెండు నెలల క్రి తం కేజీ రూ.పది ఉన్న ఉల్లి ధర మడికి హోల్‌సేల్ మార్కెట్‌లో ప్రస్తుతం రూ.25 వరకు ఉండగా, మార్కెట్‌లో రూ.33 నుంచి రూ.35 వరకు పెరిగిం ది. పచ్చిమిర్చి ధర మడికిలో రూ.40 ఉంటే, మార్కెట్‌లో రూ.60 వరకు ఉంది. అల్లం ధర మడికిలో రూ.120 ఉండగా, మార్కెట్‌లో రూ.150 పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో బీరకాయ ధర కేజీ రూ.40 వరకు ఉంది. వీటితోపాటు టమాటా కేజీ రూ.32 పలుకుతోంది.
‘ముక్క’ ప్రియులకు ఇక్కట్లే..
మేక, కోడి మాంసం, చేపలు, రొయ్య ల ధరలు పెరిగిపోవడంతో ముక్కలేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రి యుల జిహ్వకు గడ్డుకాలం దాపురిం చింది. మేక మాంసం ధర కేజీ రూ. 400 వరకు పెరిగిపోవడంతో సామాన్యులు వంద గ్రాముల లెక్కన కొనుగో లు చేస్తున్నారు. కోడి బ్రాయిలర్ లైవ్ కేజీ రూ.100 ఉండగా, మాంసం కేజీ రూ.200 వరకు చేరింది. గ్రామీణులు ఎక్కువగా తినే లేయర్ కోడి లైవ్‌ధర కేజీ రూ.74 ఉండగా, మాంసం ధర రూ.150కు పెరిగింది. కోడిగుడ్డు చిల ్లర ధర రూ.4.50. చేపలు, రొయ్యల ధరలూ భారీగానే ఉన్నాయి. గత నెల లో ఉభయ గోదావరి జిల్లాల్లో చెరువుల్లో పెద్ద ఎత్తున చేపలు చనిపోతే కేజీ రూ.ఐదుకు తెగనమ్మారు. ఇప్పుడది రూ.90కి చేరింది. బహిరంగ మార్కెట్‌లో మాత్రం శీలావతి, బొచ్చు, గడ్డిమోసుల కేజీ ధర రూ.140 నుంచి రూ.150 వరకు ఉంది. చందువా, కొర్రమీను కేజీ రూ.300 వరకు పలుకుతున్నాయి. వెనామీ రొయ్యలే కాదు.. సేక (తెల్ల) రొయ్యల ధర సైతం కేజీ రూ.200 నుంచి రూ.220 వరకు ఉంది.
బియ్యం ధర వింటే భయం..
బియ్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. సన్నరకాల ధరలు గత రెండు నెలల్లో కేజీకి బ్రాండ్‌ను బట్టి కేజీకి రూ.ఐదు నుంచి రూ.ఏడు వరకు పెరిగాయి. నెల రోజుల క్రితం రూ.45 వరకు ఉన్న గిద్దమసూరి (రారైస్) కేజీ రూ.50 నుంచి రూ.52 వరకు పెరిగింది. గిద్దమసూరు స్టీమ్ రకాలను చాలా కంపెనీలు భారీగా పెంచివేశాయి. రూ.33 ఉన్న స్టీమ్ రకం ధరలు రూ.41 నుంచి రూ.46 వరకు పెరిగాయి. గిద్దమసూరిలోని పండారు రకాలు రూ.34 వరకు ఉంది. సామాన్యులు ఎక్కువ గా కొనుగోలు చేసే స్వర్ణ బియ్యం ధర సైతం పెరిగింది. ధాన్యానికి డిమాండ్ ఏర్పడిందనే వంకతో కేజీ రూ.24 ఉన్న ధరను రూ.26 వరకు పెంచారు. బస్తాకు రూ.50 వరకు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.