
నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో.. నరులెవరు నడవనిది ఆ దార్లో నడిచెదరో అనే పాటకే కాదు నాకొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అనే పాపులర్ డైలాగ్‌కి కానీ పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే పేరు ఎలన్‌మస్క్. భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేయడం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చూపిన నేర్పు అతన్ని ప్రపంచ కుబేరుడిని చేసింది. అయితే తన అలవాటు ప్రకారం ఏ మాట్లాడినా.. ఏ పని చేసినా వెటకారం జోడించడం ఎలన్‌మస్క్‌కి అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ వెటకారానికి మంచి రిటార్ట్ పడింది.
కొంటె ట్వీట్
క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో వందల కొద్దీ కాయిన్స్ ఉన్నాయి. ఇందులో మీమ్స్ కాయిన్‌గా వచ్చింది డోజ్‌కాయిన్. ఎలన్‌మస్క్ ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఇది వరల్డ్ ఫేమస్ అయ్యింది. తాజాగా టెస్లా కార్లు కొనే సమయంలో డోజ్ కాయిన్ క్రిప్టో కరెన్సీని సైతం అంగీకరిస్తామంటూ మరింత పాపులర్ చేశారు ఎలన్‌మస్క్. తాను పెట్టుబడి పెట్టిన డోజ్ కాయిన్‌కు మరింత పాపులారిటీ తీసుకొచ్చే పనిలో మరో ట్వీట్ చేశాడు.
డోజ్‌కాయిన్ తీసుకుంటారా?
ఫేమస్ ఫుడ్ సప్లై చెయిన్ మెక్‌డొనాల్ట్స్ కనుక డోజ్ కాయిన్‌ను అంగీకరిస్తే నేను ఎంతో హ్యాపీగా మెక్‌డొనాల్డ్స్ అందించే ఫుడ్ తింటాను అంటూ కొంటెగా ట్వీట్ చేశారు. ఒకరోజు సమయం ఇచ్చిన మెక్‌డొనాల్డ్ ఎలన్‌మస్క్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
తీసుకుంటాం.. కానీ
క్రిప్టో కరెన్సీలో బాగా పాపులరైన బినాన్స్ స్మార్ట్ చెయిన్ నుంచి గ్రిమాకే కాయిన్స్ అంటూ కొత్త రకం మీమ్ కాయిన్‌ని రెడీ చేయించింది. ఆ తర్వాత ట్విట్టర్‌కి వెళ్లి డోజ్‌కాయిన్‌ని మెక్‌డొనాల్డ్‌లో అంగీకరిస్తాం. కానీ ఒక్క షరతు టెస్లా కార్లు కొనేప్పుడు మీరు గ్రిమాకే కాయిన్స్‌ను తీసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చింది.
only if @tesla accepts grimacecoin https://t.co/CQrmAFelHR pic.twitter.com/to9HmYJhej
— McDonald's (@McDonalds) January 25, 2022
ఎలన్‌మస్క్‌కి మెక్‌డొనాల్డ్ కంపెనీ ఇచ్చిన కౌంటర్ నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారింది. క్రిప్టో కరెన్సీ గురించి టెక్ వరల్డ్‌లో బోలెడంత చర్చ జరుగుతోంది. ఎలన్‌మస్క్, టిమ్‌కుక్ లాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఐనప్పటికీ క్రిప్టో కరెన్సీ ఇంకా జనసామాన్యంలోకి చొచ్చుకుపోలేదు.
చదవండి:క్రిప్టో.. తగ్గేదేలే!
Comments
Please login to add a commentAdd a comment