మటన్ కొడత.. మస్తుగ తింట | Minister motton kahani | Sakshi
Sakshi News home page

మటన్ కొడత.. మస్తుగ తింట

Published Wed, Jan 20 2016 4:37 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

మటన్ కొడత.. మస్తుగ తింట

మటన్ కొడత.. మస్తుగ తింట

 ‘నేనో గమ్మతు మనిషిని. నన్ను చూస్తెనే చాలా మంది కొత్తోల్లు అరె మంత్రి గిట్లగూడ ఉంటడా అని పరేశాన్ అయితరు. హోదా పెరిగినా నా మనస్తత్వం మారదు. ఎప్పుడు ప్రజల్ల ఉండుడు, నలుగుట్ల తినుడు అలవాటు బై. మంత్రిగాంగనె మారుమంటె మారుతనా. చికెన్ తినబుద్దికాదు. మటన్ బిర్యానీ అంటే పెద్దగ ఇష్టం ఉండదు. మటన్ దగ్గరికి వండి, తెల్లఅన్నం పెడితే కడుపునిండ తిన్నట్టు ఉంటది...’ అంటూ ఎక్సైజ్ శాఖా మంత్రి టి.పద్మారావుగౌడ్ తన సన్నిహితులకు తరచూ చెబుతుంటారు.

మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బౌద్దనగర్‌లో ఓ మటన్‌షాపుకు వెళ్లారు. అక్కడ కత్తి తీసుకుని మటన్ కట్ చేశారు. ఇంతలో ‘మంత్రి గారు మటన్ బాగా కొడుతుండు’ అని ఎవరో అనడంతో స్పందించిన పద్మారావు...‘నేను మటన్ కొడుత..మస్తుగ తింట’ అని సమాధానం చెప్పడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
 - సికింద్రాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement