అమావాస్య వెళ్లిపోయింది... నెలవంక కోసం ఎదురు చూపు మొదలైంది. చంద్ర దర్శనం నేడు కావచ్చు... లేదా రేపు కావచ్చు. ‘ఈద్ ఉల్ ఫిత్ర్’ వేడుకకు ఇంటిని సిద్ధం చేద్దాం.
పాకిస్థానీ షీర్ కుర్మా
కావలసినవి:
►సన్న సేమ్యా – పావుకేజీ
►వెన్న తీయని పాలు – లీటరు
►చక్కెర – పావుకేజీ
►నెయ్యి – కప్పు
►జీడిపప్పు – అర కప్పు
►బాదం – అర కప్పు
►పిస్తా – పావు కప్పు
►గులాబీ రెక్కలు– గుప్పెడు
►యాలకులు – పది.
తయారీ:
►ఏ జీడిపప్పు, బాదం, పిస్తాలను తరగాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి వీటన్నింటినీ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి.
►వేగిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
►మిగిలిన నెయ్యిలో సేమ్యా వేసి వేగిన తరవాత పాలు పోసి కలుపుతూ మరిగించాలి.
►యాలకులను నలగ్గొట్టి పాలలో వేయాలి. పదిహేను నిమిషాల పాటు మరిగిన తర్వాత చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ మరిగించాలి.
►ఖీర్ చిక్కబడిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గింజలను, పూలరెక్కలను వేసి కలిపి దించేయాలి.
Comments
Please login to add a commentAdd a comment