ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టూల్స్ చాట్‌జీపీటీని విడుదలైన రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వాడటం మొదలుపెట్టారు. దీంతో ఏఐ టెక్నాలజీ ముంచుకొస్తుంది. సమీప భవిష్యత్‌లో కృత్రిమ మేధ ఆధారిత చాట్ జీపీటీ చాట్‌బోట్‌లతో భర్తీ చేస్తాయోమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ‘మానవాళి మనుగడకు టెక్నాలజీ ముప్పు’ అనే భయం నుంచి కాస్త ఉపశమనం కలిగించే ఘటన జరిగింది.
కొన్నేళ్ల క్రితం ఏఐ టెక‍్నాలజీతో పనిచేసే రోబోట్ ఫిజ్జా డెలివరీ స్టార్టప్ 500 అమెరికన్ డాలర్ల ఫండ్‌ను సేకరించింది. కానీ, ఇప్పుడు ఆ సంస్థ దివాళా తీసింది. అందుకు కారణం ఏఐ ఆధారిత రోబోట్ టెక్నాలజీ కారణమని తెలుస్తోంది.
అమెరికన్ టెక్ మీడియా సంస్థ ‘ది ఇన్ఫర్మేషన్’ కథనం మేరకు..కొన్నేళ్ల క్రితం పిజ్జాలను తయారు చేసేందుకు రోబోట్‌లను ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన పిజ్జా తయారీ నిర్వాహకుల మదిలో మెదిలింది. కానీ టెక్నాలజీ పరంగా అనే ఒడిదుడుకులు ఎదురువుతాయనే అంచనాతో అనేక సంస్థలు తమ ఆలోచనల్ని ఆచరణలో పెట్టలేకపోయాయి.
అదే సమయంలో 2015లో జుమే (Zume) సంస్థ ఏఐ ఆధారిత రోబోట్‌తో పిజ్జాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చింది. నిర‍్వహణకోసం ఇన్వెస్టర్ల నుంచి కావాల్సిన నిధుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అనూహ్యంగా సాఫ్ట్ బ్యాంక్ కంపెనీతో సహా, పెట్టుబడిదారులు జుమేలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడ్డారు. వెరసీ 500 మిలియన్ డాలర్లను సమీకరించింది.
మార్కెట్‌లో కృత్రిమ మేధ ఊహించని పురోగతి సాధించినప్పటికీ పిజ్జాను తయారు చేయడంలో విఫలమైంది. పిజ్జా తయారీ కోసం వెన్నను వినియోగించాలి. అయితే, తయారు చేసిన పిజ్జాను ముక్కలు, ముక్కలుగా చేసుకొని తినే సమయంలో అందులోని వెన్న కరిగిపోకుండా, అలాగే జారిపోకుండా నిరోధించేందుకు అనేక కంపెనీలు విఫలమవుతూ వచ్చాయి. వాటిల్లో జుమే ఒకటి.
రోబోట్‌లతో పిజ్జాలను తయారు చేసే సమయంలో తలెత్తే ఈ సమస్యకు జుమే సైతం పరిష్కారం చూపలేకపోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఫండింగ్ ఇవ్వడం ఆపేశారు. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు సగానికిపైగా ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా, సంస్థ దివాళా తీసింది.
ఈ తరుణంలో ప్రస్తుత మార్కెట్‌లో ఏఐపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ సామర్ధ్యం పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రావాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని, అందుకు షట్ డౌన్ చేసిన జుమే సంస్థేనని చెబుతున్నారు. అప్పటి వరకు మానవాళి మనుగడకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు.
చదవండి👉 ‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్‌కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు!
Comments
Please login to add a commentAdd a comment