ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్‌జీపీటీ ఇప్పుడు మరో సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఇన్ని రోజులు యూజర్లు వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చాట్‌జీపీటీతో తమ గుణగణాలకు సరిపోయే భాగస్వామిని వెతుక్కుంటున్నారు.
తాజాగా, రష్యాకు చెందిన అలెగ్జాండర్ జాదన్ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారారు. డేటింగ్ యాప్ టిండర్‌లో తనకు తగ్గ యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ విఫలమయ్యాడు. తాను కొత్తగా ఓ అమ్మాయిని కలిసిన ప్రతి సారి ఏదో ఒక ప్రశ్నలు తలెత్తేవి. ఈ ప్రశ్నల ప్రవాహానికి పులిస్టాప్ పెట్టేందుకు చాట్‌జీపీటీని ఆశ్రయించాడు.
చాట్‌జీపీటీని టిండర్‌లో మ్యాచ్‌మేకర్‌గా మార్చాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఉపయోగించి ఓ బాట్‌ను తయారు చేశాడు. ఆ బాట్ సాయంతో సుమారు టిండర్‌లో తనకు సరిపోయే అమ్మాయి కోసం సుమారు 5240 మందిని తన ప్రొఫైల్‌తో మ్యాచ్ చేసి.. అందులో ఒక్క అమ్మాయిని త్వరలో వివాహం చేసుకోనున్నాడు.
Сделал предложение девушке, с которой ChatGPT общался за меня год. Для этого нейросеть переобщалась с другими 5239 девушками, которых отсеила как ненужных и оставила только одну. Поделюсь, как сделал такую систему, какие были проблемы и что вышло с остальными девушками. Тред pic.twitter.com/fbVO7OmZhF
— Aleksandr Zhadan (@biblikz) January 30, 2024
టిండర్‌లో తనని ఏడాది నుంచి కమ్యునికేట్ అవుతున్న యువతిని చాట్‌జీపీటీ సాయంతో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇందుకోసం మెషిన్ లెర్నింగ్‌లో ఓ భాగమైన ఆర్టిఫిషియల్ న్యూరాల్ నెట్‌వర్క్‌తో 5240లో ఒక్క అమ్మాయిని ఎంపిక చేసుకోగలిగానని ట్వీట్ చేశాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? దానికి కథాకమామిషు ఏంటో చెప్పకనే చెప్పాడు.
‘నేను ఓ యువతిని గాఢంగా ప్రేమించాను. కానీ అన్వేక కారణాల వల్ల రెండేళ్లకే విడిపోవాల్సి వచ్చింది. ప్రేమ చేసిన గాయానికి తట్టుకోలేకపోయాను. కొన్ని నెలల పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. చివరికి దాన్ని నుంచి తేరుకునేందుకు టిండర్‌లో మరో యువతి కోసం ప్రయత్నించా. అలా ఒక యువతితో ప్రారంభమై 5240 మందిని వెతుక్కున్నాను. ఫలితం శూన్యం
డేటింగ్ యాప్‌లో తనకు నచ్చిన అమ్మాయిని చూసుకోవడం, ఆమెతో చాటింగ్ చేయడం, నేరుగా కలుసుకోవడం ఇలా చేస్తుండేవాడిని. ఈ ప్రాసెస్‌లో లెక్కలేనన్ని అవమానాలు,రిజెక్షన్‌లు ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా చాట్‌జీపీటీని ఆశ్రయించి నాలోని బాధను వెళ్లగక్కాను. నాకే ఎందుకిలా జరుగుతుందని చాట్‌జీపీని ప్రశ్నించా. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టూల్‌ను తయారు చేశాను. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ తనకు భార్యగా కరీనానే సరైన జోడిగా నిర్ణయించింది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానంటూ అలెగ్జాండర్ జాదన్ తన కథను ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment