Ramadan 2023: Afghan Mutton Biryani Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Afghan Mutton Biryani Recipe: ఆఫ్ఘన్‌ మటన్‌ బిర్యానీ తయారీ ఇలా

Published Sat, Apr 22 2023 2:01 PM | Last Updated on Sat, Apr 22 2023 3:01 PM

Ramadan 2023: Afghan Mutton Biryani Recipe In Telugu - Sakshi

ఆఫ్ఘన్‌ మటన్‌ బిర్యానీ తయారీ ఇలా!
కావలసినవి:
►మటన్‌– కిలో
►బాసుమతి బియ్యం – ముప్పావు కిలో
►లవంగాలు– పది
►దాల్చిన చెక్క – మూడంగుళాల ముక్కలు రెండు

►ఉప్పు – 2 టీ స్పూన్‌లు
►అల్లం వెలుల్లి పేస్ట్‌ – టేబుల్‌ స్పూన్‌
►నీళ్లు– 8 కప్పులు
►నూనె– కప్పు
►ఉల్లిపాయ ముక్కలు – 100 గ్రా
►యాలకులు – 8

►జీలకర్ర–  టీ స్పూన్‌
►క్యారట్‌ తురుము– పావు కేజీ
►కిస్‌మిస్‌ – అర కప్పు
►పైన్‌ నట్స్‌ లేదా బాదం – అరకప్పు
►ఖర్జూరాలు ; పది.

తయారీ:
►మటన్‌ ముక్కలను శుభ్రంగా కడగాలి.
►బియ్యాన్ని కడిగి మునిగేటట్లు నీటిని పోసి పక్కన ఉంచాలి.
►మందపాటి పెద్ద పాత్రలో మాంసం ముక్కలు, ఒక దాల్చిన చెక్కను పలుకులు చేసి వేయాలి.

►సగం లవంగాలు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి కలిపి నీటిని పోసి ఉడికించాలి.
►ముక్క ఉడకడానికి దాదాపు ముప్పావు గంట పడుతుంది.
►బియ్యంలో నీటిని వడపోసి చిల్లుల పాత్రలో వేసి రెండు నిమిషాల సేపు ఉంచాలి.
►మరొక పెనంలో రెండు టేబుల్‌ స్పూన్‌ల నూనె వేడి చేసి పైన్‌ నట్స్‌ లేదా బాదం, కిస్‌మిస్, క్యారట్‌లను వేయించి పక్కన ఉంచాలి.

►ఇప్పుడు పెద్ద పెనం పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి అందులో మరో దాల్చిన చెక్క పలుకులు, మిగిలిన సగం లవంగాలు, యాలకులు, జీలకర్ర వేయాలి.
►ఇవి కొద్దిగా వేగిన తరవాత ఉడికించిన మాంసాన్ని నీరు ఇతర దినుసులతో సహా ఇందులో వేయాలి.
►ఉడకడం మొదలైన తర్వాత బియ్యాన్ని వేసి కలిపి మూత పెట్టాలి.
►మీడియం మంట మీద ఉడికించాలి. పది నిమిషాల్లో ఉడుకుతుంది.
►మధ్యలో ఓ సారి జాగ్రత్తగా మసాలా దినుసులు సమంగా కలవడం కోసం బియ్యం విరగకుండా కలపాలి.

►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యారట్, కిస్‌మిస్‌ మిశ్రమాన్ని, ఖర్జూరాలను బిర్యానీ మీద సమంగా పరిచినట్లు అమర్చి గట్టిగా మూత పెట్టి, మంట తగ్గించాలి. ►ఏడెనిమిది నిమిషాలకు బిర్యానీ రెడీ అవుతుంది.
►వేడిగా ఉన్నప్పుడే రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement