కోకోనట్ ఖీర్‌కి కావలసినవి:
చిక్కటి పాలు – 2 కప్పులు (కాచి, చల్లార్చుకోవాలి)
కొబ్బరి బొండాం మీగడ – అర కప్పు (ఇందులో కాచి చల్లార్చిన పాలలోంచి పావు కప్పు పాలు కలిపి, మిక్సీ పట్టుకోవాలి)
కొబ్బరి కోరు – 1 కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
పంచదార – పావు కప్పు
ఏలకుల పొడి – పావు టీ స్పూన్
ఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)
జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలు, కిస్మిస్ – గార్నిష్‌కి సరిపడా (అభిరుచిని బట్టి, నచ్చినవి మరిన్ని కలుపుకోవచ్చు. అయితే అన్నిటినీ నేతిలో దోరగా వేయించుకోవాలి)
తయారీ విధానం: ముందుగా నేతిలో కొబ్బరి కోరు వేసుకుని గరిటెతో దోరగా వేయించుకుని.. అందులో పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన అనంతరం పాలు, కొబ్బరి మీగడ మిశ్రమం వేసుకుని దగ్గరపడేవరకూ తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ వేసుకుని, ఒకసారి కలిపి, చివరిగా ఏలకుల పొడి.. నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని.. వేడివేడిగా ఉన్నప్పుడే నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు.
(చదవండి: ముంజులతో కేక్ చేసుకోండి ఇలా..)
Comments
Please login to add a commentAdd a comment