Best Avocado Recipes In Telugu: How To Prepare Avocado Toast And Sweet Potato Soup - Sakshi
Sakshi News home page

Avocado Toast Recipe: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు.. ఆవకాడో టోస్ట్‌, చిలగడ దుంప సూప్‌ తయారీ ఇలా!

Published Fri, Oct 14 2022 12:02 PM | Last Updated on Thu, Mar 9 2023 4:00 PM

Recipes In Telugu: Healthy Food Avocado Toast Sweet Potato Soup - Sakshi

అవకాడో టోస్ట్‌, చిలగడ దుంప సూప్‌

అసలే ఉరుకుల పరుగుల జీవితం, దీనికితోడు ఒత్తిడి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ  ఒత్తిడిని అధిగమించకపోతే ఏ పనీ సరిగా చేయలేం. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. అయినా తగ్గదు. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే స్ట్రెస్‌ ఇట్టే తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వంటకాలు ఎలా వండుకోవాలో చూద్దాం....

ఆవకాడో టోస్ట్‌
కావలసినవి:  
►ఆవకాడో గుజ్జు – పావు కప్పు
►రోస్ట్‌ చేసిన బ్రెడ్‌ స్లైస్‌ – ఒకటి
►ఉడికించిన గుడ్డు – ఒకటి
►ఆలివ్‌ ఆయిల్‌ – టీస్పూను
►నిమ్మరసం – టీస్పూను
►సబ్జా గింజలు – టీస్పూను
►ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా.

తయారీ:
►బ్రెడ్‌ స్లైస్‌ను రెండు ముక్కలుగా కట్‌ చేయాలి
►బ్రెడ్‌ ముక్కలపై ఆవకాడో గుజ్జుని పొరలా రాసి, దీనిపైన గుడ్డుని స్లైసులుగా కట్‌ చేసి పెట్టాలి
►చివరిగా నిమ్మరసం, సబ్జాగింజలు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి.

చిలగడ దుంప సూప్‌
కావలసినవి:
►నూనె – టేబుల్‌ స్పూను
►జీలకర్ర – అర టీస్పూను
►ఆవాలు – అర టీస్పూను
►పసుపు – పావు టీస్పూను

►అల్లం తురుము – టే బుల్‌ స్పూను
►వెల్లుల్లి తురుము – టేబుల్‌ స్పూను
►పచ్చిమిర్చి – రెండు
►నిమ్మచెక్క  – ఒకటి

►టొమాటో – ఒకటి (సన్నగా తరగాలి)
►చికెన్‌ లేదా వెజిటేబుల్‌ స్టాక్‌ – నాలుగు కప్పులు
►తొక్కతీసిన చిలగడ దుంపల తురుము – రెండు కప్పులు
►కరివేపాకు – రెండు రెమ్మలు
►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
►ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ:
►చికెన్‌ లేదా వెజిటేబుల్‌ స్టాక్‌ను తీసుకుని పసుపు, ఉప్పు వేసి మీడియం మంట మీద మరిగించాలి
►పదినిమిషాల తరువాత చిలగడ దుంపల తురుము, అల్లం, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసి ఉడికించాలి
►ఈ దుంపల మిశ్రమాన్ని పది నిమిషాలు ఉడికించాక టొమాటో ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి
►స్టవ్‌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి ∙కాగిన నూనెలో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి
►ఆవాలు వేగాక కరివేపాకు వేసి వేయించాలి.
►దీనిలో మరిగించిన సూప్‌ను పోయాలి చివరిగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి వేడివేడిగా సర్వ్‌చేసుకోవాలి.

ఇవి కూడా ట్రై చేయండి: Tomato Keema Balls Recipe: టొమాటో కీమా బాల్స్‌.. తయారీ ఇలా! 
Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్‌ హల్వా తయారీ ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement