Hyderabad: పరోటాలో ప్లాస్టిక్‌ కవర్‌.. ఇదేమని అడిగితే! | Hyderabad: Man Ordered Food From Restaurant Shock After See Plastic Cover In Paratha | Sakshi

Hyderabad: పరోటాలో ప్లాస్టిక్‌ కవర్‌.. ఇదేమని అడిగితే!

Sep 23 2022 2:53 PM | Updated on Sep 23 2022 3:39 PM

Hyderabad: Man Ordered Food From Restaurant Shock After See Plastic Cover In Paratha - Sakshi

పరోటాలో ఉన్న ప్లాస్టిక్‌ కవర్‌

సాక్షి, హైదరాబాద్‌: అల్పాహారం తిందామని హోటల్‌కు వెళ్లి పరోటా ఆర్డర్‌ ఇస్తే అందులో ప్లాస్టిక్‌ కవర్‌ దర్శనమిచ్చింది. ఇదేమని హోటల్‌ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే... జి.గణేష్‌ అనే యువకుడు గురువారం ఉదయం 10 గంటలకు వనస్థలిపురం పోలీసు స్టేషన్‌ సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో పరోటా ఆర్డర్‌ చేశాడు. తింటుండగా మధ్యలో ప్లాస్టిక్‌ కవర్‌ వచ్చింది. ఇదేమని అడిగితే హోటల్‌ వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆన్‌లైన్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటల్‌ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement