Best New Year 2023 Recipes: How To Prepare Milk Chocolate And White Chocolate Recipes - Sakshi
Sakshi News home page

Chocolate Recipes: కోకో పౌడర్‌, గోధుమ పిండి.. చాకొలెట్లు ఇంట్లోనే ఇలా ట్రై చేయండి

Published Fri, Dec 30 2022 2:26 PM | Last Updated on Sat, Dec 31 2022 1:54 PM

New Year 2023: Milk Chocolate And White Chocolate Recipes - Sakshi

కాలం కరిగిపోతుంది.  చాక్లెట్లు కూడా... నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి.  చాక్లెట్లనగానే మనకు బయటినుంచి కొనుక్కుని రావడం మాత్రమే తెలుసు. కానీ కాస్త సమయం కరిగిస్తే ... ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.  చాక్లెట్లతో పాటే తీపి జ్ఞాపకాలను కూడా చప్పరించేయొచ్చు. అదెలాగో చూడండి మరి!

మిల్క్‌ చాక్లెట్‌
కావలసినవి:
►కోకో పౌడర్‌ – 2 కప్పులు
►చక్కెర – అర కప్పు
►గోధుమ పిండి– పావు టీ స్పూన్‌

►బటర్‌ – ముప్పావు కప్పు (ఉప్పు లేనిది)
►పాలు – ముప్పావు కప్పు
►నీరు – కప్పు.

తయారీ:
►కోకో, బటర్‌ను ప్రాసెసర్‌లో మెత్తని పేస్టు చేయాలి.
►ఇప్పుడు పెనం వేడి చేసి పావు కప్పు నీరు పోసి వేసి చేసి అందులో కోకో, బటర్‌ మిశ్రమం పేస్ట్‌ ఉన్న పాత్రను ఉంచాలి.
►కోకో మిక్స్‌ బాగా కరిగిన తర్వాత ఆ పాత్రను నేరుగా స్టవ్‌ మీద పెట్టి సన్న మంట మీద కలుపుతూ వేడి చేయాలి.
►మరిగే స్థాయికి వచ్చిన తర్వాత దించేసి మిశ్రమాన్ని విస్కర్‌తో బాగా చిలకాలి.
►ఇప్పుడు పాలను మరిగించి పిండి, చక్కెర వేసి కరిగే వరకు కలపాలి.

►ఇందులో కోకో మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
►ఇప్పుడు మిశ్రమాన్ని చాకొలెట్‌ మౌల్డ్‌ ట్రేలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్‌ మ్యాగ్జిమమ్‌లో ఉంచాలి.
►మిశ్రమం గట్టిపడిన తర్వాత బయటకు తీసి మౌల్డ్‌ నుంచి వేరు చేయాలి.
►వెంటనే వేరుపడకపోతే ట్రేని గోరువెచ్చని నీటి మీద తేలేటట్లు నాలుగైదు సెకన్ల పాటు ఉంచితే చాక్‌లెట్‌లు ట్రే నుంచి విడివడుతాయి.

వైట్‌ చాక్లెట్‌
కావలసినవి:
►కోకో బటర్‌– కప్పు
►చక్కెర పొడి– 3 టేబుల్‌ స్పూన్‌లు
►పాల పొడి– 3 టేబుల్‌ స్పూన్‌లు
►వెనిల్లా ఎసెన్స్‌– మూడు చుక్కలు.

తయారీ:
►ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో కోకో బటర్‌ ఉన్న పాత్రను పెట్టి కలుపుతూ కరిగించాలి.
►దించిన తర్వాత అందులో చక్కెర పొడి, పాల పొడి, వెనిలా ఎసెన్స్‌ వేసి ఉండలు లేకుండా సమంగా కలిగే వరకు కలపాలి.
►ఈ మిశ్రమాన్ని చాక్లెట్‌ మౌల్డ్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

►మిశ్రమం గట్టి పడడానికి మ్యాగ్జిమమ్‌ డిగ్రీల్లో అర గంట నుంచి ముప్పావు గంట పడుతుంది.
►ఇంకా త్వరగా కావాలంటే ఫ్రీజర్‌లో పెడితే 20 నిమిషాల్లో చాక్లెట్‌ తయారవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement