Mutton biryani
-
Hyderabad: మటన్ బిర్యానీ సరిగ్గా ఉడకలేదు.. డబ్బులు ఇవ్వను
అబిడ్స్: బిర్యానీ విషయంలో చోటు చేసుకున్న వాగ్వాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన సంఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబిడ్స్ గ్రాండ్ హోటల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నూతన సంవత్సరం సందర్భంగా దూల్పేట్ గంగాబౌలికి చెందిన ఎనిమిది మంది ఆదివారం రాత్రి అబిడ్స్ గ్రాండ్ హోటల్‌కు వచ్చారు. మటన్ బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలను ఆర్డర్ చేశారు. వెయిటర్స్ మటన్ బిర్యానీ తీసుకురాగా అది సరిగ్గా ఉడకలేదని, చల్లగా ఉందని వారు వాపస్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వెయిటర్లు అదే బిర్యానీని వేడి చేసుకుని తీసుకువచ్చారు. దీంతో వారు బిర్యానీతో ఇతర వంటకాలను తిన్నారు. అయితే మటన్ బిర్యానీ మాత్రం తాము డబ్బులు చెల్లించమని, మటన్ ఉడకనప్పుడు ఎందుకు చెల్లించాలని వెయిటర్స్‌ను నిలదీశారు. మిగతా పైసలు చెల్లిస్తామని, మటన్ బిర్యానీ డబ్బులు మాత్రం చెల్లించేది లేదని భీష్మించారు. దీంతో వెయిటర్స్, ధూల్‌పేట్ వాసుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో వెయిటర్స్ కర్రలు, కుర్చీలతో వారిపై దాడి చేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రాండ్ హోటల్ వెయిటర్స్ దాడి చేస్తున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: రాజాసింగ్ ఈ విషయమై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ హోటల్ యాజమాన్యంపై, వెయిటర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు వెంటనే హోటల్ యజమానితో పాటు వెయిటర్స్‌ను అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హోటల్‌కు వచ్చిన కస్టమర్లపై దాడులు చేయడం దారుణమన్నారు. పోలీసులు వెంటనే హోటల్‌ను మూసివేయని పక్షంలో తానే రంగంలోకి దిగాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు. హోటల్‌కు వచ్చిన వారిలో మహిళలు కూడా ఉన్నారని వారిపై కూడా వెయిటర్స్ దాడి చేయడం దారుణమన్నారు. పోలీసుల అదుపులో 10 మంది వెయిటర్స్ ధూల్‌పేట వాసులపై దాడులకు దిగిన 10 మంది వెయిటర్స్‌ను అబిడ్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్ ఇన్స్పెక్టర్ నర్సింహారాజును వివరణ కోరగా హోటల్ యజమానితో పాటు వెయిటర్స్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితుడు సుమిత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోటల్ యజమానితో పాటు వెయిటర్స్‌పై కూడా కేసులు నమోదు చేశామన్నారు. ముందు జాగ్రత చర్యగా హోటల్‌ను మూసివేశామన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. -
ఆఫ్ఘన్ మటన్ బిర్యానీ తయారు చేసుకోండిలా!
ఆఫ్ఘన్ మటన్ బిర్యానీ తయారీ ఇలా! కావలసినవి: ►మటన్– కిలో ►బాసుమతి బియ్యం – ముప్పావు కిలో ►లవంగాలు– పది ►దాల్చిన చెక్క – మూడంగుళాల ముక్కలు రెండు ►ఉప్పు – 2 టీ స్పూన్లు ►అల్లం వెలుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ►నీళ్లు– 8 కప్పులు ►నూనె– కప్పు ►ఉల్లిపాయ ముక్కలు – 100 గ్రా ►యాలకులు – 8 ►జీలకర్ర– టీ స్పూన్ ►క్యారట్ తురుము– పావు కేజీ ►కిస్మిస్ – అర కప్పు ►పైన్ నట్స్ లేదా బాదం – అరకప్పు ►ఖర్జూరాలు ; పది. తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. ►బియ్యాన్ని కడిగి మునిగేటట్లు నీటిని పోసి పక్కన ఉంచాలి. ►మందపాటి పెద్ద పాత్రలో మాంసం ముక్కలు, ఒక దాల్చిన చెక్కను పలుకులు చేసి వేయాలి. ►సగం లవంగాలు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి నీటిని పోసి ఉడికించాలి. ►ముక్క ఉడకడానికి దాదాపు ముప్పావు గంట పడుతుంది. ►బియ్యంలో నీటిని వడపోసి చిల్లుల పాత్రలో వేసి రెండు నిమిషాల సేపు ఉంచాలి. ►మరొక పెనంలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పైన్ నట్స్ లేదా బాదం, కిస్మిస్, క్యారట్లను వేయించి పక్కన ఉంచాలి. ►ఇప్పుడు పెద్ద పెనం పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి అందులో మరో దాల్చిన చెక్క పలుకులు, మిగిలిన సగం లవంగాలు, యాలకులు, జీలకర్ర వేయాలి. ►ఇవి కొద్దిగా వేగిన తరవాత ఉడికించిన మాంసాన్ని నీరు ఇతర దినుసులతో సహా ఇందులో వేయాలి. ►ఉడకడం మొదలైన తర్వాత బియ్యాన్ని వేసి కలిపి మూత పెట్టాలి. ►మీడియం మంట మీద ఉడికించాలి. పది నిమిషాల్లో ఉడుకుతుంది. ►మధ్యలో ఓ సారి జాగ్రత్తగా మసాలా దినుసులు సమంగా కలవడం కోసం బియ్యం విరగకుండా కలపాలి. ►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యారట్, కిస్మిస్ మిశ్రమాన్ని, ఖర్జూరాలను బిర్యానీ మీద సమంగా పరిచినట్లు అమర్చి గట్టిగా మూత పెట్టి, మంట తగ్గించాలి. ►ఏడెనిమిది నిమిషాలకు బిర్యానీ రెడీ అవుతుంది. ►వేడిగా ఉన్నప్పుడే రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. -
చికెన్.. చికెన్.. మటన్.. చికెన్
ఏం తిందాం? రెస్టారెంట్‌కు వెళ్లినా... ఇంటికి పార్శిల్ తెప్పించుకున్నా వచ్చే మొదటి ప్రశ్న. అడగడం పూర్తయిందో లేదో... సమాధానం వచ్చేస్తుంది. బిర్యానీ... అదీ చికెన్ బిర్యానీ. బిర్యానీకి హైదరాబాద్ ఎప్పుటినుంచో ఫేమస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్. మనోళ్లు చికెన్ బిర్యానీ అంటే చాలు లొట్టలేస్తూ లాగించేస్తున్నారు. భారతీయులకు చికెన్ బిర్యానీయే అత్యంత ప్రీతిపాత్రమైన డిష్ అని మరోసారి రుజువైంది. అంతేకాకుండా నాన్‌వెజ్, వెజ్ అనే తేడాలు లేకుండా 2020లో మనదేశంలో ప్రతీ సెకనుకు ఒకటి కంటే ఎక్కువగా బిర్యానీ పార్శిల్ ఆర్డర్లు వస్తున్నాయి. మొత్తం ఆర్డర్లలో... అత్యధికంగా ఆర్డర్ చేసింది చికెన్ బిర్యానీ కాగా ఆ తర్వాతి స్థానాల్లో మసాలా దోశ, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ నిలిచాయి. దేశంలో 2020 జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చిన లక్షలాది ఆర్డర్లను ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’విశ్లేషించింది. స్విగ్గీ విడుదల చేసిన ఐదో ఎడిషన్ స్టాట్‘ఈట్’స్టిక్స్ రిపోర్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, హైదరాబాద్ హెల్తీఫుడ్కు మెట్రోల మొగ్గు: హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రోలలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల కోసం మొగ్గుచూపుతున్నట్టు తేలింది. సూపర్ గ్రెయిన్స్ ఆధారిత ఆహారాన్ని కోరే ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది 127 శాతం పెరిగింది. శాకాహార పదార్థాల ఆర్డర్లు 50 శాతం, అధికప్రొటీన్ ఫుడ్ ఆర్డర్లు 49 శాతం పెరిగాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ హెవీగా తీసుకోవడం, మధ్యాహ్నభోజనం ఓ మోస్తరుగా, రాత్రిపూట మితంగా తినడమనేది పాటించదగ్గ ఆరోగ్యసూత్రం. మెట్రోల్లో దీన్ని జనం ఆచరిస్తున్నారని తేలింది. సగటున 427 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో, 350 కేలరీల ఫుడ్డును లంచ్‌కు, సగటున 342 కేలరీలనిచ్చే ఆహారాన్ని డిన్నర్లో తీసుకుంటున్నారని తమ ఆర్డర్లను బట్టి స్విగ్గీ విశ్లేషించింది. హైఫైబర్ ఇడ్లీ, హైప్రోటీన్ కిచ్డీ, కొవ్వుతక్కువుండే సలాడ్లు, శాండ్విచెస్, గ్లూటెన్ రహిత ఐస్‌క్రీమ్‌లను ఆరోగ్యకరమైన అలవాట్లలో భాగంగా ఎక్కువ తీసుకుంటున్నారు. స్ట్రీట్ ఫుడ్‌కూ డిమాండే.. పానీపూరి, ఇతర స్ట్రీట్‌ఫుడ్‌ను సైతం వినియోగదారులు స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. లాక్డౌన్ అనంతరం 2 లక్షలకు పైగా పానీపూరి ఆర్డర్లను డెలివరీ చేశారు. పీఎం స్వనిధి స్కీంతో భాగస్వామ్యంలో భాగంగా దేశంలోని 125 నగరాల్లోని 36 వేల వీధివ్యాపారుల ద్వారా మరిన్ని స్ట్రీట్ ఫుడ్ ఐటెమ్స్ రకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్విగ్గీ ప్రకటించింది. ► ఈ ఏడాది నమోదైన 3 లక్షల మంది కొత్త స్విగ్గీ వినియోగదారుల మొట్టమొదటి ఆర్డర్ చికెన్ బిర్యానీయే. ► ఈ ఏడాది 1 వెజ్బిర్యానీకి 6 చికెన్ బిర్యానీ నిష్పత్తిలో ఆర్డర్లు వచ్చాయి ► లాక్డౌన్ మొదలు ఇప్పటివరకు పానీపూరీల కోసం 2 లక్షల ఆర్డర్ చేశారు ► స్విగ్గీ ద్వారా ఇంట్లో వండుకోవడానికి తెప్పించుకునే మాంసాహారంలోనూ చికెన్‌దే అగ్రస్థానం. 6 లక్షల కేజీల చికెన్‌ను డెలివరీ చేశారు. తర్వాతి స్థానంలో చేపలు నిలిచాయి. ► మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడే నగరాల్లో బెంగళూరుది మొదటిస్థానం. ► ఈ ఏడాది ‘లాక్డౌన్ బర్త్‌డేస్’సెలబ్రేషన్స్ కోసం 6 లక్షల కేక్‌లు డెలివరీ అయ్యాయి. ► స్విగ్గీ డెలివరీ స్టాఫ్‌కు భోపాల్, బెంగళూరుకు చెందిన ఇద్దరు వినియోగదారులు అత్యధికంగా రూ.5 వేల చొప్పున టిప్పులిచ్చారు . హైదరాబాద్ అభి‘రుచు’లు 1) చికెన్ బిర్యానీ 2) ఇడ్లీ 3) మసాలా దోశ 4) చికెన్ 65 5) పన్నీర్ బటర్ మసాలా 6) వడ 7) మటన్ బిర్యానీ 8) వెజ్ బిర్యానీ ఆర్డర్లలో టాప్–5 నగరాలు 1) బెంగళూరు 2) ముంబై 3) చెన్నై 4) హైదరాబాద్ 5) ఢిల్లీ -
ఆ గుడిలో చికెన్, మటన్ బిర్యానీలే ప్రసాదాలు
భారతదేశం ఆలయాల నిలయం. ఇక్కడ ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా ఉండవు. అయితే.. ఆ రాష్ట్రంలోని మధురై ప్రాంతంలో ఉన్న మునియాండి స్వామి ఆలయానికి మరెక్కడా లేనంత విశిష్టత ఉంది. లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి, చివరకు బిస్మిల్లా బాత్ కూడా ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తుండటం మనం చూశాం. కానీ ఏకంగా మాంసాహారాన్ని ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తారా.? అంటే ఇలాంటి కొన్ని వింతలు కూడా ఉంటాయన్నది సత్యం. కానీ.. మునియాండి స్వామి ఆలయంలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం 1000 కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇదే ప్రసాదంగా అందిస్తారు. అంతేకాదు, ఆ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉండటం గమనార్హం. Tamil Nadu: Biryani is served as 'prasad' at Muniyandi Swami temple in Vadakkampatti, Madurai. A devotee says,'I come here every yr,we're celebrating this festival for last 84 yrs.Around 1000 kg rice,250 goats&300 chickens are used to make biryani, we use public donations for it' pic.twitter.com/6ZYEIlKZkt — ANI (@ANI) January 26, 2019 -
ఈ పేరు వింటే లొట్టలు వేస్తుంటారు
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): మండీ.. ఈ పేరు వింటేనే నగరవాసులు లొట్టలు వేస్తుంటారు. ఈ వంటకం సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. పాతబస్తీ కేంద్రంగా విస్తరించిన క్రేజ్.. ఇటీవలి కాలంలో మరింత పుంజుకుంది. మటన్‌లో సహజసిద్ధంగా ఉత్పతన్నమయ్యే ద్రవాలు లేదా జ్యూసెస్తోటే బిర్యానీ రైస్ అన్నం ఉడకడం ద్వారా దీనికో ప్రత్యేకమైన రుచి, పరిమళం అబ్బుతుంది. అందుకే దీని రుచి చూసినవారు ఆ రుచిని ఇక దేనితోనూ పోల్చలేరు. ఒకేసారి కనీసం ఇద్దరు నుంచి అరడజను మంది దాకా తినేందుకు అవకాశం ఉండడం దీనిలో మరో విశేషం. మటన్, చికెన్, ఫిష్ మూడు వెరైటీల్లోనూ మండీ సర్వ్ చేస్తున్నారు. నవతరానికి కూడా బాగా దగ్గరైన ఈ వంటకం... ఓల్డ్‌సిటీలోని బార్కస్‌లో పుట్టి... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాలన్నింట్లోని రెస్టారెంట్లు దీనికి ప్రత్యేకంగా మెనూలో స్థానం కల్పించక తప్పని పరిస్థితి తెచ్చింది. ఇక పూర్తిగా మండీ పేరు మీదే ఏర్పాటవుతున్న రెస్టారెంట్లు, కేఫ్‌లకు కూడా నగరంలో కొదవలేదు. దీని ధర రూ.250 నుంచి రూ.600 దాకా ఉంటుంది. కొన్ని చోట్ల వెరైటీని బట్టి ఇంకా ఎక్కువ కూడా చెల్లించాలి. మండీకి పేరొందిన కొన్ని రెస్టారెంట్లు: గచ్చిబౌలి, మాదాపూర్‌లోని ఎమ్ఎమ్ ట్రీ, ఫైవ్ 6, మండీ ఎట్ 36, హిమాయత్‌నగర్‌లో మండిలీషియస్. -
మటన్ తిన్నారో..మటాష్
⇒నగరంలోని పలు హోటళ్లలో నాణ్యత లేని మాంసం ⇒అపరిశుభ్రంగా వంటగదులు ⇒జీహెచ్ఎంసీ దాడుల్లో బట్టబయలు సిటీబ్యూరో: దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పేరు ఏదైనా లొట్టలు వేస్తూ తినే వారందరో. ఆయా బిర్యానీలు, మాంసాహార వంటకాల పేర్లు వినగానే మాంసాహారప్రియుల మనస్సు లాగేస్తుంది. అయితే నగరంలోని పలు హోటళ్లు కనీస ప్రమాణాలు పాటించకుండా నాణ్యతలేని మాంసాన్ని వండి వడిస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో తినడానికి పనికిరాని మాంసాన్ని వడ్డిస్తూ తమ గల్లా పెట్టె నింపుకుంటున్నాయి. గ్రేటర్ పరిధిలోని పలు హోటళ్లలో మాంసంగా వినియోగించేందుకు వీల్లేని రోగాలతో కూడిన గొర్రెలు, పశువుల మాంసాన్ని వంటకాల్లో వినియోగిస్తున్నారు. వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యకరంగా, తగిన వయసులో ఉన్న మేకలు, గొర్రెలు, పశువుల మాంసాన్నే ఆహారంగా తీసుకోవాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అందుకు తగినట్లు జీవాల ఆరోగ్యస్థితిని, వయసును పరిశీలించి తినడానికి అర్హమైనవాటిని గుర్తించి వాటినే వధించాలని ధ్రువీకరిస్తూ జీహెచ్ఎంసీ స్టాంపు వేస్తుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే స్లాటర్ హౌస్‌లలో ఈ ప్రక్రియ జరుగుతుంది. వీటిల్లోనే జంతువుల్ని వధించి, స్టాంపు వేసిన మాంసాన్నే వినియోగించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే పలు హోటళ్ల యాజమాన్యాలు వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ వధించిన, అనారోగ్యం,, మరీ లేత, ముదిరిపోయిన, ముసలి జీవాలు, పశువుల మాంసాన్ని వండి ప్రజలకు వడ్డిస్తున్నాయి. నొన్ని హోటళ్లలో కుళ్లిన మాంసాన్ని సైతం నిల్వచేసి వండుతున్నట్లు ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, వైద్యాధికారులతో కూడిన బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హోటళ్లలో నాణ్యత పాటించడం లేదని గుర్తించి ఆయా హోటళ్ల నిర్వాహకులకు భారీగా జరిమానాలు విధించారు. కొన్నింటిని సీజ్ చేశారు ఆదేశాలు బేఖాతర్.. జీహెచ్ఎంసీ స్లాటర్‌హౌస్‌లలో శాస్త్రీయ పద్ధతుల్లో వధించిన, జీహెచ్ఎంసీ ధ్రువీకరిస్తూ స్టాంప్ వేసిన ఆరోగ్యకర మాంసాన్నే వినియోగించాలని, వంటశాలల్ని పరిశుభ్రంగా ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల హోటళ్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి, హెచ్చరించినా వారిలో మార్పురాలేదు. ప్రజలనుంచి ఫిర్యాదులు అందడంతో సోమవారం అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. పేరెన్నికగన్న హోటళ్లలో కూడా నాణ్యతలేని మాసం విక్రయిస్తున్నట్లు వెల్లడికావడం గమనార్హం. ఆయా స్లాటర్ హౌస్‌లలో రోజుకు 2వేల మేకలు , గొర్రెల్ని శాస్త్రీయ పద్ధతుల్లో వధించే సామర్ధ్యం ఉన్నప్పటికీ కేవలం 50 నుంచి 150 మాత్రమే అక్కడకు వస్తున్నాయి. దీంతో యథేచ్చగా బహిరంగ ప్రాంతాల్లో వాటిని వధించి హోటళ్లకు తరలిస్తున్నారు.జియాగూడలోని 11 ఎకరాల్లో ప్రతిరోజూ దాదాపు ఆరువేల మేకలు, గొర్రెలు వధిస్తున్నారు. నగరంలో సరఫరా అవుతున్న మాంసంలో దాదాపు 70 శాతం మేకలు, గొర్రెల్ని ఇక్కడే వధిస్తుండటం గమనార్హం. వీటికి తోడు బహదూర్‌పురా, రామ్నాస్పురా, గౌలిపురా, బార్కాస్, గోల్కొండ, బోయిగూడ, తదితర ప్రాంతాల్లో జీవాల్ని వధిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయా ప్రాంతాల్లో నిబంధనలను పట్టించుకోవడం లేదు. 9నెలల కంటే తక్కువ వయసున్న మేకలు, గొర్రెల్ని, మూడేళ్లలోపు పశువులు, అనారోగ్యంగా ఉన్నవాటిని వధించరాదని నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. మాంసంపై వెటర్నరీ వైద్యుని పర్యవేక్షణలో ధ్రువీకరణ స్టాంప్ వేయాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రముఖ నేతల అండదండల కారణంగానే ప్రైవేటుగా జంతువులను వధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కారణంగా పరిసరాలు, భూగర్భజలాలు, వాతావరణం కలుషితమవుతున్నాయి. జీహెచ్ఎంసీ స్లాటర్ హౌస్‌లలో మేక, గొర్రెలకు రూ. 25లు, పశువులకు రూ.100 వంతున వసూలు చేస్తుండగా, ప్రైవేట్ వ్యక్తుల వద్ద ధర తక్కువని, పశువులు, మేకల్ని ఉంచడానికి తగిన స్థలం లేదని చెబుతూ ప్రైవేటు కబేళాలను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. రూ. 1.40 లక్షల జరిమానా వసూలు సోమవారం 14 హోటళ్లపై దాడులు నిర్వహించిన అధికారులు జీహెచ్ఎంసీ ధ్రువీకరణ లేని, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నందుకుగాను రూ. 1.40 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. వ్యాధుల భారిన పడే ప్రమాదం వ్యాధులతో బాధపడుతున్న జంతువుల మాంసాన్ని వినియోగించరాదని అధికారులు పేర్కొన్నారు. జంతువుల్ని వధించిన తర్వాత రక్తనాళాల్లో రక్తం ఇంకిపోయిన తర్వాత మాత్రమే వాటినుంచి తోలును వేరు చేయాల్సి ఉంటుందన్నారు. ఒక జంతువు రక్తం మరో జంతువు రక్తంతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అయితే ప్రైవేటు వధశాలల్లో నిబంధనలు పాటించడం లేదన్నారు. మాంసాన్ని 120 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేశాకే ఆహారంగా తీసుకోవాలన్నారు. ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన మాంసాన్ని తగిన ఉష్టోగ్రత వరకు వేడిచేయకుండానే వండటం వల్ల జీర్ణాశయ, శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరించారు. జరిమానా విధించిన హోటళ్లు ఆన్ ఓహ్రీస్, (బంజారాహిల్స్)అస్టోరియా హోటల్ (ఆర్టీసీ క్రాస్‌రోడ్స్), డ్రంక్‌యార్డ్ శివాని రెస్టారెంట్ అండ్ బార్ (గచ్చిబౌలి), ప్యారడైజ్ హోటల్, (ఐఎస్‌సదన్), సోహెల్ హోటల్ (నల్గొండ క్రాస్‌రోడ్స్), ఆల్ షబా హోటల్(గచ్చిబౌలి), సాగర్ రెస్టారెంట్ (షాపూర్‌నగర్).. అపరిశుభ్రమై వాతావరణంలో ఆహారాన్ని వండుతున్న మినర్వా గ్రాండ్, ఎస్డిరోడ్ (సికింద్రాబాద్) యాజమాన్యానికి రూ. 20 వేల జరిమానా విధించారు. -
మటన్ కొడత.. మస్తుగ తింట
‘నేనో గమ్మతు మనిషిని. నన్ను చూస్తెనే చాలా మంది కొత్తోల్లు అరె మంత్రి గిట్లగూడ ఉంటడా అని పరేశాన్ అయితరు. హోదా పెరిగినా నా మనస్తత్వం మారదు. ఎప్పుడు ప్రజల్ల ఉండుడు, నలుగుట్ల తినుడు అలవాటు బై. మంత్రిగాంగనె మారుమంటె మారుతనా. చికెన్ తినబుద్దికాదు. మటన్ బిర్యానీ అంటే పెద్దగ ఇష్టం ఉండదు. మటన్ దగ్గరికి వండి, తెల్లఅన్నం పెడితే కడుపునిండ తిన్నట్టు ఉంటది...’ అంటూ ఎక్సైజ్ శాఖా మంత్రి టి.పద్మారావుగౌడ్ తన సన్నిహితులకు తరచూ చెబుతుంటారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బౌద్దనగర్‌లో ఓ మటన్షాపుకు వెళ్లారు. అక్కడ కత్తి తీసుకుని మటన్ కట్ చేశారు. ఇంతలో ‘మంత్రి గారు మటన్ బాగా కొడుతుండు’ అని ఎవరో అనడంతో స్పందించిన పద్మారావు...‘నేను మటన్ కొడుత..మస్తుగ తింట’ అని సమాధానం చెప్పడంతో అక్కడ నవ్వులు విరిశాయి. - సికింద్రాబాద్ -
విలువలకు, వంచనకు మధ్య ఫైట్
దేడ్ కహానీ - కార్పొరేట్ * మంచి సినిమాకు ఉదాహరణ. * నిజాలను కళ్లకు కట్టింది. * పాఠ్యాంశంగా పుస్తకాలకెక్కింది. రెండు కార్పొరేటు సంస్థల అధిపతుల మధ్య ఫైటు, అది ముగిసిపోవడానికి వాళ్లు మాట్లాడుకున్న రేటు, ఆ రేటుకి వాళ్లు వెతికిన ఉద్యోగిని నిషీ అనే గోటు (మేక), ఆ గోటును వేసిన వేటు... మంచి సినిమా గురించి రాయరా అంటే మటన్ బిర్యానీ రెసిపీ మొదలు పెట్టాడేంటి అనుకుంటున్నారా! అదేం కాదు. ఓ మంచి సినిమా సారాంశాన్నే ఇలా క్లుప్తంగా చెప్పాను. 2006లో విడుదలైన ఆ మంచి సినిమా... మధుర్ భండార్కర్ తీసిన ‘కార్పొరేట్’. థియేటర్లలో సినిమాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిలో కొన్ని అభిరుచి గల ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోతాయి. మరికొన్ని విమర్శకులు, సమీక్షకుల ఆర్టికల్స్‌లో, వాళ్ల మేధస్సుల్లో మమేకమై ఉంటాయి. కానీ ఇవన్నీ దాటి ‘కార్పొరేట్’ అనే సినిమా మాత్రం అహ్మదాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో పాఠ్యాంశంగా మారింది. సినిమాలు చూసి చదువులు పాడు చేసుకోకండ్రా అని పెద్దవాళ్లతో తిట్లు తిన్న ప్రతి సినీ అభిమానీ... ఓ సినిమా కూడా చదువైంది అని గర్వంగా చెప్పుకోవడానికి అవకాశాన్నిచ్చిన సినిమా ‘కార్పొరేట్’. అది తీసిన మధుర్ భండార్కర్‌కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఈ వ్యాసం మొదలు పెట్టలేను. భారతదేశంలోని కొన్ని పుణ్య నదులు భౌతిక కాలుష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. అయినా వాటిలో స్నాన మాచరించి, వాటిలోని నీళ్లు తాగుతున్న తరతరాల భారతీయుల రోగ నిరోధక శక్తిని నమ్మి... ఏ బ్యాక్టీరియా కలిసిన డ్రింకైనా భారతీయులు తాగేయగలరు, తాగి అరాయించుకోనూగలరు అనుకుంది ఓ విదేశీ కూల్‌డ్రింక్ కంపెనీ. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమా ణాలను అనుసరించకుండా, పెస్టిసైడ్స్‌ని ముప్ఫై శాతం ఎక్కువ మోతాదులో కలిపి భారతీయ మార్కెట్లో అమ్మేసింది. 2003లో బయట పడేవరకూ ఆ నిజం మనకు తెలీదు. మనకు తెలీని మరో విషయం ఏమిటంటే... మన భారతీయులం అవినీతిని, అన్యాయాన్ని, పాపాన్ని, లోపాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని, నిరుద్యోగాన్ని, ప్రాణాలకి విలువ లేకుండా తీసేయడాన్ని... ఇంకా ఇలాంటి ఎన్నో అవలక్షణాలని నరనరానా జీర్ణించేసుకుని పెరుగుతున్నాం కాబట్టి, ఈ సాంఘిక రోగాలేవీ మనల్ని ఏమీ చేయ లేవు. మనకి వీటి నిరోధక శక్తి కూడా ఎక్కువే. అందుకే వీటిని సహిస్తాం తప్ప నిరోధించం. అందుకే కూల్‌డ్రింక్‌లో పెస్టిసైడ్ కలిపారన్న వార్త కేసుగా మారిన ప్పుడు నాలుగు రోజులు మాట్లాడుకుని ఊరుకున్నాం. నెల తర్వాత మళ్లీ అవే కూల్డ్రింకులు మామూలుగా తాగేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు వాటి ప్రమాణా లేంటో మనకి తెలీదు. సడెన్‌గా వాట్సాప్‌లో ఓ మెసేజ్ వస్తుంది... కుర్ కురేలో ప్లాస్టిక్ ఉందని, మాజా ఫ్యాక్టరీలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడైన ఓ వర్కర్ తన రక్తాన్ని డ్రింకులో కలిపేశాడని! ఆ కాసేపు గుర్తుంచుకుంటాం. ఇంకో మెసేజ్ రాగానే మర్చిపోతాం. మనకి వ్యవస్థ మీద కన్నా మన నిరోధక శక్తి మీద నమ్మకం ఎక్కువ. ఈ సామాజిక బలహీనతల్ని బలంగా మార్చుకుని, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించుకున్న ఇద్దరు బడా వ్యాపారవేత్తల క థే... ‘కార్పొరేట్’. ఇద్దరు బడా వ్యాపారవేత్తలు ఒకరి మీద ఒకరు సాగించుకునే ప్రచ్ఛన్న యుద్ధంలో వారి వెంట ఉన్న పనివాళ్లు నీతిగా, నిజాయతీగా, కంపెనీ బాగుంటేనే మనం బాగుంటాం అని నమ్మి పని చేస్తుం టారు. ఎదుటి కంపెనీతో వారికి వైరం ఉన్నట్టు ద్వేషిస్తారు. చివరికి ఆ వ్యాపారా ధిపతులిద్దరూ రాజకీయ నాయకుల చొరవతో దేశ సంక్షేమం కోసం గొడవలు ఆపేసి ఒకటైపోతే... పనివాళ్లు బలైపో తారు. చదరంగంలో తెల్లరాజు, నల్లరాజు ఒకటైపోతే... వారి కోసం అప్పటివరకూ పోరాటం చేసిన మంత్రులు, సేనానులు, గుర్రాలు, ఏనుగులు, భటుల పరిస్థితిని కళ్లకు కట్టినట్టు రచించారు, చిత్రీకరించారు మధుర్ ‘కార్పొరేట్’ చిత్రంలో. అజిత్ మోంగా, మనోజ్ త్యాగి అనే ఇద్దరు యువ రచయితలతో, కొత్తగా పరిశ్రమలోకి వస్తోన్న వాళ్లతో కూర్చుని మధుర్ ఈ చిత్ర స్క్రిప్టును తయారు చేయడం విశేషం. రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు కాకముందు కొన్నాళ్లు ఓ వీడియో షాప్ నడిపారు. అలాగే మధుర్ ఓ వీడియో షాపులో డెలివరీ బాయ్‌గా పని చేశారు. తర్వాత కొన్నాళ్లకి సినిమా పరిశ్రమలో ప్రవేశించి, చిన్నా చితకా సినిమాలకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశారు. అక్కడ వచ్చే వెయ్యి రూపాయల జీతం సరిపోక, మస్కట్‌లో ఉంటోన్న వాళ్ల అక్క దగ్గరకెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. అదీ వర్కవుటవ్వక మళ్లీ ముంబై వచ్చి వర్మ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. ‘రంగీలా’కి సహాయ దర్శకుడిగా పని చేసి, మెల్లగా దర్శకుడిగా మారారు. మోడ్రన్ మిలీనియమ్‌లో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కాని, సమాజంలో స్త్రీ పాత్ర ఎలా ఉందో కరెక్ట్‌గా, కనెక్టింగ్‌గా గాని చెప్పాలంటే... అది మధుర్కే సాధ్యం. ఫ్యాషన్, పేజ్ 3, కార్పొరేట్, చాందినీ బార్... ఇలా ఆయన తీసిన చిత్రాలన్నీ ఆ కోవకే చెందుతాయి. వర్మ దగ్గర పని చేసిన వందల మంది అసిస్టెంట్ డెరైక్టర్స్ ఆయన టేకింగ్ స్టయిల్ని అనుకరిస్తారు. కృష్ణవంశీ, మధుర్ భండార్కర్, అనురాగ్ కశ్యప్... ఇలా కొద్దిమంది మాత్రమే సమస్యని రాము ఎంత ఇన్టెన్సిటీతో చూపిస్తారో, భావోద్వేగాల్ని పాత్రల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఒకే మోతాదులో ఎలా పండించాలో అవగతం చేసుకున్నారు. దానికి వాళ్లు తమ క్రియేటివిటీని, సొంత బాణీని జోడిస్తారు. అందుకే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. ‘కార్పొరేట్’కి పాటలు అనవసరం. పాటలకు పెద్దగా అవకాశం లేని కథ, కథనం అవ్వడం వల్ల ఆడియో అంత అప్పీలింగ్‌గా ఉండదు. అయితే పాత్రల తీరుతెన్నులు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఎస్.ఐ..ఇ. కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నిషిగంధా దాస్ గుప్తాగా బిపాసా నటన అమోఘం. కార్పొరేట్ రాజకీయాలకు బలైపోయే నిజాయతీ పరురాలైన ఉద్యోగినిగా గుండెల్ని పిండుతుందామె. ఇతర పాత్రల్లో రాజ్‌బబ్బర్, రజత్ కపూర్, కేకే మీనన్‌ల నటన కూడా శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది. కార్పొరేట్ అట్మాస్పియర్ని, స్థాయికి తగినట్టు పాత్రల ప్రవర్తనని, బాడీ లాంగ్వేజీని చూపించాడు దర్శకుడు. మాటలు ఎక్కడ రాయకూడదో అక్కడ రాయలేదు. అది బెస్ట్ పార్ట్ ఈ చిత్రంలో. మనకి అర్థం కాని కార్పొరేట్ కుట్రల్ని, జీవనశైలిని అతి సామాన్యులైన పాత్రల ద్వారా బ్రహ్మాండంగా చెప్పిం చారు మధుర్. బిపాసా ఆఫీసులో ఇద్దరు ప్యూన్లు, గులాబ్రావ్ అనే మంత్రి దగ్గర ఉండే గన్‌మెన్ ద్వారా వాళ్ల మాటల్లోనే కార్పొరేట్ సినిమా కథ, ఆత్మ, అర్థం... అన్నీ అందేస్తాయి ఆర్డినరీ ప్రేక్షకుడికి. ఓ సీన్లో ఒక ప్యూను... ‘ప్యూన్ అండ్ బాస్ మధ్య చాలా తేడా ఉంటుంది’ అంటాడు. రెండో ప్యూను ‘ఏంటా తేడా’ అని అడుగుతాడు. అప్పుడతను... ‘నైన్ టు సిక్స్ ఆఫీస్ టైమ్ అయితే, నైన్ టు ఫోర్ పని చేసి వెళ్లిపోయేవాడు ప్యూన్. ఫోర్ నుంచి పని మొదలుపెట్టేవాడు బాస్’ అంటాడు. అలాగే మరో సందర్భంలో... ‘కంపెనీ డబ్బు మీద సింగపూర్లు, మలేసియాలు తిరగడమే కార్పొరేట్ల జీవితం’ అని ఒక ప్యూన్ కామెంట్ చేస్తాడు. అలాగే... ‘కార్పొరేట్ కంపెనీ అంటే ఒక్క ముక్కలో చెప్తాను. ఎక్కడైతే ఒక్కడు చేయగలిగిన పనికి ఒక టేబుల్ మీద పదిమంది కూర్చుని డిస్కస్ చేసి, చివరికి ఆ పనిని చెడగొడతారో అదే కార్పొరేట్ ఆఫీస్’ అంటూ తేల్చేస్తాడు. ఇంకోసారి... ‘ఈ బాసుగారు ఆఫీసులో ఆర్నెల్లకోసారి సెక్రెటరీని మారుస్తారు’ అంటాడో ప్యూన్. ఎందుకని అడుగుతాడు రెండో ప్యూన్. ‘ఇండియాలో ఆర్నెల్లకోసారి భార్యని మార్చే అవకాశం లేదుగా, అందుకు’ అంటాడా మొదటి ప్యూన్. మంత్రిగారి గన్‌మెన్ కూడా ఇలాంటి నిజాల్ని అలవోకగా చెబుతుంటారు. ఒక గన్‌మేన్... ‘మంత్రిగారు ఆ గదిలోకి వెళ్లారు. ప్రముఖ నటి ఈ గదిలోకి వెళ్లారు. మరి నువ్వేంటి వాళ్లిద్దరి మధ్య సెట్టింగ్ అన్నావ్’ అని అడుగుతాడు. అప్పుడు రెండో గన్‌మేన్... ‘ఒరేయ్ బుద్ధూ... ఇలాంటి సెట్టింగుల కోసం స్టార్ హోటల్స్‌లో గదికి గదికి మధ్య తలుపులు ఉంటాయ్, పబ్లిక్‌కి తెలియకుండా’ అంటూ రహస్యాన్ని బైట పెడతాడు. ఇవి కొన్నే. ఇలాంటి డైలాగులు అడుగడుగునా ఉంటాయీ సినిమాలో. ఉమనైజింగ్, మూఢ భక్తి, స్వామీజీలను గుడ్డిగా నమ్మడం, రాజకీయ నాయకుల జోక్యం, లంచాలు, టై అప్స్, షేర్స్, నైతికతకి అనైతికతకి మధ్య సంఘర్షణ, వ్యక్తిగత జీవితాల్లో ఒంటరితనం, ప్రేమానురాగాలు, నిత్యం గెలుపు ఓటముల మధ్య ఊగిసలాట... ఇలా డబ్బు, అధికారం చుట్టూ ఉండే అన్ని ఎలిమెంట్స్‌నీ కళ్లకి కట్టినట్టు చూపించేలా కథ రాసుకున్నారు మధుర్. ఈ ఆర్టికల్ కోసం సూపర్ హిట్ సినిమాలను చూస్తుంటే నాకో సూత్రం అర్థమైంది. కొత్తగా కథలు రాసుకునేవాళ్లకి పనికొస్తుందది. ముఖ్యంగా ‘కార్పొరేట్’ హిట్ కావడానికి ఆ సూత్రం ఒక ముఖ్య కారణం కాబట్టి చెప్పే తీరాలి. ఉత్థానంలో మొదలైన కథ పతనంతో ముగుస్తుంది. పతనంతో మొదలైన కథ ఉత్థానంతో సుఖాంతమవుతుంది. ఉత్థానం నుంచి ఉత్థానం, పతనం నుంచి పతనం డ్రామాని క్రియేట్ చెయ్యవు. ఫ్లాట్‌గా ఉండి సినిమాలు ఫెయిలవుతాయి. కావాలంటే ఏ సూపర్‌హిట్ సినిమా అయినా చూడండి... ఇదెంత నిజమో మీకే అర్థమవుతుంది. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు