kabul attack
-
ఇంకా 3 రోజులే.. రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్న తాలిబన్లు!
Taliban Seal Off Large Parts of Kabul Airport: కాబూల్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో తాలిబన్లు శనివారం అదనపు బలగాలను మోహరించారు. విమానాశ్రయం వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అమెరికా చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ గడువు చివరి తేదీ(ఆగష్టు 31) సమీపిస్తున్న తరుణంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆగష్టు 15న అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి వేలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్తున్న విషయం తెలిసిందే. అమెరికా సహా మిత్ర దేశాలు తమ దేశ ప్రజలతో పాటు, అఫ్గన్ శరణార్థులను కూడా విమానాల్లో తరలిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తమ పౌరులను అఫ్గనిస్తాన్‌లో ఉండాల్సిందిగా హెచ్చరించిన తాలిబన్లు... గురువారం నాటి ఐసిస్- కే ఘాతుకం తర్వాత చెక్ పోస్టుల వద్ద భద్రత మరింతగా పెంచారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అంచెలంచెలుగా భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారులు బ్లాక్ చేస్తూ.. అడ్డుకుంటూ తాలిబన్ ఫైటర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా ఇస్లామిక్ ఖోరసాన్ (ఐసిస్-కె) గ్రూపు కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిపిన వరుస పేలుళ్ల ఘటనలో దాదాపు 170 మంది అఫ్గన్ ప్రజలు, 13 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడిన విషయం విదితమే. దీంతో కన్నెర్రజేసిన అమెరికా శుక్రవారం.. నంగహర్ ప్రావిన్స్‌లోని ఐసిస్-కె టెర్రరిస్టుల కదలికలను గుర్తించి.. వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో భాగంగా కాబూల్ జంట పేలుళ్ల సూత్రధారిని అమెరికా దళాలు మట్టుపెట్టినట్లు సమాచారం. చదవండి: Kabul Attack: నా తమ్ముడు చచ్చిపోయాడు.. యుద్ధంతో పాటే.. కాబూల్ దాడుల సూత్రధారిని మట్టుపెట్టిన దళాలు.. బరిలోకి తాలిబన్లు కూడా! -
యుద్ధం మొదలైనపుడు పుట్టాడు.. యుద్ధంతో పాటే..
‘‘ఈ యుద్ధం ప్రారంభమైన ఏడాదే తను జన్మించాడు.. ఈ యుద్ధం ముగిసే దశలోనే తన జీవితం కూడా ముగిసిపోయింది’’- స్టీవ్ నికోయి, కాలిఫోర్నియా పోలీస్ అధికారి. వాషింగ్టన్: స్టీవ్ నికోయి గురువారం నుంచి టీవీకే అతుక్కుపోయారు. తన కొడుకు లాన్స్ కార్పొరల్ కరీం నికోయి గురించి ఎలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఆయన గుండె వేగంతో కొట్టుకుంటోంది. ముగ్గురు సైనికులు వచ్చి ఆ ఇంటి తలుపులు కొట్టగానే విషయం అర్థమైపోయింది. తన కొడుకు ఇక లేడనే మాట నికోయి చెవిన పడింది. కాలిఫోర్నియాకు చెందిన సైనికుడు, 20 ఏళ్ల కరీం నికోయి.. అఫ్గనిస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాబూల్ పేలుళ్లకు సరిగ్గా ఒక్కరోజు ముందు అఫ్గన్ చిన్నారులకు చాక్లెట్లు పంచుతూ తీసుకున్న వీడియోను ఇంట్లో వాళ్లకు పంపించాడు. అది చూసి ఎంతగానో సంతోషించారు కుటుంబ సభ్యులు. కరీం బాగున్నాడు.. త్వరలోనే ఇంటికి వచ్చేస్తాడని భావించారు. కానీ, 24 గంటలు గడవకముందే తమను శాశ్వతంగా వీడి వెళ్లిపోతాడని వారు అస్సలు ఊహించలేదు. ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్-కె) గ్రూపు కాబూల్‌లో జరిపిన వరుస పేలుళ్ల ఘటనలో కరీం నికోయి మృతి చెందాడు. అతడితో సహా 13 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. వైయోమింగ్‌కు చెందిన లాన్స్ కార్పొరల్ రిలీ మెకల్లమ్(20), మాక్స్టన్ సోవియాక్(22), కరీం నికోయి(20) పిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. యుద్ధంతో పాటే తన జీవితం కూడా.. ‘‘ఈ యుద్ధం ప్రారంభమైన ఏడాదే తను జన్మించాడు.. ఈ యుద్ధం ముగిసే దశలోనే తన జీవితం కూడా ముగిసిపోయింది’’ అని కరీం తండ్రి స్టీవ్ నికోయి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 2001లో అఫ్గనిస్తాన్‌లో అమెరికా సేనల మోహరింపు నాటి నుంచి ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ పనితీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని విమర్శించారు. అదే విధంగా అఫ్గన్‌లో పనిచేస్తున్న కమాండర్లు ముందే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమైతే ఇంతటి దురదృష్టకర ఘటన జరిగేది కాదని పేర్కొన్నారు. తన కొడుకు మృతదేహం కోసం ఎదురుచూస్తున్నామని, ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కాబూల్ దాడుల సూత్రధారిని మట్టుపెట్టిన దళాలు.. బరిలోకి తాలిబన్లు కూడా! తండ్రి కాబోతున్నాడనే సంతోషం నిలవలేదు.. వైయోమింగ్‌కు చెందిన రిలీ మెకల్లమ్ చిన్ననాటి నుంచే సైన్యంలో సేవలు అందించాలని భావించాడు. గతంలో జోర్డాన్‌లో పనిచేసిన అతడు ఇటీవలే అఫ్గనిస్తాన్‌లో బాధ్యతలు చేపట్టాడు. కాబూల్ పేలుళ్లు జరిగినపుడు చెక్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న అతడు మరణించాడు. ‘‘పిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నా సోదరుడు సైనికుడిగా ఉండాలని ఆరాటపడేవాడు. బొమ్మ తుపాకీతో పహారా కాసేవాడు. పింక్ ప్రిన్సెస్ స్నో బూట్స్ ధరించి.. తాను దుండగులను మట్టుపెడతానంటూ తన ముద్దు ముద్దు మాటలతో మమ్మల్ని సంతోషపెట్టేవాడు. మరో మూడు వారాల్లో తనకు బిడ్డ పుట్టబోతోంది. ఒక గొప్ప తండ్రిగా ఉండాలని తను భావించాడు. కానీ అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’’ అని మెకల్లమ్ సోదరి ఖియెనె మెకల్లమ్ అసోసియేటెడ్ ప్రెస్‌తో వ్యాఖ్యానించారు. ‘‘నచ్చిన పనిచేస్తూ చనిపోయినా ఫర్వాలేదని’’ మెకల్లమ్ చెప్పేవాడంటూ అతడి స్నేహితులు గుర్తు చేసుకున్నారు. ఒకవేళ అదే జరిగితే.. నేను చంపేవైపే ఉంటాను.. మాక్స్టన్ సోవియాక్.. అమరులైన 13 మంది సైనికుల్లో ఒకరు. ‘‘చంపడం లేదా చంపబడటం.. తప్పదు అనుకుంటే.. నేను కచ్చితంగా చంపే వైపే ఉంటాను’’ అంటూ ఇటీవలే తన ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టారు. యుద్ధం తప్పనిసరైతే ఎంతదాకానైనా వెళ్తానంటూ సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటో షేర్ చేశారు. అయితే, దురదృష్టవశాత్తూ గురువారం నాటి పేలుళ్ల ఘటనలో ఆయన మృత్యువాత పడ్డారు. చిన్న వయస్సులోనే మాక్స్టన్ ప్రాణాలు కోల్పోవడం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. View this post on Instagram A post shared by Maxton Soviak (@max_soviak) నా చిన్నారి తమ్ముడు చనిపోయాడు.. మాక్స్టన్ మృతిపై స్పందించిన అతడి సోదరి మెర్లిన్ సోవియాక్ శనివారం ఇన్‌స్టా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘నేనెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇకపై మాట్లాడను కూడా. కానీ.. ఎంతో అందమైన మనసు కలిగిన, తెలివిగల వాడైన, ఎంతో అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన నా చిన్నారి తమ్ముడు.. ఇతరులు ప్రాణాలు కాపాడే క్రమంలో చనిపోయాడు. తనొక మెడిక్. తోటి వాళ్లకు సాయం చేసేవాడు. తను లేని లోటును మాకు ఎవరు పూడ్చలేరు. మా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. తనింకా పిల్లాడే. మా పిల్లలను శవాలుగా మారేందుకే మేం సైన్యంలోకి పంపించామా? మాలాంటి కుటుంబాలు తీవ్ర వేదన అనుభవిస్తున్నాయి. నా గుండె ముక్కలైపోతోంది. వాళ్లు ఇక తిరిగిరారు కదా. అసలు ఎందుకు ఇదంతా జరుగుతోంది’’ అని తమ్ముడితో ఉన్న ఫొటోలతో కూడిన వీడియోను పంచుకున్నారు. View this post on Instagram A post shared by Marilyn Soviak (@nighht__maree) కాగా వీరు ముగ్గురితో పాటు హంటర్ లోపెజ్, టేలర్ హూవర్, డియాగన్ విలియం- టైలర్ పేజ్ మరణించిన సైనికుల జాబితాలో ఉన్నారు. అయితే, కాబూల్ పేలుళ్లలో మరణించిన సైనికుల వివరాలను అమెరికా రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -వెబ్‌డెస్క్(ది ట్రిబ్యూన్, అసోసియేటెడ్ ప్రెస్ సౌజన్యంతో) చదవండి: ఐసిస్ ఖోరసాన్- వీళ్లెంత దుర్మార్గులంటే.. -
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి,10 మంది మృతి
-
ఆఫీస్‌పై బాంబు దాడి ; 12 మంది మృతి
కాబుల్, అప్ఘనిస్తాన్ : మంత్రిత్వ కార్యాలయంపై సోమవారం ఉగ్రదాడి ఘటనలో అప్ఘనిస్తాన్‌లోని కాబుల్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయం బయట భారీ మొత్తంలో పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా ఉద్యోగులు ముందుగానే ఇళ్లకు వెళ్తున్న సమయంలో బాంబు పేలింది. మొత్తం 12 మంది చనిపోగా, 31 మంది తీవ్రగాయాల పాలయ్యారని ఆ దేశ గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. మహిళలు, పిల్లలు, ఉద్యోగులు బాధితుల్లో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఉగ్రదాడికి బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదని చెప్పారు. -
షాకింగ్: పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడబోం!
-
షాకింగ్: పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడబోం!
స్నేహపూర్వక మ్యాచులు రద్దు తెగేసి చెప్పిన ఏసీబీ కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన తాజా ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంది. పొరుగుదేశం పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. పాకిస్థాన్ జట్టుతో తలపెట్టిన స్నేహపూర్వక మ్యాచులను రద్దు చేస్తున్నామని, అలాగే గతంలో ఉమ్మడి క్రికెట్ సంబంధాల కోసం గతంలో చేసుకున్న ఒప్పందాల నుంచి కూడా బయటకు వస్తున్నామని అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ట్విట్టర్లో స్పష్టం చేసింది. కాబూల్‌లోని దౌత్యప్రాంతంలో బుధవారం జరిగిన భారీ బాంబు పేలుడులో 90మందికిపైగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. ఈ పేలుడుకు సూత్రధారి పాకిస్థాన్‌లోని హక్కానీ నెట్‌వర్క్‌యేనని, పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ సహకారంతో ఈ దుర్మార్గానికి పాల్పడిందని అఫ్ఘాన్ జాతీయ సెక్యూరిటీ డైరెక్టరేట్ (ఎన్డీఎస్) స్పష్టం చేసింది. ఈ కాబూల్‌లోని జర్మనీ, ఇరాన్ ఎంబసీలకు అత్యంత సమీపంలో జరిగిన ఈ పేలుడు వెనుక పాక్ హస్తముందని తేలడంతో ఆ దేశంతో ఇక క్రికెట్ ఆడకూడదని ఏసీబీ నిర్ణయం తీసుకుంది. -
అఫ్ఘాన్‌లో నలుగురు భారతీయుల మృతి
తాలిబన్ ఉగ్రవాదులు అఫ్ఘాన్ రాజధాని కాబూల్ నగరంలోని ఓ గెస్ట్‌హౌస్‌లోకి చొరబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు భారతీయులతో పాటు ఓ అమెరికన్ మరణించారు. విదేశీయులు ఎక్కువగా సందర్శిస్తూ ఉండే ఆ గెస్ట్‌హౌస్‌లోనే భారత రాయబారి కూడా ఉండి ఉంటారన్న అనుమానంతోనే తాలిబన్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల పాటు కాల్పులు జరిగిన తర్వాత ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో (అఫ్ఘాన్ కాలమానం) ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. సమాచారం అందిన కొద్దిసేపటికే అఫ్ఘాన్ జాతీయ భద్రతాదళం, ప్రత్యేక బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దుండగులపై కాల్పులు జరిపి, గెస్ట్‌హౌస్‌లో బందీలుగా ఉన్నవారిని విడిపించే ప్రయత్నం చేశారు. దాడిలో నలుగురు భారతీయులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో మొత్తం ఎంతమంది మరణించారన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. తొలుత మొత్తం 9 మంది మరణించారని, వారిలో ఇద్దరు భారతీయులున్నారని అన్నారు. కానీ తర్వాత మృతుల్లో భారతీయుల సంఖ్య నాలుగని తేలింది.