parotta
-
టేస్టీ టేస్టీ స్వీట్ పొటాటో బొబ్బట్లు మీకోసమే..!
కావలసినవి: చిలగడదుంపలు – 2 (మెత్తగా ఉడికించి, చల్లారాక, తొక్క తీసి.. కొద్దిగా పాలు కలిపి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి) గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు పసుపు – పావు టీ స్పూన్, నెయ్యి – 1 టేబుల్ స్పూన్ నీళ్లు – సరిపడా, బాదం, జీడిపప్పు – 15 చొప్పున ఏలకులు – 4, నెయ్యి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ – పావు కప్పు బెల్లం తురుము – అర కప్పు ఉప్పు – చిటికెడు తయారీ విధానం: ముందుగా జీడిపప్పు, బాదం, ఏలకులు మిక్సీలో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని.. అందులో గోధుమ పిండి, ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని 10 నిమిషాల పాటు మూతపెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్‌లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసుకుని సుమారు 2 నుంచి 3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ చిన్నమంట మీద దోరగా వేయించాలి. అందులో చిలగడదుంప పేస్ట్ వేసుకుని గరిటెతో తిప్పుతూ.. మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అనంతరం బెల్లం తురుము వేసుకుని కలుపుతూ ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత జీడిపప్పు మిశ్రమం వేసుకుని కలపాలి. మరో టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా తిప్పి.. ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అనంతరం గోధుమ పిండి ముద్దను.. చిన్నచిన్న నిమ్మకాయ సైజ్ బాల్స్‌లా తీసుకుని.. గిన్నెలా ఒత్తుకుని.. దానిలో కొద్దికొద్దిగా చిలగడదుంప మిశ్రమాన్ని పెట్టుకుని బాల్స్‌లా చుట్టుకోవాలి. వాటిపై కొద్దికొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకుంటూ.. చపాతీల్లా చేసుకుని.. నేతిలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చదవండి: మీరెప్పుడైనా బ్రెడ్‌ని కీమా చేస్తూ రెసిపీ చేశారా..! -
ఆనంద్ మహీంద్రా ఫిదా బాహుబలి పరోటా..
-
పరోట తిని వ్యక్తి మృతి
అన్నానగర్: పరోట తిన్న కొద్దిసేపటికే ఛాతి నొప్పితో వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని సిత్తర్పట్టికి చెందిన రామకృష్ణన్ (39) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ సదురగిరిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో లారీ డ్రైవర్‌గా చేరాడు. అదే పట్టణానికి చెందిన వీరముత్తు, రామకృష్ణన్ లారీలో సరుకులు ఎక్కించుకుని నిలకోటై సమీపంలోని విలంపట్టి ప్రైవేట్ మిల్లుకు వచ్చారు. గురువారం రాత్రి ఇద్దరూ అక్కడున్న ఓ కేఫ్‌లో పరోటా తిన్నారు. కొద్దిసేపటికి రామకృష్ణన్‌కు ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే చికిత్స నిమిత్తం నిలకోటై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. అతని తల్లి ఇన్బవల్లికి.. పోలీసులకు సమాచారం అందించారు. విలంపట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. -
శివారులో వినూత్న హోటళ్లు
కర్నూలు: ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు ఎలాంటి పని మీద కర్నూలుకు వచ్చి టిఫిన్ తినాలనుకున్నా, మధ్యాహ్నం ఆకలి తీర్చుకోవాలన్నా.. రాత్రికి నాలుగు మెతుకులు గొంతు దిగాలన్నా ముందుగా గుర్తుకొచ్చే పేర్లు అజంతా, గోపి, హిందుస్తాన్, రమా దర్శన్, గీతా లంచ్హోం, అమరావతి.. తరహా పదుల సంఖ్యలో హోటళ్లు మాత్రమే. అప్పటి జనాభాకు అనుగుణంగా ఈ హోటళ్లు ఎంతో రుచికరమైన అల్పాహారంతో పాటు షడ్రుచులను అందించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాయి. ఇందులో కొన్ని హోటళ్లు మారిన కాలంతో పాటు భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసుకొని ఇప్పటికీ ఉనికి చాటుకుంటున్నాయి. అయితే నగరం వేగంగా విస్తరించడంతో పాటు నాలుక భిన్న ఆహారాన్ని కోరుకోవడంతో అందుకు అనుగుణంగా హోటళ్లు వెలుస్తూ వచ్చాయి. ఇప్పుడు నగరంలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ భారీ రెస్టారెంట్లు స్వాగతం పలుకుతున్నాయి. జాతీయ రహదారుల్లో దారి పొడవునా ఆకలి తీర్చే ఘుమఘుమలు వాహనాలు ముందుకు కదలనివ్వవంటే అతిశయోక్తి కాదు. ఒక్క పూటైనా కలిసి మెలసి భోజనం నగర వాతావరణానికి అలవాటుపడిన చాలా కుటుంబాలు, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో ఇటీవల కాలంలో ఇంట్లో వంట చేసుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్త ఊరట పొందేందుకు, ఇంటిల్లిపాదీ కలసి భోజనం చేసేందుకు అనువుగా హోటళ్లు ఏర్పాటయ్యాయి. ఇక ఇటీవల నగరంలోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో బ్రిడ్జి కింద రూపుదిద్దుకున్న ఖానా ఖజానా ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఆకలి తీరుస్తోంది. సాయంత్రం వేళ వెలుగుజిలుగులు మధ్య ఇక్కడి అల్పాహార.. వెజ్, నాన్ వెజ్ ఆహారం తియ్యని అనుభూతి మిగులుస్తోంది. అదేవిధంగా ఇంకాస్త ప్రయాణం చేసి ఊరి బయటకు వెళ్లాలనుకునే వారికి, సమయం వెచ్చించాలనుకుంటే అందుకు అనువైన హోటళ్లు కూడా రారమ్మని ఆహ్వానిస్తుండటం విశేషం. సరికొత్త రుచులు ఒకప్పుడు హోటళ్లకు వెళితే ఇడ్డీ, వడ, దోశ.. మధ్యాహ్నమైతే అరిటాకులో వడ్డించే భోజనం.. రాత్రికి వీటితో పాటు చపాతి, పరోటా అదనం. మాంసాహార ప్రియులకు బిర్యానీ ఉండనే ఉంటుంది. ఇప్పుడు వీటితో పాటు సరికొత్త రుచులు భోజన ప్రియులను హోటళ్ల వైపునకు కాళ్లు కదిపేలా చేస్తున్నాయి. రకరకాల బిర్యానీలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై తదితర మహానగరాల్లో లభించే అన్నిరకాల వంటకాలు దాదాపుగా ఇక్కడ లభ్యమవుతున్నాయి. కేఎఫ్‌సీ, బార్బీక్యూ, ఇంకా ఎన్నో ఇప్పుడు నగరంలోనే అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పాతబస్టాండ్ ప్రాంతంలో నెయ్యి దోశ నోరూరిస్తుంది. రకరకాల వంటకాలు దాదాపుగా ప్రతి హోటల్లో వెజ్, నాన్ వెజ్ భోజనాలు లభిస్తున్నా.. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను సొంతం చేసుకుంటున్నారు. ఒకచోట కుండ బిర్యానీ, మరోచోట చిట్టి ముత్యాల బిర్యానీ, మరోచోట రాగిముద్ద తలకాయ కూర.. ఇంకోచోట నెల్లూరు చేపల పుసులు.. ఇక మటన్ కడ్డీలు నోరూరిస్తుంటాయి. ఇటీవల కాలంలో మండీ భోజనం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక భారీ ప్లేట్లో ఇంటిల్లిపాదీ భోజనం చేసే సదుపాయం ఉండటం సరికొత్త అనుభూతిని పంచుతోంది. అదేవిధంగా బకెట్ బిర్యానీ ప్యాకింగ్‌లోనూ వినూత్న పంథాకు అద్దం పడుతోంది. ఒకరు.. ఇద్దరు.. నలుగురు.. ఆరుగురు.. పది మంది వరకు తినేలా ఈ బకెట్ బిర్యానీలను సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యానికి అనువుగా.. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో వ్యాధుల తీవ్రత కూడా అదేస్థాయిలో ఉంటోంది. చిన్న వయస్సులోనే బీసీ, షుగర్, క్యాన్సర్ మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఆ రోగాల నుంచి బయటపడేందుకు జేబుకు చిల్లు పెట్టుకోక తప్పనిపరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆహార అలవాట్లలో మార్పు చేసుకుంటున్నారు. తద్వారా కొద్ది వరకైనా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చనే భావన కనిపిస్తోంది. ఇందుకు అనుగుణంగా నగరంలో పలుచోట్ల మిల్లెట్ హోటళ్లు కూడా ఏర్పాటయ్యాయి. చిరుధాన్యాలతో తయారు చేసిన ఇడ్లీ, దోశ, పూరీలు ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. ఇదే సమయంలో రాగి సంకటితో పాటు జొన్నరెట్టె కూడా కడుపును చల్లబరుస్తూ బలాన్ని చేకూరుస్తుండటం విశేషం. శివారులో వినూత్న హోటళ్లు జాతీయ రహదారుల వెంట వెలసిన హోటళ్లు భోజన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులతో పాటు నగరవాసులు సైతం ఈ హోటళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయా హోటళ్లలో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి సినిమాలు, పాటలను ప్రదర్శిస్తున్నారు. ఇక క్రికెట్ మ్యాచ్‌లు ఉంటే.. ఆ రోజుల్లో సందడే సందడి. ముందుగానే టేబుళ్లు బుక్ చేసుకొని మరీ ఈ రెస్టారెంట్లకు క్యూకడుతున్నారు. ఒక హోటల్ ఎదుట ఏర్పాటు చేసిన ఏనుగు అటుఇటూ కదులుతూ, పిల్లలకు సరికొత్త అనుభూతిని మిగులుస్తున్నాయి. అసలైన ఏనుగునే ఇలా నిల్చోబెట్టారా అనే భావన కలిగించే రీతిలో నిర్వాహకులు ఈ సెట్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఓ యజమాని ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా విమానాన్నే హోటల్‌గా మారుస్తున్న తీరు చూస్తే ఈ రంగం ఏస్థాయిలో విస్తరిస్తుందో అర్థమవుతోంది. కేరళ ఆపం: నగర శివారులోని ఓ చిన్న దుకాణంలో ఏర్పాటు చేసిన హోటల్ ఇటీవల కాలంలో తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. కేరళవాసులకే పరిమితమైన ఆపం ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన ఇద్దరు అన్నదమ్ములు ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. స్వయంగా వీరిద్దరే ఆపం తయారు చేస్తూ చెట్నీతో పాటు నాన్ వెజ్తోనూ అందిస్తున్నారు. కొత్త వంటకాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుందనేందుకు వీరి వినూత్న ఆలోచనే నిదర్శనం. కోకోనట్ జ్యూస్: ఇప్పటి వరకు టెంకాయ నీళ్లను మాత్రమే తాగిన వాళ్లకు.. ఈ దుకాణానికి వస్తే సరికొత్త రుచి లభిస్తుంది. బయట ఒక టెంకాయ కొనుగోలు చేయాలంటే రూ.50 తీసుకుంటున్నారు. ఇదే ధరతో ఇక్కడ కోకోనట్ జ్యూస్ లభిస్తుంది. ఇందులో టెంకాయ నీళ్లకు తోడు అందులోని కొబ్బరి, గ్లూకోస్, కాస్త చక్కెరను మిక్సీలో వేసి జ్యూస్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనికి అదనంగా ఫ్లేవర్ కోరుకునే వాళ్లకు మరో రూ.10 అదనంగా తీసుకొని సీజన్‌కు అనుగుణంగా లభించే పండ్లతో కూడిన కోకోనట్ జ్యూస్‌తో ఆకట్టుకుంటున్నారు. చిట్టిముత్యాల బిర్యానీ ఎంతో రుచి వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కర్నూలుకు వచ్చిన ప్రతీసారి నగర శివారులోని రెస్టారెంట్లో చిట్టిముత్యాల బిర్యానీ తినడం అలవాటుగా మారింది. శివారు ప్రాంతం కావడంతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వాహనాల పార్కింగ్‌కు అనువుగా ఉండటంతో వీలైనంత వరకు ఇలాంటి హోటళ్లకే వెళ్తుంటా. – వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా -
రూ.500 నోటుతో పరాటా.. చివరకు ఏమైందంటే?
-
Hyderabad: పరోటాలో ప్లాస్టిక్ కవర్.. ఇదేమని అడిగితే!
సాక్షి, హైదరాబాద్: అల్పాహారం తిందామని హోటల్‌కు వెళ్లి పరోటా ఆర్డర్ ఇస్తే అందులో ప్లాస్టిక్ కవర్ దర్శనమిచ్చింది. ఇదేమని హోటల్ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... జి.గణేష్ అనే యువకుడు గురువారం ఉదయం 10 గంటలకు వనస్థలిపురం పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో పరోటా ఆర్డర్ చేశాడు. తింటుండగా మధ్యలో ప్లాస్టిక్ కవర్ వచ్చింది. ఇదేమని అడిగితే హోటల్ వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆన్లైన్లో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటల్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. -
ఈ ఫొటో చూసి మీ మాస్కు తినేయకండి
మధురై: ఫొటో చూడగానే కొంత ఆశ్చర్యం, మరికొంత సందేహం కలుగుతోందా?.. కానీ, మీరు అవునన్నా, కాదన్నా అది మాస్కే. కాకపోతే ముఖానికి ధరించే మాస్క్ మాత్రం కాదు. అచ్చంగా, స్వచ్ఛంగా పిండితో చేసిన నోరూరించే "పరోటా మాస్క్". తమిళనాడులోని మధురైలోని రెస్టారెంట్ నిర్వాహకులకు వచ్చిందీ అద్భుత ఆలోచన. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈ ఆలోచన అమలు చేయడం ద్వారా అటు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఇటు బిజినెస్ కూడా బాగుంటోంది. మొదట్లో రెండు మాస్క్ పరోటాలు ఉండే ప్లేట్‌ను 40 రూపాయలుగా నిర్ధారించారు. కానీ దానికి విపరీతమైన డిమాండ్ రావడంతో ఆ ధరను 50 రూపాయలకు పెంచారు. (బడా బాబు మాస్క్ ఖరీదు రూ.2.89 లక్షలు) దీనిపై హోటల్ యజమాని కేఎల్ కుమార్ మాట్లాడుతూ.. "ఇంతకుముందు మా హోటల్‌కు మాస్కు లేకుండా వచ్చేవారు. కానీ ఇప్పుడు మాస్కు పరోటాలు కొనడానికే వస్తున్నారు" అని తెలిపాడు. ఇంతకీ ఈ పరోటా మాస్క్‌ను పరోటా స్పెషలిస్టు ఎస్ సతీష్ రెండు రోజుల ప్రయోగం ద్వారా తుదిరూపు తీసుకొచ్చాడు. మాస్కుల్లో రకాలున్నట్టే.. మాస్కుల పరోటాలోనూ రకాలున్నాయంటున్నాడు. వీటి తయారీ విధానాన్ని అక్కడున్న వంటవారికి నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మాస్కుల పరోటాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. "ఈ ఫొటో చూసి మీ మాస్కు తినేయకండి" అంటూ కొందరు జోకులు పేల్చుతున్నారు. -
పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి
చెన్నై ,టీ.నగర్: భార్యతో ఫోన్లో మాట్లాడుతూ తిన్న పరోటా గొంతులో చిక్కుకని ఊపిరాడక నవవరుడు మృతిచెందాడు. ఈ సంఘటన తిరుమాంబాక్కంలో జరిగింది. వివరాలు.. పుదుచ్చేరి కరువడి కుప్పం భారతీనగర్‌కు చెందిన పురుషోత్తమన్ (32) తిరుమాంబాక్కంలోని కార్ల విక్రయ షోరూంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య షణ్ముగ సుందరి. వీరికి ఆరు నెలల క్రితం వివాహమైంది. షణ్ముగ సుందరి సొంత ఊరు తిరునెల్వేలి. ఈమె కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. పురుషోత్తమన్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. బుధవారం రాత్రి పరోటా కొనుక్కుని వచ్చిన అతను దాన్ని తింటున్నాడు. అదే సమయంలో భార్య ఫోన్ చేసింది. ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ భోజనం చేశాడు. ఆ సమయంలో పరోటా గొంతులో చిక్కుకోవడంతో మాట్లాడేందుకు వీలుకాలేదు. అతని గొనుగుడు మాత్రమే వినిపించింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె ముత్యాలపేటలోని బంధువులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. వెంటనే వారు భారతీనగర్‌కు వెళ్లారు. ఇంటిలోపల గడియ పెట్టుకున్న పురుషోత్తమన్‌ను పిలుస్తూ తలుపులు తట్టాడు. తలుపులు తెరుచుకోకపోవడంతో ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ స్ఫృహతప్పిన స్థితిలో ఉన్న పురుషోత్తమన్‌ను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్టు తెలిపారు. అతను తిన్న పరోటా గొంతులోనే చిక్కుకోవడంతో పురుషోత్తమన్ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. -
నిజంగా పరోటా సూరినే..!
42 పరోటాలు తిని రూ.5001 బహుమతి కైవసం తిరువొత్తియూరు: మీరైతే సాధారణంగా ఎన్ని పరోటాలు తినగలరు. మహా ఐతే ఓ అయిదారు. అంతకంటే ఎక్కువ తినాలంటే కష్టమే. అయితే నెల్లై జిల్లాలో ఓ యువకుడు ఏకంగా 42 పరోటాలు తిని రూ.5001 నగదును బహుమతిగా పొందాడు. వెన్నెలా కబడి కుళు చిత్రంలో నటుడు సూరి పరోటా తిన్న దృశ్యం ఎప్పుడు చూసినా మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ ఒక్క దృశ్యంతో నటుడు సూరి, పరోటా సూరిగా మారిపోయాడు. తమిళనాటలో పరోటాకు ప్రాధాన్యత ఎక్కువే. ఇదే తరహాలో పరోటా ప్రియులను ఆకర్షించేందుకు నెల్లై జిల్లా కల్లిడై కురిచ్చిలోని ఓ హోటల్లో వింత పోటీ నిర్వహించారు. నమ్మ ఊరు పరోటా సూరి యార్?(మన ఊరి పరోటా సూరి ఎవరు?) అనేది పోటీ పేరు. అందరికంటే ఎక్కువ పరోటాలు తిన్న వారికి రూ.5001 నగదు బహుమతి అందజేయనున్నట్టు హోటల్ యజమాని ప్రకటించాడు. దీనిపై ఆ ప్రాంతంలో పోస్టర్లు అతికించారు. దీన్ని సెల్ఫోన్లో ఫొటోలు తీసిన కొందరు తమ స్నేహితులకు వాట్సాప్‌లో పంపడంతో ఈ పోటీకి మంచి ప్రచారం వచ్చింది. ఈ పోటీ మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగింది. పలు గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడికి చేరుకుని పోటీ పడి మరి పరోటాలు లాగించారు. అయితే పదికి మించి ఎవరూ తినలేకపోయారు. శివగంగైకు చెందిన కాదర్ మైదీన్ అనే యువకుడు ఏకంగా 42 పరోటాలను లాగించి ‘పరోటా సూరి’గా పేరుపొందాడు. దీంతో హోటల్ యజమాని ప్రకటనలో తెలిపిన విధంగా అతనికి నగదును బహుమతిగా అందజేశాడు.