ప్రపంచ దేశాలకు రష్యా భారీ షాకిచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి తమ సహకారాన్ని 2024 నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంపై ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎస్‌ఎస్‌ను నివాసయోగ్యంగా మార్చే పవర్ సిస్టమ్స్‌ను యూఎస్ నిర్వహిస్తుంది. ఐఎస్‌ఎస్ నిర్ధేశిత కక్ష్యలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్షన్‌ను సిస్టంను రష్యా అందిస్తుంది. అయితే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా తప్పుబట్టడాన్ని రోగోజిన్ మండిపడ్డారు. ఐఎస్‌ఎస్ నుంచి తమ సేవల్ని నిలిపివేస‍్తామని హెచ్చరించారు.
ఈ క్రమంలో రష్యా స్పేస్ చీఫ్‌గా నియమితులైన యూరి బోరిసోవ్,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం యూరి బోరిసోవ్ మాట్లాడుతూ.. 2024లో ఐఎస్‌ఎస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాం. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించే ముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఇతర భాగస్వాములకు రష్యా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment