అమెరికన్ మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాడ్స్‌కు భారత్‌లో ‘చీజ్ బర్గర్లు’ తిప్పలు తెచ్చిపెట్టాయి.
పశ్చిమ, దక్షిణ భారతదేశంలో మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లను నిర్వహించే వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ పేర్లు మార్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మహారాష్ట్ర ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ గత ఏడాది నెల రోజులపాటు విచారణ జరిపి ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్లు, నగ్గెట్‌లలో వెజిటబుల్ ఆయిల్ వంటి చౌకైన చీజ్ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తోందని తేల్చింది. మెక్‌డొనాల్డ్స్‌లో అందించే బ్లూబెర్రీ చీజ్‌కేక్‌లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కంటెంట్ ఉన్నందున వాటిని చీజ్‌కేక్‌గా నిర్వచించలేమని ఫుడ్ రెగ్యులేటరీ బాడీ తీర్పు చెప్పింది.
మెక్‌డొనాల్డ్ సరైన లేబులింగ్ లేకుండా అనేక వస్తువులలో చీజ్ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తోందని, తద్వారా నిజమైన చీజ్ తింటున్నట్లు వినియోగదారులను తప్పుదారి పట్టించారని ఆరోపించింది. అహ్మద్‌నగర్‌లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్ లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఫుడ్ ఐటమ్స్ పేర్లలో "చీజ్" అనే పదాన్ని వెస్ట్‌లైఫ్ లిమిటెడ్ తొలగించిందని, ఈ మేరకు సవరించిన మెనూను మహారాష్ట్ర ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసిందని డిసెంబర్ 18 నాటి లేఖను ఉటంకిస్తూ ఎన్‌డీటీవీ ప్రాఫిట్ కథనాన్ని ప్రచురించింది. కేసు అహ్మద్‌నగర్‌కు సంబంధించినది అయినప్పటికీ, దిద్దుబాటు చర్యను జాతీయంగా విస్తరించడం కోసం ఫాస్ట్‌ఫుడ్ చైన్‌పై ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరిస్తుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment