నోరూరించే రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పలుచగా ఉంటేనే.. | Holi 2023: White Rasgulla Easy Recipe Tips In Telugu | Sakshi
Sakshi News home page

Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి!

Published Fri, Mar 3 2023 9:57 AM | Last Updated on Fri, Mar 3 2023 10:04 AM

Holi 2023: White Rasgulla Easy Recipe Tips In Telugu - Sakshi

Holi Recipes 2023: రంగుల పండుగ వస్తోంది. రంగరంగ వైభవంగా వస్తోంది. తీపి జ్ఞాపకాలను తెస్తోంది. రుచులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏటి హోలీ ఇచ్చిన తీపి రుచిని... రాబోయే హోలీ వరకు మర్చిపోదు మది.

రసగుల్ల తయారీ విధానం ఇలా:
కావలసినవి:
►పాలు – లీటరు (వెన్న తీయనివి)
►నిమ్మరసం– 3 టేబుల్‌ స్పూన్‌లు
►చక్కెర – 2 కప్పులు
►నీరు – లీటరు

►పాలు – టేబుల్‌ స్పూన్‌
►ఉప్మారవ్వ– టీ స్పూన్‌
►పిస్తాపలుకులు : 20

తయారీ:
►పాలను మందపాటి పాత్రలో పోసి స్టవ్‌ మీద పెట్టాలి.
►బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి నిమ్మరసం వేసి కలపాలి.
►ముందు సగం నిమ్మరసం వేసి కలిపి చూసి, పాలు బాగా విరిగితే మిగిలిన రసాన్ని ఆపేయాలి.
►పాలు సరిగ్గా విరగకపోతే మొత్తం రసాన్ని వేసి కలపాలి (పాశ్చరైజేషన్‌ జరగని పాలకు ఒక స్పూన్‌ నిమ్మరసం సరిపోతుంది).

►విరిగిన పాలను పలుచని వస్త్రంలో పోసి మూట కట్టి ఏదైనా కొక్కేనికి వేలాడదీయాలి.
►ఓ అరగంట తర్వాత నీరు పోయేలా చేత్తో గట్టిగా నొక్కాలి.
►ఆ తర్వాత పైన బరువు పెట్టాలి. ఇలా చేయడం వల్ల నీరంతా కారిపోతుంది.
►పాల విరుగు మాత్రం మూటలో మిగులుతుంది.

►పాలవిరుగులో రవ్వ వేసి వేళ్లతో నలుపుతూ కలపాలి. ఇలా చేస్తూ ఉంటే ముందుగా పాల విరుగు పొడిగా మారుతుంది.
►మరికొంత సేపటికి ముద్దగా అవుతుంది.
►ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న గోళీలుగా చేయాలి.

►వెడల్పుగా, లోతుగా ఉన్న కడాయిలో చక్కెర, నీరు పోసి వేడి చేయాలి.
►చక్కెర కరిగిన తరవాత అందులో టేబుల్‌ స్పూన్‌ పాలు వేయాలి.
►రెండు నిమిషాలకు  చక్కెర ద్రవం శుభ్ర పడి అందులోని మలినాలు నల్లగా పైకి తేలుతాయి.

►స్పూన్‌తో కానీ చిల్లుల గరిటెతో తీసేయాలి లేదా పలుచని వస్త్రంలో వడపోయడం మంచిది.
►వడపోసిన ద్రవాన్ని మళ్లీ కడాయిలో పోసి మరిగించాలి.
►ఇప్పుడు చక్కెర ద్రవంలో పాల విరుగుతో చేసిన గోళీలను వేసి నాలుగైదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి (పెద్ద మంట మీద ఉడికిస్తే రసగుల్లాలు విరిగిపోతాయి).

►చిన్న గోళీలుగా వేసిన రసగుల్లాలు చక్కెర పాకాన్ని పీల్చుకుని పెద్దవవుతాయి.
►అప్పుడు స్టవ్‌ ఆపేయాలి.
►వేడి తగ్గిన తరవాత కప్పులో రసగుల్లాతోపాటు ఒక టేబుల్‌ స్పూన్‌ సిరప్, పిస్తా వేసి సర్వ్‌ చేయాలి.
గమనిక: రసగుల్లాలకు చేసే చక్కెర ద్రవం పలుచగా ఉండాలి. పాకం రాకూడదు.  

ఇవి కూడా ట్రై చేయండి: వంకాయ బోండా.. భలే రుచి.. ఇలా తయారు చేసుకోండి!
బనానా, ఓట్స్‌తో కజ్జికాయలు తయారు చేసుకోండిలా!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement