Winter- Recipes In Telugu: చలికాలంలో బ్రెడ్ గార్లిక్ సూప్ తయారు చేసుకోండిలా!
కావలసినవి:
►బ్రెడ్ ముక్కలు – అర కప్పు
►వెల్లుల్లిపాయ – సగం ( పలుచగా ముక్కలుగా కట్ చేసుకోవాలి)
►గుడ్లు – 2 (తినేవారి సంఖ్యని బట్టి పెంచుకోవచ్చు)
►కారం – 1 టేబుల్ స్పూన్ పైనే
►ఉప్పు – తగినంత
►బిర్యానీ ఆకు – 1
►అన్నిరకాల కూరగాయ ముక్కలు – (చిన్నచిన్నగా తరిగి, 4 కప్పుల నీళ్లు పోసి.. కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని.. సుమారు రెండున్నర కప్పులు అయ్యేలా.. బాగా మరిగించి, ముక్కల్ని వడకట్టి.. ఆ వెజిటబుల్ స్టాక్‌ని పక్కన పెట్టుకోవాలి)
►నూనె – సరిపడా
►కొత్తిమీర తురుము – గార్నిష్‌కి
తయారీ:
►ముందుగా ఒక కళాయిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి.. అందులో వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించాలి.
►అవి వేగాక బ్రెడ్ ముక్కలు వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి.
►అనంతరం.. ఉడికించిన కూరగాయలను వడకట్టిన నీటిని 2 కప్పుల వరకు ఇందులో పోసుకోవాలి
► తర్వాత బిర్యానీ ఆకు వేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తూ ఉండాలి.
►మధ్యలో రెండు గుడ్లను పగలగొట్టి.. పసుపు సొన విడిపోకుండా కళాయిలో వేరువేరుగా వేసుకోవాలి.
►గరిటెతో జాగ్రత్తగా కలుపుతూ ఉడకనివ్వాలి.
►మొత్తం మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి.
►గుంట గరిటెతో గుడ్లను సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.
►తినే ముందు కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Mushroom Omelette: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ!
Recipe: రుచికరమైన మీల్ మేకర్ – చికెన్ బాల్స్ తయారీ ఇలా!
Comments
Please login to add a commentAdd a comment