mc donalds
-
ఫేక్ చీజ్ వార్తలను ఖండించిన ప్రముఖ సంస్థ.. కస్టమర్ల ఆరోగ్యానికే ప్రాధాన్యం..
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌పై రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మెక్‌డొనాల్డ్స్ తను తయారుచేస్తున్న బర్గర్లు, నగ్గెట్లలో చీజ్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ఎఫ్‌డీఏ గుర్తించినట్లు ఇటీవల కొన్ని మీడియా కథనాల్లో వెల్లడైంది. దాంతో సంస్థ స్పందిస్తూ వినియోగదారుల ఆరోగ్యమే తమకు ప్రధానమని చెప్పింది. మహారాష్ట్రలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్ల్లో చీజ్ వాడడంలేదంటూ చాలా వార్తలు వస్తున్నాయిని వాటిలో నిజం లేదంటూ తెలిపింది. కంపెనీ తయారుచేస్తున్న ఉత్పత్తుల్లో అధిక నాణ్యమైన చీజ్‌ను వినియోగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తమ ఉత్పత్తులు తయారుచేస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్యను అధికారులకు వివరించినట్లు త్వరలో వారి తుది నిర్ణయాన్ని తెలియజేయనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: ‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి కస్టమర్లకు నాణ్యమైన, రుచికరమైన ఫుడ్‌ను అందించాలన్నదే తమ కంపెనీ లక్ష్యమని ప్రకటనలో చెప్పారు. సంస్థ ఎల్లప్పుడూ ఆహార ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ఆహార చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
యుద్ధం వస్తే ఏంటీ? కావాలంటే రూటు మార్చుతాం
భాషలు, ప్రాంతాలు, సంస్కృతులకు ఆవల దేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగుతుంటాయి. సాధ్యమైనంత వరకు ప్రజల సెంటిమెంట్‌ను హర్ట్ చేయకుండానే బిజినెస్ నడిపిస్తారు. ఎక్కడైనా సమస్య ఎదురైతే మరో దారిలో ముందుకు వెళ్తారు తప్పితే వ్యాపారాలను మొత్తానికే ఆపేది లేదు. అందుకు రష్యాలో మెక్‌డొనాల్డ్స్ ఉదంతం తాజా ఉదాహారణగా నిలుస్తోంది. రష్యాకు గుడ్‌బై అమెరికాకు చెందిన మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్లు ఉన్నారు. నోరూరించే పిజ్జాలు, బర్గర్ల రుచి చూసేందుకు పోటీ పడతారు. ముఖ్యంగా రష్యాలో అయితే మెక్‌డొనాల్డ్ రుచులు కోసం పడి చచ్చే జనాలు ఉన్నారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ గత మార్చిలో రష్యాలో తమ అవుట్‌లెట్స్, రెస్టారెంట్లను మూసేస్తున్నట్టు మెక్‌డొనాల్డ్ ప్రకటించింది. ఇకపై రష్యాతో వాణిజ్య సంబంధాలు ఉండవంటూ గుడ్‌బై చెప్పింది మెక్‌డొనాల్డ్. ఫుల్ డిమాండ్ మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లు ఇకపై రష్యాలో కనిపించబోవంటూ ఈ సంస్థకు చెందిన పిజ్జాలు, బర్గర్లు మరి అందుబాటులో ఉండవనే వార్తలు రష్యాను కుదిపేశాయి. రష్యన్లు పోలోమంటూ మెక్‌డొనాల్డ్ స్టోర్లకు పరుగులు పెట్టారు. అందుబాటులో ఉన్న వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో మెక్‌డొనాల్డ్ ప్రొడక్టుల కోసం బ్లాక్ మార్కెట్ సైతం భారీగా నడిచింది. రష్యన్ల ఆధ్వర్యంలో మెక్‌డొనాల్డ్ బ్రాండ్‌కి దాని ప్రొడక్టులకు ఉన్న డిమాండ్ మరోసారి బిజినెస్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పటికే రష్యాపై అమెరికా ప్రకటించిన కఠిన ఆంక్షల కారణంగా మెక్‌డొనాల్డ్ వేరే దారి లేకుండా పోయింది. ఇదే సమయంలో రష్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అలెగ్జాండర్ రంగంలోకి దిగాడు. రష్యాలో ఉన్న మెక్‌డొనాల్డ్‌కి చెందిన స్టోర్లు, రెస్టారెంట్లు అన్ని కలిపి 847 కొనేందుకు ముందుకు వచ్చారు. కొత్త లోగో ఇదే అలెగ్జాండర్ నేతృత్వంలో రష్యాలో త్వరలో మెక్‌డొనాల్డ్ రుచులు అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ మేరకు కొత్త పేరును ప్రకటించాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే రష్యాడేను పురస్కరించుకుని జూన్ 12న అఫిషియల్ లోగోను రిలీజ్ చేశారు. గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బర్గర్, రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపించేలా డిజైన్ చేసిన లోగోను ఫీలర్గా వదిలారు. దీనికి సంబంధించి మరింత సమాచారం త్వరలో వెలువడనుంది. చదవండి: కారులో శృంగారం.. రూ.40.83 కోట్ల నష్టపరిహారం! -
ఆ టేస్ట్ మళ్లీ దొరుకుద్దో లేదో.. ఒక్క మీల్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారక్కడ!
Russia-Ukraine War: నాటో, అమెరికా, యూరోపియన్ యూనియన్ల మాటేమో గానీ రష్యన్లకు వాళ్ల అధ్యక్షుడు పుతిన్ నుంచే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. దేశాధ్యక్షుడిగా పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలు చాపకింద నీరులా దేశంలో అరాచక పరిస్థితులకు దారి తీస్తున్నాయి. బ్రేక్ ఫాస్ట్ చేయాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. నాటో దేశాలతో దోస్తీ చేస్తూ రష్యాకు ప్రమాదకరంగా మారిందనె నెపంతో ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగాడు పుతిన్. వారాలు గడుస్తున్నా ఉక్రెయిన్ తలవంచడం లేదు.. యుద్ధం ముగియడం లేదు. మరోవైపు రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ యూరప్ దేశాలు, అమెరికా మిత్ర పక్షాలు రష్యాపై ఎడాపెడా ఆంక్షలు విధిస్తూ పోతున్నాయి. మెక్‌డొనాల్డ్ వంటి ఫుడ్ చైయిన్లు మొదలు యాపిల్, శామ్సంగ్ వంటి ఎలక్ట్రానిక్ దిగ్గజాలు రష్యాకు టాటా చెబుతున్నాయి. రష్యాతో వ్యాపారం చేయబోమంటూ ప్రసిద్ధ కంపెనీలు వరుసగా ఇస్తున్న ప్రకటనలు రష్యన్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మళ్లీ ఆ వస్తువులు మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయో ? అసలు రావో అనే సందేహంతో ముందస్తు కొనుగోళ్లు చేపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా రష్యా మార్కెట్లో వెస్ట్రన్ వస్తువులకు గిరాకీ పెరిగింది. దీనికి తగ్గట్టే బ్లాక్ మార్కెట్ కూడా పుంజుకుంది. ఉదాహారణకు పిజ్జాలు, బర్గర్ల వంటి ఫాస్ట్‌ఫుడ్ అందించే మెక్‌డొనాల్డ్ రష్యాతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. అంతే మెక్‌డొనాల్డ్స్ పిజ్జాలు, బర్గర్లను ఆఖరిసారి రుచి చూద్దామనుకుంటున్న రష్యన్ల సంఖ్య పెరిగిపోయింది. దీంతో గంటల తరబడి స్టోర్ల దగ్గర నిలబడి డొనాల్డ్ రుచులు ఆరగిస్తున్నారు. Russians stock up with McDonalds burgers. pic.twitter.com/HcgE0Nm4Rj — Max (@milk080808) March 11, 2022 మరికొందరు పెరిగిన డిమాండ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. భారీ ఎత్తున మెక్‌డొనాల్డ్స్ ఉత్పత్తులు కొని తమ ఇళ్లలోని ప్రిడ్జ్లలో నింపేస్తున్నారు. వాటిని పదింతల ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇండిపెండెండ్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం మెక్‌డొనాల్డ్ బిగ్బర్గర్ ధర 4,000 రూబుల్స్ (రూ. 2,300), సాఫ్ట్ డ్రింగ్, ఫ్రైస్‌తో కూడిన మీల్ ధర 250 పౌండ్లు (రూ.24,942)లుగా ఉంది. ఆఖరికి మెక్‌డొనాల్డ్ సిగ్నేచర్ లోగో ఉన్న అద్దాన్ని అమ్మకానికి పెట్టగా 75 యూఎస్ డాలర్ల (రూ.5,750)కి అమ్ముడైంది. చదవండి: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన మరో కంపెనీ..! -
తిక్క కుదిరిందా ఎలన్ మస్క్? అదిరిపోయే పంచ్ !
నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో.. నరులెవరు నడవనిది ఆ దార్లో నడిచెదరో అనే పాటకే కాదు నాకొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అనే పాపులర్ డైలాగ్‌కి కానీ పర్ఫెక్ట్గా సూటయ్యే పేరు ఎలన్‌మస్క్. భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేయడం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చూపిన నేర్పు అతన్ని ప్రపంచ కుబేరుడిని చేసింది. అయితే తన అలవాటు ప్రకారం ఏ మాట్లాడినా.. ఏ పని చేసినా వెటకారం జోడించడం ఎలన్‌మస్క్‌కి అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ వెటకారానికి మంచి రిటార్ట్ పడింది. కొంటె ట్వీట్ క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో వందల కొద్దీ కాయిన్స్ ఉన్నాయి. ఇందులో మీమ్స్ కాయిన్‌గా వచ్చింది డోజ్కాయిన్. ఎలన్‌మస్క్ ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఇది వరల్డ్ ఫేమస్ అయ్యింది. తాజాగా టెస్లా కార్లు కొనే సమయంలో డోజ్ కాయిన్ క్రిప్టో కరెన్సీని సైతం అంగీకరిస్తామంటూ మరింత పాపులర్ చేశారు ఎలన్‌మస్క్. తాను పెట్టుబడి పెట్టిన డోజ్ కాయిన్‌కు మరింత పాపులారిటీ తీసుకొచ్చే పనిలో మరో ట్వీట్ చేశాడు. డోజ్కాయిన్ తీసుకుంటారా? ఫేమస్ ఫుడ్ సప్లై చెయిన్ మెక్‌డొనాల్ట్స్ కనుక డోజ్ కాయిన్‌ను అంగీకరిస్తే నేను ఎంతో హ్యాపీగా మెక్‌డొనాల్డ్స్ అందించే ఫుడ్ తింటాను అంటూ కొంటెగా ట్వీట్ చేశారు. ఒకరోజు సమయం ఇచ్చిన మెక్‌డొనాల్డ్ ఎలన్‌మస్క్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తీసుకుంటాం.. కానీ క్రిప్టో కరెన్సీలో బాగా పాపులరైన బినాన్స్ స్మార్ట్ చెయిన్ నుంచి గ్రిమాకే కాయిన్స్ అంటూ కొత్త రకం మీమ్ కాయిన్ని రెడీ చేయించింది. ఆ తర్వాత ట్విట్టర్‌కి వెళ్లి డోజ్‌కాయిన్‌ని మెక్‌డొనాల్డ్‌లో అంగీకరిస్తాం. కానీ ఒక్క షరతు టెస్లా కార్లు కొనేప్పుడు మీరు గ్రిమాకే కాయిన్స్‌ను తీసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చింది. only if @tesla accepts grimacecoin https://t.co/CQrmAFelHR pic.twitter.com/to9HmYJhej — McDonald's (@McDonalds) January 25, 2022 ఎలన్‌మస్క్‌కి మెక్‌డొనాల్డ్ కంపెనీ ఇచ్చిన కౌంటర్ నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారింది. క్రిప్టో కరెన్సీ గురించి టెక్ వరల్డ్‌లో బోలెడంత చర్చ జరుగుతోంది. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ లాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఐనప్పటికీ క్రిప్టో కరెన్సీ ఇంకా జనసామాన్యంలోకి చొచ్చుకుపోలేదు. చదవండి:క్రిప్టో.. తగ్గేదేలే! -
ఆర్డర్ క్యాన్సిల్ చేసి.. సుబ్బరంగా మెక్కాడు
లండన్: ఫుడ్ డెలివరీ బాయ్‌ల నిర్వాకాలకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు వచ్చాయి. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్‌ని మార్గమధ్యలోనే ఒపెన్ చేసి తినడం వంటి వార్తలు గతంలో చాలా చూశాం. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసి.. వారు బుక్ చేసుకున్న ఆహారాన్ని తాను తినేశాడు. అది కూడా ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్ ఇంటి బయటనే కూర్చుని దర్జగా లాగించేశాడు. సదరు కస్టమర్ డెలివరీ బాయ్ చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. వివరాలు.. లండన్ కెంటిష్ టౌన్లో నివాసం ఉంటున్న మహిళ స్థానిక మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇక దాన్ని ట్రాక్ చేస్తుండగా.. ఇంటి దాక వచ్చిన ఆర్డర్ సడెన్‌గా క్యాన్సిల్ అయ్యింది. తన ప్రమేయం లేకుండా ఆర్డర్ ఎలా క్యాన్సిల్ అయ్యిందని ఆలోచిస్తుండగా.. తన ఇంటి బయట మెక్‌డొనాల్డ్స్ డెలివరీ బాయ్ కూర్చుని.. ఫుడ్‌ని ఒపెన్ చేయడం చూసింది. (చదవండి: వూహాన్లో కన్నీళ్లు పెట్టుకున్న డెలివరీ బాయ్) అనుమానంతో తనకు పంపిన డెలివరీ బాయ్ నంబర్‌కు కాల్ చేయగా.. తన ఇంటి బయట ఉన్న వ్యక్తి ఫోన్ రింగవ్వటం.. అతడు కట్ చేయడం ఆమె గమనించింది. ఆ తర్వాత సదరు డెలివరీ బాయ్ అక్కడే ఇంటి బయట కూర్చుని ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్‌ని సుబ్బరంగా లాగించేశాడు. ఈ తతంగం మొత్తాన్ని ఆమె వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోది. ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మా ఆహారం, సేవలతో కస్టమర్లు మనసు గెలుచుకోవాలనేది మా లక్ష్యం. ఇక ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే.. మాకు తెలియజేయండి. ఇలాంటి వాటిని మేం అస్సలు సహించం. ఇక ప్రస్తుతం జరిగిన సంఘటన గురించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
కింగ్ వడా పావ్
మెక్ డొనాల్డ్, డోమినోస్...అమెరికా టు ఇండియా...అబ్బో... అంటూ లొట్టలేస్తున్నశబ్దాలు వినిపించాయి.ఆ శబ్దాలు ధీరజ్‌కి కూడావినిపించాయి.తను కూడా లొట్టలువేయించాలనుకున్నాడు...తన మెదడుకు పదును పెట్టాడు.ముంబైలోని వడాపావ్పరిమాణం పెంచాడు.జంబో కింగ్‌ను ప్రారంభించాడు.అందరినీ ఆకట్టుకున్నాడు.ముంబైకి చెందిన ధీరజ్ గుప్తా...అతడు తన విజయం కోసం వేసినఅడుగులే ఈ నాటి ఫుడ్ ప్రింట్స్... రెండు దశాబ్దాల క్రితం అంటే 1998లో ముంబైలో ఎంబిఏ పూర్తి చేసిన ధీరజ్ గుప్తా సొంతంగా ఒక వ్యాపార సంస్థను స్థాపించాలనుకున్నాడు. ముందుగా స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టాలనుకున్నాడు. అందుకోసం చాలా కృషి చేశాడు. శ్రమకు తగ్గ ఫలితం లభించలేదు. రెండు సంవత్సరాల కాలంలో గుప్తా సుమారు 50 లక్షల సొమ్ము పోగొట్టుకున్నాడు. దురదృష్టమేమిటంటే, చేబదులు అడిగి తీసుకుని పెట్టుబడిగా పెట్టిన సొమ్ము ఇది. స్వీట్స్ వ్యాపారం గుప్తా జీవితంలో తీపి జ్ఞాపకాలను కాదు, పచ్చి వగరు చేదులను కలగలిపిన అనుభవాలను మిగిల్చింది. కొత్త రుచులు... ప్రతి పరాజయం విజయానికి మెట్టు కావాలనుకున్నాడు. ఈ రెండు సంవత్సరాల కాలం తన దృష్టిని మెక్‌డొనాల్డ్, డొమినోస్ సంస్థలు అమ్మే పిజ్జాలు, బర్గర్ల మీద కేంద్రీకరించాడు. ఇప్పుడు అందరికీ కొత్త రుచుల మీద మనసు మళ్లిందని అర్థం చేసుకున్నాడు. తన స్వీట్స్ బిజినెస్‌కు స్వస్తి పలికి, కొత్త రుచుల బాటలో అడుగులు ప్రారంభించాడు. విదేశాల నుంచి దిగుమతైన బర్గర్లు, పిజ్జాలకు బదులుగా స్థానిక వడాపావ్‌ను పాపులర్ చేయాలనుకున్నాడు. అప్పటికే మహారాష్ట్ర వీధులలో బాగా పాపులర్ అయిన వడాపావ్‌ను వీధినుంచి స్టార్ స్థాయికి తీసుకురావాలనుకున్నాడు. తన ఖరీదైన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి రెండు లక్షల రూపాయలు అప్పు చేసి, తన వడాపావ్‌కు ‘జంబో కింగ్’ అని పేరు పెట్టాడు. ఆ పేరున రిటైల్ చైన్ మార్కెట్ ప్రారంభించాడు. లాభాలతో ప్రారంభం... ముంబై మలాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో 200 చదరపు అడుగుల స్థలంలో 2001, ఆగస్టు 23న మొట్టమొదటి జంబో కింగ్ ఔట్లెట్ ప్రారంభమైంది. వడపావ్ సైజును 20 శాతం పెంచి, కంటికి ఇంపుగా కనిపించేలా తయారుచేసి, అమ్మకానికి సిద్ధం చేశాడు. ధీరజ్ గుప్తా ఆలోచన, శ్రమలకు ఫలితంగా మొట్టమొదటి రోజునే ఐదు వేల రూపాయల సరుకు అమ్మగలిగాడు. ఆ సంవత్సరం 40 లక్షల లాభం సంపాదించినా, మరో ఔట్లెట్ ప్రారంభించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2003లో మరో ఔట్లెట్ ప్రారంభమై, 2005 నాటికి ఐదు ఔట్లెట్ల స్థాయికి ఎదిగింది. మరింత ఎదగాలనుకున్నాడు. పరిశుభ్రత, ప్యాకింగ్ విషయాలలో జాగ్రత్త వహించాడు. జంబో కింగ్‌కు వచ్చి వడాపావ్ తిన్న వారంతా వాహ్! క్యా టేస్ట్ హై!! అంటూ ఇరుగుపొరుగువారిని కూడా రుచి చూసేలా చేశారు. పైసా ఖర్చు లేకుండా జంబో కింగ్‌కి ప్రచారం వచ్చేసింది. వారిని చూసి... 2006 నాటికి 100 మెక్‌డొనాల్డ్ స్టోర్లు దేశవ్యాప్తంగా విస్తరించడం చూసిన ధీరజ్ గుప్తా తాను కూడా ముంబై నుంచి బయటకు అడుగులు వేయాలనుకున్నాడు. తన కల సాకారం కావడానికి చాలా కాలం పట్టింది. 2007 నాటికి తన కల ఫలించింది. ఒక మల్టీ నేషనల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ జంబో కింగ్‌ను మార్కెటింగ్ చేయడానికి అంగీకరించింది. దాంతో గుప్తాకు బాలారిష్టాలన్నీ తొలగినట్లయింది. అన్ని నగరాలకు జంబో కింగ్ ఫ్రాంచైజ్ ఇచ్చేశారు గుప్తా. ఇప్పుడు జంబో కింగ్ 12 మహానగరాలకు వ్యాపించింది. వంద స్టోర్లు తెరుచుకున్నాయి. మరిన్ని నగరాలకు విస్తరించడానికి సన్నద్ధమవుతున్నారు గుప్తా. వడ పావ్ స్టాల్స్‌ని ఏటిఎంలలాగ దేశమంతా అందుబాటులోకి తీసుకు రావడమే గుప్తా కోరిక. ప్రతి ఫ్రాంచైన్ ఓనర్ ఒక పెద్ద వ్యాపారవేత్త అవుతున్నాడు. ప్రతి స్టోర్ విజయవంతంగా నడుస్తోంది. అందువల్ల జంబో కింగ్ కూడా వృద్ధిలోకి వస్తోంది. లాభాలతో ప్రయాణిస్తున్న జంబో కింగ్ ఇప్పుడు ఏడాదికి 35 శాతం నికర లాభంతో నడుస్తోంది. సైజులో మార్పు తెచ్చాడు. తన జీవితాన్నే మార్చేసుకున్నాడు ధీరజ్ గుప్తా. నాణ్యతప్రమాణాలు పాటిçస్తున్నారా లేదా, వినియోగదారులు తృప్తిగా ఉన్నారా లేదా అనే అంశం మీద ఆడిట్ చేస్తుంటాను. ఇందుకోసం కొందరు యువకులను నియోగించాను. వారు ఒక సాధారణ కస్టమర్లాగ స్టాల్‌కి వెళ్లి, పరీక్షిస్తుంటారు. ఇలా చేయడానికి ఒక్కో స్టోర్‌కి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. ఏ స్టోర్‌కి సంబంధించి నెగిటివ్ రిపోర్టు వచ్చినా, ఆ స్టోర్ మీద తగు చర్యలు తీసుకుంటాను. 100వ ఔట్లెట్ ప్రారంభించేనాటికి మా టర్నోవర్ 50 కోట్లకు ఎదగాలని కోరుకుంటున్నాను.– ధీరజ్ గుప్తా, జంబో కింగ్, ముంబై -
దక్షిణాది వంటకాలతో మెక్‌డోనాల్డ్స్
అమరావతి : దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు 'మెక్‌డోనాల్డ్' ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 242గా ఉన్న రెస్టారెంట్ల సంఖ్యను వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెక్‌డోనాల్డ్ ఇండియా బిజినెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ (సౌత్) గెరాల్డ్ డయాస్ తెలిపారు. కేవలం రెస్టారెంట్ల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా ఇక్కడివారి రుచులకు అనుగుణంగా మెనూ తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలవారు స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడతారని, వీరి కోసం ప్రత్యేక మెనూ తయారుచేసినట్లు తెలిపారు. విజయవాడలో తొలి మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాకాహారుల కోసం ప్రతీ రెస్టారెంట్లోనూ ప్రత్యేక కిచెన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత నెలలో నెల్లూరులో మొదటి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే గుంటూరు, విశాఖపట్నంలో రెస్టారెంట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. విజయవాడలోని రెస్టారెంట్‌కు వచ్చిన స్పందన చూసిన తర్వాత విస్తరణపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తెలంగాణాలో మెక్‌డోనాల్డ్ ప్రస్తుతం 21 రెస్టారెంట్లను కలిగి ఉంది. మొత్తం ఇండియా వ్యాపారంలో 40 శాతం కేవలం దక్షిణాది రాష్ట్రాల నుంచే సమకూరుతుండటంతో ఈ రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
పంచామృతం: సర్వర్లు, వెయిటర్లు, క్లీనర్లు!
‘‘పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చావడం మాత్రం నీ చేతగానితనమే...’’ అంటాడు వారన్ బఫెట్. ఆ అపర కుబేరుడు ఇలా అన్నట్లు తెలియకపోయినా, ఈ అక్షర సత్యాన్ని అర్థం చేసుకొని తమ జీవితాలను మలుపు తిప్పుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. శ్రమతో, ప్రతిభతో తమరాతను తిరగరాసుకున్న వాళ్లున్నారు. వాళ్లలో మనకు బాగా పరిచయం ఉన్న వాళ్లూ ఉన్నారు. అంటే సిల్వర్ స్క్రీన్‌మీద హీరోలుగా, ఆఫ్ స్క్రీన్‌లో సెలబ్రిటీలుగా వెలుగుతున్న వాళ్లు. విశేషం ఏమిటంటే హోటళ్లలో సర్వర్లుగా, వెయిటర్లుగా జీవితాన్ని మొదలు పెట్టిన వాళ్లు వీళ్లంతా. తర్వాత స్టార్ల హోదాకు చేరారు. స్మృతి ఇరానీ రాజకీయ నాయకురాలిగా, బుల్లితెర నటిగా గుర్తింపు ఉన్న వ్యక్తి స్మృతీ ఇరానీ. ఈ పార్శీ నటి ముంబైలోని మెక్‌డొనాల్డ్స్‌లో మెట్లు తుడిచేవారట! ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొన్నా అదృష్టం కలిసి రాలేదు. కానీ స్టార్‌ప్లస్ సీరియల్స్‌తో స్మృతి దశ తిరిగింది. అక్షయ్ కుమార్ బ్యాంకాక్‌లోని ఒక సాధారణ హోటల్లో వెయిటర్‌గా, గిన్నెలు కడిగేవాడిగా పనిచేశాడు ఈ కిలాడీ హీరో. కొన్ని సంవత్సరాల పాటు అదే వృత్తిలో కొనసాగిన అక్షయ్ అదే సమయాన్ని మరో విధంగానూ ఉపయోగించుకొన్నాడు. మార్షల్ ఆర్ట్స్‌కు కూడా ఫేమస్ అయిన బ్యాంకాక్‌లో వాటిని అవపోసన పట్టాడు. తర్వాత ఇండియా వచ్చేసి మార్షల్ ఆర్ట్స్‌లో ఉన్న ప్రవేశాన్నే అర్హతగా చేసుకొని సినిమా అవకాశాలను సంపాదించాడు. ఆ తర్వాత అక్షయ్ దశ తిరిగింది. బొమన్ ఇరానీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ లో డాక్టర్పాత్రతో ఈ పార్శీ నటుడి పేరు మార్మోగింది. అంతకు ముందు చిన్నాచితకా పాత్రలు చేసినా, సినిమా ఇండస్ట్రీకి రాకముందు చాలా కష్టాలే పడ్డాడు బొమన్. ముంబాయిలోని తాజ్‌మహల్ హోటల్లో రూమ్ సర్వీస్ బాయ్‌గా, వెయిటర్‌గా చాలా సంవత్సరాల పాటు పనిచేశాడు. నాడు ఎంగిలి ప్లేట్లు కడిగిన అతడే ఇప్పుడు జనం మెచ్చిన నటుడయ్యాడు. జిమ్ క్యారీ ఈ కెనడియన్ యాక్టర్ ‘బ్రూస్ ఆల్మైటీ’ సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సంపాదించాడు. తర్వాత అనేక సినిమాలకు స్ఫూర్తిగా నిలిచిన ‘బ్రూస్ ఆల్మైటీ’ కథలాగే, ఈ హీరో వ్యక్తిగత కథ కూడా స్ఫూర్తిమంతమైనదే. ఒక రెస్టారెంట్లో క్లీనింగ్ బాయ్‌గా, సెక్యూరిటీగా పనిచేశాడట జిమ్. ఆ సమయంలో తాను పాడై, నిలిపి ఉంచిన వ్యాన్‌లో తలదాచుకొనే వాడినని క్యారీ చెబుతాడు. లియనార్డో డికాప్రియో ‘టైటానిక్’ హీరో డికాప్రియో ఒకప్పుడు ఒక చీకటి ప్రపంచంలో జీవించేవాడు. చుట్టూ డ్రగ్ డీలర్స్, ప్రాస్టిట్యూట్స్... ఇలాంటి వారందరికీ సహాయకుడిగా, వాళ్లలో ఒకడిగా కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చాక డికాప్రియోకి వెల్కమ్ చెప్పింది ఒక హోటల్. అక్కడ సర్వర్‌గా పనిచేయడంతో అతడి కొత్త జీవితం మొదలైంది. అలా అలా... హాలీవుడ్లో వికసించింది.