ఉల్లి, పల్లి, కొబ్బరి, వెల్లుల్లి, పుట్నాల పచ్చళ్లు తినితిని చప్పగా మారిన నాలుకకు ఊరించే చట్నీలు కనిపిస్తే ప్రాణం లేచివస్తుంది. అందుకే చూడగానే నోరూరించే చట్నీలతో ఈ వారం వంటిల్లు మీకోసం...
నిమ్మకాయ ఇన్‌స్టంట్ పచ్చడి తయారికి కావల్సినవి:
నిమ్మకాయలు – పది; బెల్లం – అరకప్పు; జీలకర్ర – నాలుగు టీస్పూన్లు;
ఎండు మిర్చి – ఇరవై; ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానమిలా:
►నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేయాలి.ముక్కల్లో ఉన్న గింజలన్నింటినీ తీసేయాలి (గింజలు ఉంటే పచ్చడి చేదుగా వస్తుంది).
► నిమ్మకాయ ముక్కలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పేస్టుచేయాలి
► ఎండు మిర్చి, బెల్లంను కలిపి పొడిచేయాలి ∙ఇప్పుడు నిమ్మకాయ పేస్టులో ఎండుమిర్చి పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి.
► తాలింపు కావాలంటే వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా బావుంటుంది.
► ఈ చట్నీని వెంటనే కూడా తినవచ్చు. కానీ రెండుమూడు రోజులు మాగాక మరింత రుచిగా ఉంటుంది.
► ఇడ్లీ,దోశ, పరాటా, చపాతీ, అన్నంలోకి ఈ చట్నీ చాలా బావుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment