సమ్మర్‌ స్పెషల్‌: చిరిగినదానికి ఇంత ఖరీదా? | Trending: Prada Sells Yellow Sweater With Holes For Rs 90k | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌: చిరిగిన స్వెటర్‌కు ఇన్ని వేలా?

Published Mon, Feb 1 2021 8:41 PM | Last Updated on Mon, Feb 1 2021 8:53 PM

Trending: Prada Sells Yellow Sweater With Holes For Rs 90k - Sakshi

వేసవి కాలం రానేలేదూ అప్పుడే మధ్యాహ్నం ఎండలు దంచేస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు శీతాకాలం డ్రెస్సుల కోసం చూసిన కళ్లన్నీ ఇప్పుడు సమ్మర్‌వేర్‌ కోసం వెతుకులాట మొదలు పెట్టాయి. ఈ క్రమంలో పైన కనిపిస్తున్న స్వెటర్‌ ఓ వ్యక్తి కంట పడింది. వార్నీ, ఇది సమ్మర్‌ స్వెటరా? అని కొన్ని క్షణాలపాటు తత్తరపాటుకు లోనైన అతడు దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇంకేముందీ నెట్టింట ఇప్పుడీ స్వెటర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. (చదవండి: ఛీ ఛీ.. అసెంబ్లీలో ఇదేం పాడుపని!)

ఇటాలియన్‌ ఫ్యాషన్‌ రంగానికి చెందిన ప్రద కంపెనీ ఓ పసుపు రంగు స్వెటర్‌ను అమ్మకానికి పెట్టింది. అయితే దానికి ఎక్కడపడితే అక్కడ రంధ్రాలు పెట్టి మరీ అమ్ముతుండటం ప్రత్యేకత. పైగా దాని ధరెంత అనుకుంటున్నారు. ఇంచుమించు 90,656 రూపాయలు. ధరకు దానికి ఏమాత్రం సంబంధం లేనట్లు కనిపిస్తోన్న ఈ స్వెటర్‌ను చూసిన ఓ ట్విటర్‌ యూజర్‌ దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 'ఈ స్వెటర్‌ నాకు స్విస్‌ చీజ్‌ను గుర్తు చేస్తోంది' అని రాసుకొచ్చాడు. కొందరు నెటిజన్లు సైతం 'అవును, అది చీజ్‌ను తలపిస్తోందని లొట్టలేస్తుండగా మరికొందరు మాత్రం అదేమ్‌ స్వెటర్‌రా బాబూ' అని విమర్శిస్తున్నారు. 'అయినా చిరిగినట్లు కనిపిస్తోన్న దీనికి అన్ని వేల రూపాయలా?' అని పలువురు నోరెళ్లబెడుతున్నారు. (చదవండి: ఆస్తి 5 మిలియన్‌ డాలర్లు.. కానీ తినేది..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement