Holi 2023
-
రస్మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా..
తీపిని ఇష్టపడే వారు ఇలా ఇంట్లోనే రస్మలై తయారు చేసుకోండి. నోరూరించే స్వీట్‌తో ఈ హోలీని సెలబ్రేట్ చేసుకోండి! రస్మలై తయారీకి కావాల్సినవి: ►రసగుల్లాలు – 15 (ఇంట్లో చేయడం కుదరకపోతే రెడీమేడ్‌వి తీసుకోవచ్చు) ►పాలు – లీటరు ►చక్కెర – 5 టేబుల్ స్పూన్లు ►బాదం –10 ; పిస్తా– 10 ►యాలకుల పొడి– టీ స్పూన్ ►కుంకుమ పువ్వు – 20 రేకలు తయారీ: ►అరకప్పు వేడి నీటిలో బాదం, పిస్తాలను అరగంట సేపు నానబెట్టి పొట్టు తీసి తరగాలి. ►పావు కప్పు వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. ►మందపాటి బాణలిలో పాలు మరిగించాలి. ►పైకి తేలిన మీగడను స్పూన్‌తో తీసి ఒక గిన్నెలో వేసుకుంటూ పాలు అడుగు పట్టకుండా కలుపుతూ, పాలు సగమయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు చక్కెర వేసి కరిగే వరకు కలుపుతూ మరిగించాలి. ►యాలకుల పొడి, బాదం, పిస్తా (సగం), కుంకుమ పువ్వు పాలు కలిపి వీటి రుచి పాలకు పట్టే వరకు సన్నమంట మీద మరిగించాలి. ►ఇప్పుడు రసగుల్లాను ఒక ప్లేట్లోకి తీసుకుని గరిటె లేదా అట్లకాడ సాయంతో లేదా వేళ్లతో చక్కెర పాకం జారిపోయేటట్లు మెల్లగా నొక్కాలి. ►ఇలా రసగుల్లాలన్నింటినీ నొక్కి జాగ్రత్తగా పాలలో వేయాలి. ►రెండు నిమిషాలపాటు పాలలో ఉడకనిచ్చి స్టవ్ ఆపేయాలి. ►రసమలై చల్లారిన తర్వాత కప్పులో వేసి మీగడ(ఇష్టమైతే), బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Rice Kheer Recipe: హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి! -
Holi 2023: హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా!
ఈ హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! తీపి రుచిని ఆస్వాదించండి! రైస్ ఖీర్ తయారీ విధానం ఇలా కావలసినవి: ►బియ్యం– కప్పు ►పాలు – ఒకటిన్నర లీటరు (వెన్న తీయనివి) ►చక్కెర – కప్పు ►యాలకుల పొడి– టీ స్పూన్ ►కుంకుమ పువ్వు– చిటికెడు లేదా 15 రేకలు ►బాదం – టేబుల్ స్పూన్ ►జీడిపప్పు – టేబుల్ స్పూన్ ►పిస్తా – టేబుల్ స్పూన్ ►కిస్మిస్ – టేబుల్ స్పూన్. తయారీ: ►బియ్యం కడిగి 15 నిమిషాల సేపు నానబెట్టాలి. ►చిన్న పాత్రలో నీటిని వేడి చేసి బాదం, పిస్తా వేసి మూతపెట్టాలి. ►అర గంట తర్వాత పొట్టు తీసి సన్నగా తరగాలి. ►కిస్మిస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ►బియ్యం నానిన తర్వాత స్టవ్ మీద వెడల్పు పాత్ర పెట్టి పాలు పోసి మరిగించాలి. ►ఒక గరిటెడు పాలు విడిగా తీసుకుని కుంకుమ పువ్వు రేకలను నానబెట్టాలి. ►బియ్యంలోని నీటిని వంపేసి బియ్యాన్ని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. ►బియ్యం ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత చక్కెర వేసి కలిపి సన్నమంట మీద ఉడికించాలి. ►అన్నం ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత యాలకుల పొడి, బాదం, పిస్తా తరుగు, కిస్మిస్, కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. రైస్ ఖీర్ రెడీ. ►ఖీర్ దగ్గరయ్యే వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. ►స్టవ్ ఆపేసిన తర్వాత చల్లారే కొద్దీ దగ్గరవుతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి! పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు -
నోరూరించే రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పలుచగా ఉంటేనే..
Holi Recipes 2023: రంగుల పండుగ వస్తోంది. రంగరంగ వైభవంగా వస్తోంది. తీపి జ్ఞాపకాలను తెస్తోంది. రుచులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏటి హోలీ ఇచ్చిన తీపి రుచిని... రాబోయే హోలీ వరకు మర్చిపోదు మది. రసగుల్ల తయారీ విధానం ఇలా: కావలసినవి: ►పాలు – లీటరు (వెన్న తీయనివి) ►నిమ్మరసం– 3 టేబుల్ స్పూన్లు ►చక్కెర – 2 కప్పులు ►నీరు – లీటరు ►పాలు – టేబుల్ స్పూన్ ►ఉప్మారవ్వ– టీ స్పూన్ ►పిస్తాపలుకులు : 20 తయారీ: ►పాలను మందపాటి పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టాలి. ►బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి నిమ్మరసం వేసి కలపాలి. ►ముందు సగం నిమ్మరసం వేసి కలిపి చూసి, పాలు బాగా విరిగితే మిగిలిన రసాన్ని ఆపేయాలి. ►పాలు సరిగ్గా విరగకపోతే మొత్తం రసాన్ని వేసి కలపాలి (పాశ్చరైజేషన్ జరగని పాలకు ఒక స్పూన్ నిమ్మరసం సరిపోతుంది). ►విరిగిన పాలను పలుచని వస్త్రంలో పోసి మూట కట్టి ఏదైనా కొక్కేనికి వేలాడదీయాలి. ►ఓ అరగంట తర్వాత నీరు పోయేలా చేత్తో గట్టిగా నొక్కాలి. ►ఆ తర్వాత పైన బరువు పెట్టాలి. ఇలా చేయడం వల్ల నీరంతా కారిపోతుంది. ►పాల విరుగు మాత్రం మూటలో మిగులుతుంది. ►పాలవిరుగులో రవ్వ వేసి వేళ్లతో నలుపుతూ కలపాలి. ఇలా చేస్తూ ఉంటే ముందుగా పాల విరుగు పొడిగా మారుతుంది. ►మరికొంత సేపటికి ముద్దగా అవుతుంది. ►ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న గోళీలుగా చేయాలి. ►వెడల్పుగా, లోతుగా ఉన్న కడాయిలో చక్కెర, నీరు పోసి వేడి చేయాలి. ►చక్కెర కరిగిన తరవాత అందులో టేబుల్ స్పూన్ పాలు వేయాలి. ►రెండు నిమిషాలకు చక్కెర ద్రవం శుభ్ర పడి అందులోని మలినాలు నల్లగా పైకి తేలుతాయి. ►స్పూన్‌తో కానీ చిల్లుల గరిటెతో తీసేయాలి లేదా పలుచని వస్త్రంలో వడపోయడం మంచిది. ►వడపోసిన ద్రవాన్ని మళ్లీ కడాయిలో పోసి మరిగించాలి. ►ఇప్పుడు చక్కెర ద్రవంలో పాల విరుగుతో చేసిన గోళీలను వేసి నాలుగైదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి (పెద్ద మంట మీద ఉడికిస్తే రసగుల్లాలు విరిగిపోతాయి). ►చిన్న గోళీలుగా వేసిన రసగుల్లాలు చక్కెర పాకాన్ని పీల్చుకుని పెద్దవవుతాయి. ►అప్పుడు స్టవ్ ఆపేయాలి. ►వేడి తగ్గిన తరవాత కప్పులో రసగుల్లాతోపాటు ఒక టేబుల్ స్పూన్ సిరప్, పిస్తా వేసి సర్వ్ చేయాలి. గమనిక: రసగుల్లాలకు చేసే చక్కెర ద్రవం పలుచగా ఉండాలి. పాకం రాకూడదు. ఇవి కూడా ట్రై చేయండి: వంకాయ బోండా.. భలే రుచి.. ఇలా తయారు చేసుకోండి! బనానా, ఓట్స్‌తో కజ్జికాయలు తయారు చేసుకోండిలా! -
ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపరాఫర్!..మరీ ఇంత డిస్కౌంటా?
హోలీ సందర్భంగా కొనసాగుతున్న బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఐఫోన్ 13,ఐఫోన్ 14 ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక సేల్‌లో దాదాపు 1000 కి పైగా బ్రాండ్స్‌కి చెందిన దాదాపు లక్షకుపైగా ప్రోడక్ట్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వీటితో పాటు పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లైన ఐఫోన్ 13,ఐఫోన్ 14 మోడళ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫర్లో భాగంగా ఐఫోన్ 13 ధర రూ.61,999 ఉండగా..రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఫోన్‌పై ఎక్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం ఉంటే ఆ ధర కాస్త రూ.23,000 వరకు తగ్గుతుంది. అదే సమయంలో ఐఫోన్ 14 ధర రూ.71,999 ఉండగా..సేల్‌లో రూ.67,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక స్మార్ట్ఫోన్లు కాకుండా గృహోపకరణాలు, వంటగదిలో వినియోగించే వస్తువులు,హోమ్ అప్లయెన్సెస్ పై 70శాతం, రిఫ్రిజిరేటర్లపై 60శాతం డిస్కౌంట్స్, ల్యాప్‌ట్యాప్స్‌పై 45శాతం డిస్కౌంట్ పొందవచ్చు. -
వసంతాలు విరిసేవేళ
వసంతం విచ్చేసిందని ప్రకృతి మనకు పంపించే తొలి కబురు రంగుల వేడుకైన హోలి. రాబోయే వేసవిని తట్టుకోవడానికి మన మేనిని హాయిగొలిపేలాఉంచడానికి స్వచ్ఛమైన తెలుపును పరిచయం చేసేది హోలి.ఎందుకంటే రంగుల హంగులను అందంగా ఇముడ్చుకునేది తెలుపే!ఇంద్రధనుస్సు ఎలాగూవేసుకున్న దుస్తులను అందంగా పలకరిస్తుందిపువ్వుల నవ్వుల్ని, పచ్చదనాన్నీ అద్దుతుంది. ఆ హంగులను అద్దుకున్న తెలుపు మన జీవితాలను ఆనందమయం చేస్తుంది. అందుకే, వసంతాలు విరిసేవేళా నిన్ను నేను చూశాను...అంటూతెలుపు రంగు డ్రెస్‌ల ఎంపికకు మొదటి ఓటు వేయవచ్చు. తెలుపుతోపాటు క్రీమ్ కలర్ థీమ్ ఉన్న డ్రెస్సులు ఎంతో అందాన్నీ, హాయినీ ఇస్తాయి. వీటిలో కాటన్, లినెన్, చికన్ కారీ వర్క్, ఇతర ఎంబ్రాయిడరీ లేదా చిన్న చిన్న పెయింటింగ్స్ ఉన్న డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. పూర్తి వైట్ ఇష్టపడని వారు క్రీమ్ కలర్, ఇతర కాంబినేషన్ కలర్స్‌తో ఉన్న డ్రెస్సులనూ ఎంపిక చేసుకోవచ్చు. ఇండో–వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సులు అన్ని పార్టీలలోనూ ప్రత్యేకంగా ఉంటాయి.