అమెరికాలోని ఓ రెస్టరెంట్ వందేళ్లుగా ఒకే వంటనూనెను మళ్లీ మళ్లీ వాడి బర్గర్స్‌ను తయారుచేస్తోంది. పైగా ఇదే తమ అసలు రహస్యమంటూ ప్రచారం కూడా చేస్తోంది. అమెరికాలోని మెంఫిస్ పట్టణంలో ‘డయ్యర్స్ బర్గర్స్’ రెస్టరెంట్ రుచికరమైన బర్గర్స్‌కు ఫేమస్. 1912లో ఎల్మెర్ డాక్ దీనిని స్థాపించాడు.
ఒకరోజు అతను పాన్‌లోని నూనెను మార్చడం మర్చిపోయి, తర్వాతి రోజు అలాగే బర్గర్ తయారు చేశాడు. ఆ బర్గర్ తీసుకున్న వ్యక్తి ‘నా జీవితంలో నేను తిన్న రుచికరమైన బర్గర్ ఇదే!’ అని చెప్పడంతో డాక్ అప్పటి నుంచి ఆ నూనెను మార్చలేదు. అవసరానికి తగ్గట్టుగా దానికి మరింత నూనెను కలుపుతూ అలాగే వాడుతున్నాడు.
గత వందేళ్లుగా ఇలాగే చేస్తున్నట్లు ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో డాక్ కుమారుడు రాబర్ట్ చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్‌గా మారింది. కొంతమంది ఇదంతా అబద్ధమని, అసలు రహస్య పదార్థం వేరే ఉందని చెబుతుంటే, మరికొందరు దీనిని నమ్మి, బర్గర్‌ను ప్యాక్ చేయడానికి ముందు ఆ నూనెలో మరోసారి ముంచి డబుల్ డిప్ బర్గన్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ఏది ఏమైనా డయ్యర్స్ బర్గర్స్ ఎంతో రుచికరంగా ఉంటాయని అక్కడి వారందరూ ఒప్పుకుంటారు.
(చదవండి: కృత్రిమ మేధాజాలం వంటింట్లో మయాజాలం
Comments
Please login to add a commentAdd a comment