Best Indian Snack Recipes: How To Make Cheesy Corn Rolls Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Cheesy Corn Rolls Recipe: స్నాక్స్‌ కోసం..చీజ్‌ కార్న్‌ రోల్స్‌ ఇలా చేసుకోండి

Published Sat, Aug 5 2023 4:49 PM | Last Updated on Sat, Aug 5 2023 6:22 PM

How to Make Cheesy Corn Rolls Recipe In Telugu - Sakshi

చీజ్‌ కార్న్‌ రోల్స్‌ రెసిపికి కావల్సినవి
బంగాళ దుంపలు – మూడు; కార్న్‌ గింజలు – అరకప్పు; చీజ్‌ – అరకప్పు;
వెల్లుల్లి తురుము – టీస్పూను; కార్న్‌ స్టార్చ్‌ – టేబుల్‌ స్పూను; బ్రెడ్‌ స్లైసులు –నాలుగు;
కారం – అరటీస్పూను; గరం మసాలా – పావు టీస్పూను; ఛాట్‌ మసాలా – అరటీస్పూను;
మిరియాల పొడి – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.

తయారీ విధానమిలా.. 
బంగాళ దుంపలు, కార్న్‌ గింజలను విడివిడిగా ఉడికించాలి ∙బంగాళ దుంపల తొక్క తీసి చిదుముకోవాలి ∙దీనిలో కార్న్‌ గింజలు, వెల్లుల్లి తురుము, కార్న్‌స్టార్చ్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన బ్రెడ్‌స్లైసులను వేసి అన్నీ కలిసిపోయేలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి.

ఈ ఉండలకు వేలితో రంధ్రం చేసి చీజ్‌ను సన్నగా తురిమి పెట్టాలి  తరువాత రంధ్రాలని మూసేసి రోల్స్‌ ఆకారం లో వత్తుకోవాలి ∙ఇలా అన్ని ఉండలను రోల్స్‌ చేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి, సాస్‌తో సర్వ్‌ చేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement