పాల కంపెనీ కొంప ముంచిన 'మిల్కీ బ్యూటీలు' | Dairy employees bathe in vat full of milk, invite food safety probe | Sakshi
Sakshi News home page

పాల కంపెనీ కొంప ముంచిన 'మిల్కీ బ్యూటీలు'

Published Sat, Apr 5 2014 11:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

పాల కంపెనీ కొంప ముంచిన 'మిల్కీ బ్యూటీలు'

పాల కంపెనీ కొంప ముంచిన 'మిల్కీ బ్యూటీలు'

డెయిరీ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీ ఉద్యోగులందరూ స్వీట్లు, చాకొలెట్లు తయారు చేసేందుకు ఉపయోగించే టబ్బుల కొద్దీ పాలల్లో సరిగంగ స్నానాలు చేయడం ఇప్పుడు రష్యాలోని ఒక చీజ్ ఫ్యాక్టరీ కొంప ముంచేసింది. ఉద్యోగులు స్నానాలు చేయడమే కాదు, తమ పాలజలకాలాటను వీడియో తీసి యూట్యూబ్ లో కూడా పెట్టేశారట. అదిప్పుడు ప్రపంచమంతా చూసేసింది. కంపెనీ ఉత్పత్తులు కొనడానికి ఇక ఎవరూ ముందుకు రావడం లేదు.


ఇప్పుడు సైబీరియా ప్రాంతంలోని ఓమ్స్క్ అనే చోట ఉన్న ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రష్యన్ ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది. 'ఈ పాలతోనే కంపెనీ పాలుత్పత్తులను తయారు చేస్తోందన్నది నిజం. కాబట్టి విచారణ చేసి దోషులను శిక్షించడం తప్పనిసరి.' అని ఒక అధికారి ప్రకటించాడు.


ఆరుగురు ఉద్యోగులు షార్ట్ర్ తప్ప మరేమీ లేకుండా ఈ పాల తొట్టిలో మునిగి తేలుతూ విక్టరీ సింబల్ ను చూపిస్తున్న వీడియోలను యూట్యూబు లో మూడు లక్షల మంది చూశారు. ఓమ్స్క్ చీజ్ కంపెనీ ఏటా 49 టన్నుల చీజ్ ను తయారు చేసి అమ్ముతుంది. ఇప్పుడు ఈ జలకాలాట ఫ్యాక్టరీ యజమానికి ప్రాణసంకటంగా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement