స్వీట్ పొటాటో ఖీర్ తయారీకి కావల్సినవి:
చిలగడదుంప – 300 గ్రాములు (తొక్క తీసేసి.. దుంపల్ని తురుములా చేసుకోవాలి)
పాలు – 1 లీటరు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, ఏలకులు – 3
కుంకుమపువ్వు – చిటికెడు, చక్కెర – అర కప్పు, ఉప్పు – చిటికెడు
కస్టర్డ్ మిల్క్ – అర కప్పు, నట్స్ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లకు పైనే (గార్నిష్‌కి)
తయారీ విధానమిలా...
ముందుగా పాన్‌లో నెయ్యి వేడి చేసుకుని, అందులో చిలగడదుంప తురుము వేసుకుని చిన్నమంట మీద గరిటెతో తిప్పుతూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అనంతరం మరో పాత్రలో పాలు వేడి చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు, ఏలకులు వేసుకుని తిప్పుతూ ఉండాలి. పాన్‌లో వేయించిన చిలగడదుంప తురుమును.. పాలల్లో వేసుకుని, చిన్న మంట మీద.. మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ మెత్తగా ఉడికించుకోవాలి.
అనంతరం పంచదార వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసుకుని 3 లేదా 4 నిమిషాలు ఉడకనివ్వాలి. కాస్త దగ్గర పడిన తర్వాత కొన్ని నట్స్ ముక్కలను అందులో కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు మిగిలిన నట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment