కాబుల్, అప్ఘనిస్తాన్ : మంత్రిత్వ కార్యాలయంపై సోమవారం ఉగ్రదాడి ఘటనలో అప్ఘనిస్తాన్‌లోని కాబుల్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయం బయట భారీ మొత్తంలో పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా ఉద్యోగులు ముందుగానే ఇళ్లకు వెళ్తున్న సమయంలో బాంబు పేలింది.
మొత్తం 12 మంది చనిపోగా, 31 మంది తీవ్రగాయాల పాలయ్యారని ఆ దేశ గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. మహిళలు, పిల్లలు, ఉద్యోగులు బాధితుల్లో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఉగ్రదాడికి బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment