భాషలు, ప్రాంతాలు, సంస్కృతులకు ఆవల దేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగుతుంటాయి. సాధ్యమైనంత వరకు ప్రజల సెంటిమెంట్‌ను హర్ట్ చేయకుండానే బిజినెస్ నడిపిస్తారు. ఎక్కడైనా సమస్య ఎదురైతే మరో దారిలో ముందుకు వెళ్తారు తప్పితే వ్యాపారాలను మొత్తానికే ఆపేది లేదు. అందుకు రష్యాలో మెక్‌డొనాల్డ్స్ ఉదంతం తాజా ఉదాహారణగా నిలుస్తోంది.
రష్యాకు గుడ్‌బై
అమెరికాకు చెందిన మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్లు ఉన్నారు. నోరూరించే పిజ్జాలు, బర్గర్ల రుచి చూసేందుకు పోటీ పడతారు. ముఖ్యంగా రష్యాలో అయితే మెక్‌డొనాల్డ్ రుచులు కోసం పడి చచ్చే జనాలు ఉన్నారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ గత మార్చిలో రష్యాలో తమ అవుట్‌లెట్స్, రెస్టారెంట్లను మూసేస్తున్నట్టు మెక్‌డొనాల్డ్ ప్రకటించింది. ఇకపై రష్యాతో వాణిజ్య సంబంధాలు ఉండవంటూ గుడ్‌బై చెప్పింది మెక్‌డొనాల్డ్.
ఫుల్ డిమాండ్
మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లు ఇకపై రష్యాలో కనిపించబోవంటూ ఈ సంస్థకు చెందిన పిజ్జాలు, బర్గర్లు మరి అందుబాటులో ఉండవనే వార్తలు రష్యాను కుదిపేశాయి. రష్యన్లు పోలోమంటూ మెక్‌డొనాల్డ్ స్టోర్లకు పరుగులు పెట్టారు. అందుబాటులో ఉన్న వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో మెక్‌డొనాల్డ్ ప్రొడక్టుల కోసం బ్లాక్ మార్కెట్ సైతం భారీగా నడిచింది.
రష్యన్ల ఆధ్వర్యంలో
మెక్‌డొనాల్డ్ బ్రాండ్‌కి దాని ప్రొడక్టులకు ఉన్న డిమాండ్ మరోసారి బిజినెస్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పటికే రష్యాపై అమెరికా ప్రకటించిన కఠిన ఆంక్షల కారణంగా మెక్‌డొనాల్డ్ వేరే దారి లేకుండా పోయింది. ఇదే సమయంలో రష్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అలెగ్జాండర్ రంగంలోకి దిగాడు. రష్యాలో ఉన్న మెక్‌డొనాల్డ్‌కి చెందిన స్టోర్లు, రెస్టారెంట్లు అన్ని కలిపి 847 కొనేందుకు ముందుకు వచ్చారు.
కొత్త లోగో ఇదే
అలెగ్జాండర్ నేతృత్వంలో రష్యాలో త్వరలో మెక్‌డొనాల్డ్ రుచులు అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ మేరకు కొత్త పేరును ప్రకటించాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే రష్యాడేను పురస్కరించుకుని జూన్ 12న అఫిషియల్ లోగోను రిలీజ్ చేశారు. గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బర్గర్, రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపించేలా డిజైన్ చేసిన లోగోను ఫీలర్‌గా వదిలారు. దీనికి సంబంధించి మరింత సమాచారం త్వరలో వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment