Holi 2023 Sweet Recipes: How To Prepare Rice Kheer Sweet Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Rice Kheer Recipe: హోలీకి రైస్‌ ఖీర్‌ తయారు చేసుకోండిలా!

Published Fri, Mar 3 2023 5:02 PM | Last Updated on Fri, Mar 3 2023 5:51 PM

Holi 2023: Rice Kheer Sweet Recipe In Telugu - Sakshi

ఈ హోలీకి రైస్‌ ఖీర్‌ తయారు చేసుకోండిలా! తీపి రుచిని ఆస్వాదించండి!
రైస్‌ ఖీర్‌ తయారీ విధానం ఇలా
కావలసినవి:
►బియ్యం– కప్పు
►పాలు – ఒకటిన్నర లీటరు (వెన్న తీయనివి)
►చక్కెర – కప్పు
►యాలకుల పొడి– టీ స్పూన్‌

►కుంకుమ పువ్వు– చిటికెడు లేదా 15 రేకలు
►బాదం  – టేబుల్‌ స్పూన్‌
►జీడిపప్పు – టేబుల్‌ స్పూన్‌
►పిస్తా – టేబుల్‌ స్పూన్‌
►కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూన్‌.

తయారీ:
►బియ్యం కడిగి 15 నిమిషాల సేపు నానబెట్టాలి.
►చిన్న పాత్రలో నీటిని వేడి చేసి బాదం, పిస్తా వేసి మూతపెట్టాలి.
►అర గంట తర్వాత పొట్టు తీసి సన్నగా తరగాలి.
►కిస్‌మిస్‌ని కడిగి పక్కన పెట్టుకోవాలి.
►బియ్యం నానిన తర్వాత స్టవ్‌ మీద వెడల్పు పాత్ర పెట్టి పాలు పోసి మరిగించాలి.
►ఒక గరిటెడు పాలు విడిగా తీసుకుని కుంకుమ పువ్వు రేకలను నానబెట్టాలి.

►బియ్యంలోని నీటిని వంపేసి బియ్యాన్ని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి.
►బియ్యం ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత చక్కెర వేసి కలిపి సన్నమంట మీద ఉడికించాలి.
►అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత యాలకుల పొడి, బాదం, పిస్తా తరుగు, కిస్‌మిస్, కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్‌ ఆపేయాలి. రైస్‌ ఖీర్‌ రెడీ.
►ఖీర్‌ దగ్గరయ్యే వరకు ఉడికించాల్సిన అవసరం లేదు.
►స్టవ్‌ ఆపేసిన తర్వాత చల్లారే కొద్దీ దగ్గరవుతుంది.  

ఇవి కూడా ట్రై చేయండి: Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి!
పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్‌ లడ్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement