Recipe: చిలగడ దుంపతో తియ్యటి కట్‌లెట్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా! | Recipes In Telugu: How To Make Sweet Potato Cutlet | Sakshi
Sakshi News home page

Sweet Potato Cutlet Recipe: చిలగడ దుంపతో తియ్యటి కట్‌లెట్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా!

Published Sat, Jul 16 2022 1:32 PM | Last Updated on Sat, Jul 16 2022 1:43 PM

Recipes In Telugu: How To Make Sweet Potato Cutlet - Sakshi

బయట చిటపట చినుకులు పడుతూ ఉంటే.. వేడివేడిగా ఇంట్లో ఏదైనా క్రిస్పీగా చేసుకుని తింటే ఆ మజానే వేరు! ఈ వర్షాకాలంలో చిలగడ దుంపతో తియ్యటి కట్‌లెట్‌ ట్రై చేయండి మరి!

తియ్యటి కట్‌లెట్‌ 
కావలసినవి:
►నానపెట్టిన సగ్గుబియ్యం – అరకప్పు
►చిలగడ దుంప – పెద్దది ఒకటి
►వడగట్టిన సొరకాయ తురుము – పావు కప్పు
►జీడిపప్పు పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు
►పుదీనా ఆకులపొడి – టీస్పూను
►జీలకర్ర పొడి – టీస్పూను
►కారం – అరటీస్పూను
►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
►ఉప్పు – రుచికి సరిపడా
►నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం:
►చిలగడ దుంపను ఉడికించి పొట్టు తీసి, మెత్తగా చిదుముకోవాలి
►చిదుముకున్న దుంప మిశ్రమంలో మిగతా పదార్థాలన్నింటిని వేసి చక్కగా కలపాలి
►ఇప్పుడు రెండు చేతులకు ఆయిల్‌ రాసుకుని మిశ్రమాన్ని కట్‌లెట్‌లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి
►బాణలిలో ఆయిల్‌ వేయాలి.
►ఆయిల్‌ వేడెక్కిన తరువాత కట్‌లెట్‌లను వేసి రెండువైపులా క్రిస్పీ బ్రౌన్‌ కలర్‌లోకి వచ్చేంత వరకు కాల్చాలి.
►ఇలా చేస్తే తియ్యటి కట్‌లెట్‌ రెడీ. ఏ చట్నీతోనైనా ఇవి చాలా రుచిగా ఉంటాయి.

ఇవి కూడా ట్రై చేయండి: Fish Pakodi Recipe: నోటికి కాస్త కారంగా, క్రిస్పీగా.. ఇంట్లో ఇలా ఫిష్‌ పకోడి చేసుకోండి!
Chilakada Dumpa Poorilu: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement