kheer
-
స్పెషల్ డేస్ కోసం ప్రత్యేకంగా ఖీర్.. ఇలా చేసుకోండి
స్వీట్ పొటాటో ఖీర్ తయారీకి కావల్సినవి: చిలగడదుంప – 300 గ్రాములు (తొక్క తీసేసి.. దుంపల్ని తురుములా చేసుకోవాలి) పాలు – 1 లీటరు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, ఏలకులు – 3 కుంకుమపువ్వు – చిటికెడు, చక్కెర – అర కప్పు, ఉప్పు – చిటికెడు కస్టర్డ్ మిల్క్ – అర కప్పు, నట్స్ ముక్కలు – 3 టేబుల్ స్పూన్లకు పైనే (గార్నిష్‌కి) తయారీ విధానమిలా... ముందుగా పాన్‌లో నెయ్యి వేడి చేసుకుని, అందులో చిలగడదుంప తురుము వేసుకుని చిన్నమంట మీద గరిటెతో తిప్పుతూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అనంతరం మరో పాత్రలో పాలు వేడి చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు, ఏలకులు వేసుకుని తిప్పుతూ ఉండాలి. పాన్‌లో వేయించిన చిలగడదుంప తురుమును.. పాలల్లో వేసుకుని, చిన్న మంట మీద.. మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ మెత్తగా ఉడికించుకోవాలి. అనంతరం పంచదార వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసుకుని 3 లేదా 4 నిమిషాలు ఉడకనివ్వాలి. కాస్త దగ్గర పడిన తర్వాత కొన్ని నట్స్ ముక్కలను అందులో కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు మిగిలిన నట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. -
నోరూరించే కోకోనట్ ఖీర్ ట్రై చేయండి ఇలా..
కోకోనట్ ఖీర్కి కావలసినవి: చిక్కటి పాలు – 2 కప్పులు (కాచి, చల్లార్చుకోవాలి) కొబ్బరి బొండాం మీగడ – అర కప్పు (ఇందులో కాచి చల్లార్చిన పాలలోంచి పావు కప్పు పాలు కలిపి, మిక్సీ పట్టుకోవాలి) కొబ్బరి కోరు – 1 కప్పు నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు పంచదార – పావు కప్పు ఏలకుల పొడి – పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి) జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలు, కిస్మిస్ – గార్నిష్‌కి సరిపడా (అభిరుచిని బట్టి, నచ్చినవి మరిన్ని కలుపుకోవచ్చు. అయితే అన్నిటినీ నేతిలో దోరగా వేయించుకోవాలి) తయారీ విధానం: ముందుగా నేతిలో కొబ్బరి కోరు వేసుకుని గరిటెతో దోరగా వేయించుకుని.. అందులో పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన అనంతరం పాలు, కొబ్బరి మీగడ మిశ్రమం వేసుకుని దగ్గరపడేవరకూ తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ వేసుకుని, ఒకసారి కలిపి, చివరిగా ఏలకుల పొడి.. నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడే నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. (చదవండి: ముంజులతో కేక్ చేసుకోండి ఇలా..) -
Holi 2023: హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా!
ఈ హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! తీపి రుచిని ఆస్వాదించండి! రైస్ ఖీర్ తయారీ విధానం ఇలా కావలసినవి: ►బియ్యం– కప్పు ►పాలు – ఒకటిన్నర లీటరు (వెన్న తీయనివి) ►చక్కెర – కప్పు ►యాలకుల పొడి– టీ స్పూన్ ►కుంకుమ పువ్వు– చిటికెడు లేదా 15 రేకలు ►బాదం – టేబుల్ స్పూన్ ►జీడిపప్పు – టేబుల్ స్పూన్ ►పిస్తా – టేబుల్ స్పూన్ ►కిస్మిస్ – టేబుల్ స్పూన్. తయారీ: ►బియ్యం కడిగి 15 నిమిషాల సేపు నానబెట్టాలి. ►చిన్న పాత్రలో నీటిని వేడి చేసి బాదం, పిస్తా వేసి మూతపెట్టాలి. ►అర గంట తర్వాత పొట్టు తీసి సన్నగా తరగాలి. ►కిస్మిస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ►బియ్యం నానిన తర్వాత స్టవ్ మీద వెడల్పు పాత్ర పెట్టి పాలు పోసి మరిగించాలి. ►ఒక గరిటెడు పాలు విడిగా తీసుకుని కుంకుమ పువ్వు రేకలను నానబెట్టాలి. ►బియ్యంలోని నీటిని వంపేసి బియ్యాన్ని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. ►బియ్యం ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత చక్కెర వేసి కలిపి సన్నమంట మీద ఉడికించాలి. ►అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత యాలకుల పొడి, బాదం, పిస్తా తరుగు, కిస్మిస్, కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. రైస్ ఖీర్ రెడీ. ►ఖీర్ దగ్గరయ్యే వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. ►స్టవ్ ఆపేసిన తర్వాత చల్లారే కొద్దీ దగ్గరవుతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి! పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు -
Recipe: రాఖీ స్పెషల్.. దాల్ బనానా ఖీర్, కలాకండ్ లడ్డూ తయారీ ఇలా!
సోదరీ సోదరుల మధ్య ఉన్న ఆత్మీయత, అనురాగ బంధాలకు గుర్తుగా జరుపుకునే పండుగే రాఖీ. ఈ రోజు అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించడం మన సంప్రదాయం. ఈ సందర్భంగా బయట నుంచి కొనితెచ్చే స్వీట్లు కాకుండా.. నోరూరించే స్వీట్లను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... కలాకండ్ లడ్డు కావలసినవి: పనీర్ తరుగు – వందగ్రాములు పాలు – లీటరు పంచదార – కప్పు నెయ్యిలో వేయించిన డ్రైఫ్రూట్స్ – గార్నిష్‌కు సరిపడా. తయారీ: మందపాటి గిన్నెలో పాలు పోసి సన్నని మంట మీద పాలు సగమయ్యేంత వరకు మరిగించాలి. పాలు మరిగాక పనీర్ తరుగు, నెయ్యి, పంచదార వేసి తిప్పుతూ మరికొద్దిసేపు మరిగించాలి పనీర్ నుంచి నీరు వస్తుంది. ఈ నీరంతా ఆవిరైపోయి పాల మిశ్రమం మొత్తం దగ్గరపడిన తరువాత స్టవ్ ఆపేసేయాలి. మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత లడ్డులా చుట్టుకుని డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. దాల్ బనానా ఖీర్ కావలసినవి: పచ్చిశనగపప్పు – కప్పు అరటిపళ్లు – రెండు! కుంకుమ పువ్వు – చిటికడు యాలకులపొడి – టేబుల్ స్పూను పంచదార – రెండు కప్పులు కండెన్స్డ్ మిల్క్ – రెండు కప్పులు పాలు – మూడు కప్పులు ఎండుకొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్,జీడిపప్పు పలుకులు – కప్పు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: కిస్మిస్ జీడిపప్పు,ఎండుకొబ్బరి ముక్కలను నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి జీడిపప్పు వేయించిన బాణలిలో శనగపప్పు వేయాలి. దీనిలో పాలుకూడా పోసి పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి ఉడికిన పప్పును మెత్తగా చిదుముకోవాలి. ఇప్పుడు దీనిలో కండెన్స్డ్ మిల్క్, కుంకుమపువ్వు, పంచదార, యాలకులపొడి వేసి సన్నని మంట మీద తిప్పుతూ ఉడికించాలి చివరిగా అరటిపళ్ల తొక్కతీసి సన్నని ముక్కలు తరిగి వేయాలి అరటిపండు ముక్కలు కూడా మగ్గిన తరువాత, వేయించిన కిస్మిస్, జీడిపలుకులు కొబ్బరి ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి. వేడిగానైనా, చల్లగానైనా ఈ ఖీర్ చాలా బావుంటుంది. -
నా కొడుక్కి బెయిల్ వచ్చేవరకు స్వీట్లు వండొద్దు! : గౌరీ ఖాన్
Gauri Khan Says No kheer in Mannat till Aryan Gets Bail : డ్రగ్స్ కేసులో కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అవడంతో బాలీవుడ్ బాద్షా షారుక్, గౌరీ ఖాన్ తీవ్ర మనోవేధనకు గురవతున్నట్లు తెలుస్తుంది. తిండి, నిద్ర లేకుండా ఆర్యన్ కోసమే ఎదురుచూస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. షారుక్ భార్య గౌరీ ఖాన్ అయితే ప్రతిరోజూ దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు తన స్నేహితులను కూడా భగవంతుడ్ని ప్రార్థించాలంటూ వేడుకుంటుందట. నవరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి కొడుకు బెయిల్ కోసం గౌరీ ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. మప్రతీ పండుగకి షారుక్ నివాసం ఎంతో అందంగా ముస్తాబయ్యేది. కానీ ప్రస్తుతం ఆర్యన్ జైలులో ఉండటంతో పండుగ సెలబ్రేట్ చేసుకునే ఆసక్తి లేదని, ఆర్యన్ ఇంటికి వచ్చేవరకు మన్నత్‌లో ఖీర్, స్వీట్లు ఏవీ చేయకూడదని గౌరీ ఖాన్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. ఆర్యన్ బెయిల్ నుంచి వచ్చేవరకు ఎలాంటి స్వీట్లు వండొద్దని స్టాఫ్‌కు తెలిపింది. కాగా ఇప్పటికే ఆర్యన్‌కు ముంబై కోర్టు మూడుసార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టనుంది. చదవండి: ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్ ఖాన్ -
స్నానం పాలతో.. ప్రసాదం!
హిస్సార్: అరెస్ట్ అనంతరం రాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భక్త కబీరు ఆధ్యాత్మిక వారసుడిగా ప్రకటించుకున్న రాంపాల్.. భక్తులకు రోజూ అందించే ప్రసాదం ఏంటో తెలుసా?. పాలతో స్నానం చేసి.. ఆ పాలతో ఖీర్ తయారు చేయించి, భక్తులకు క్షీరామృతంగా అందిస్తారు. కాగా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించవద్దని, భక్త కబీర్‌ను మాత్రమే ఆరాధించాలని రాంపాల్ బోధించేవారు. విగ్రహారాధన లాంటి హిందూ సాంప్రదాయాలను పాటించవద్దనేవారు. అన్ని మత గ్రంధాల్లోనూ భక్త కబీర్‌ను దేవుళ్లకే దేవుడిగా పేర్కొన్నారని వివరించేవారు. ఇక బల్వారాలో 12 ఎకరాల సువిశాల స్థలంలో రాంపాల్ షత్లాక్ ఆశ్రమాన్ని ఆధునిక హంగులతో నిర్మించారు. భారీ స్విమింగ్ పూల్, ముఖ్య అనుచరుల కోసం ఎసీ గదులు ఉన్నాయి. అనుయాయులకు ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ స్క్రీన్లతో లెక్చర్ హాళ్లు ఉన్న ఆధునిక ఆశ్రమం అది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా భారీగానే సమకూర్చుకున్నారని సమాచారం. ఆశ్రమంలో అర్థనగ్నంగా ఉండాలని అక్కడి నిర్వాహకులు తమని వేధించేవారని ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన మహిళలు తెలిపారు. స్వామీజీ వల్ల కొన్ని కుటుంబాలు కూడా నాశనమయ్యాయని వారు చెప్పారు. -
ఖీర్, బిర్యానీతో సెక్స్ వర్కర్ల హోలీ
న్యూఢిల్లీ: నగరంలోని జీబీ రోడ్డులో ఉంటున్న సెక్స్‌వర్కర్లు జరుపుకునే హోలీ మిగతావారు జరుపుకునే హోలీకి భిన్నంగా ఉంటుంది. అందరిలా వీరు వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకోవడం ఇక్కడ కనిపించదు. ఏ వేడుక చేసుకున్నా వారుంటున్న భవనం పరిసరాల్లోనే జరుపుకోవాలి. హోలీ కూడా అంతే. ఈ వేడుక గురించి పదిహేను సంవత్సరాలుగా జీబీ రోడ్‌లోని రెడ్‌లైట్ ప్రాంతంలో ఉంటున్న కిరణ్ (పేరు మార్చాం) మాట్లాడుతూ... ‘మేం ఏ పండగైనా ఇక్కడే జరుపుకుంటాం. అది దీపావళి కానీయండి హోలీ కానీయండి.. అన్నీ ఈ భవనం పరిసరాల్లోనే. హోలీ మా జీవితాల్లో మిగతా రోజులకు భిన్నంగా ఏమీ ఉండదు. కాకపోతే మా స్నేహితులంతా ఒకచోటకు చేరి రంగులు చల్లుకుంటాం. ఆ తర్వాత పసందైన ఖీర్ రుచిని ఆస్వాధిస్తాం. ఘుమఘుమలాడే బిర్యానీని లాగించేస్తాం. మరిన్ని మిఠాయిలు కూడా ఆ రోజు మా మెనూలో ఉంటాయి. మిఠాయి, గులాల్‌తో మా హోలీ వేడుక మొదలవుతుంద’ని పేర్కొంది. ఆల్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్, నేషనల్ కో-ఆర్డినేటర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ... ‘నగరంలోని కొన్ని వేశ్యావాటికలు హోలీ రోజు సాయంత్రం 5 గంటలకే మూతపడతాయి. ఆకతాయిల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే అభిప్రాయంతోనే ఈ విధంగా చేస్తారు. తమకు నమ్మకమైన కొంతమందితోనే వీరు హోలీ జరుపుకుంటారు. అదీ తాము ఉంటున్న భవనం పరిసరాల్లోనే. తమ స్నేహితులను ఆహ్వానిస్తారు. బయట పరిస్థితి ప్రశాంతంగా ఉందని భావిస్తే స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు. అయితే ఈ సమయంలో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆకతాయిలు వెంటపడడం, బలవంతంగా రంగులు చల్లడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. అందుకే సాధ్యమైనంతగా హోలీని బయటకు వెళ్లకుండానే జరుపుకుంటార’న్నారు. దివ్య అనే యువతి మాట్లాడుతూ... ‘అందరిలాగే మాకు కూడా హోలీ వీధుల్లోకి వెళ్లి జరుపుకోవాలని ఉంటుంది. కానీ ఆకతాయిలు మాపట్ల ప్రవర్తించే తీరు మాకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే మావద్దకు తరచూ వచ్చే కొందరితోనే హోలీ జరుపుకుంటాం. వారే మా వద్దకు వచ్చి రంగులు చల్లి, స్వీట్లు, బహుమతులు ఇచ్చి వెళ్తుంటార’ని చెప్పింది.