Cashews
-
భారీగా తగ్గిన ‘జీడి పప్పు’ ధర.. కారణం ఇదే..
మలికిపురం: జీడి గింజల ధర భారీగా పతనమైంది. జీడి పప్పు ధర కూడా కేజీకి రూ.100 వరకూ పడిపోయింది. దీంతో వ్యాపారులు, రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజోలు, నరసాపురం నియోజకవర్గాల్లోని సముద్ర తీరంలో జీడిమామిడి సాగు జరుగుతోంది. ఇక్కడ గింజల ఉత్పత్తి చాలా తక్కువే. అయినప్పటికీ.. మలికిపురం మండలం మోరి గ్రామంలో తయారయ్యే జీడి పప్పు ప్రసిద్ధి పొందింది. ఇక్కడి జీడి పప్పు పరిశ్రమకు విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏజెన్సీ, తెలంగాణ నుంచి కూడా జీడి గింజల దిగుమతి అవుతాయి. దిగుబడి పెరగడమే కారణం ఈ ఏడాది జీడి గింజల ఉత్పత్తి అధికంగా ఉండటమే ధర పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. జీడి తోటలు కాపు మీద ఉన్న సమయంలో అదనంగా వర్షాలు కురిశాయి. దీంతో మరోసారి పూత పూసి, జీడి గింజల ఉత్పత్తి పెరిగింది. ఫలితంగా గత ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి కావాల్సిన జీడి గింజల ఉత్పత్తి జూన్‌లో కూడా కొనసాగుతోంది. దీంతో ధర పతనమైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతుల వద్ద 80 కేజీల జీడి గింజల బస్తాను వ్యాపారులు రూ.9,500కు కొనుగోలు చేశారు. ఈ ధర మే నాటికి రూ.7,500కు తగ్గింది. పంట చివరి దశ కావడంతో ధర తగ్గడం సాధారణమే అనుకున్నారు. కానీ.. జీడిచెట్లకు మరోసారి పూత రావడంతో మళ్లీ గింజలు ఉత్పత్తి అయ్యాయి. ప్రస్తుతం 80 కేజీల జీడి గింజల బస్తా రూ.5 వేలకే లభిస్తోంది. ఇందులో నాణ్యత తక్కువగా ఉండే చివరి రకం జీడి గింజలు రూ.3,500కు కూడా లభిస్తున్నాయి పేరుకుపోయిన నిల్వలు ఈ కారణంగా జీడి పప్పు ధర కూడా గణనీయంగా పడిపోయింది. గత ఏప్రిల్, మే నెలల్లో కేజీ జీడి పప్పు ధర రూ.650 ఉండగా.. ప్రస్తుతం రూ.550కి పడిపోయింది. సంప్రదాయ రీతిలో కాల్చి తయారు చేసిన జీడి పప్పు ధర ఇలా ఉండగా.. ఫ్యాక్టరీల్లో తయారవుతున్న బాయిల్డ్ జీడి పప్పు ధర మరింత దారుణంగా ఏకంగా రూ.450కి తగ్గిపోయింది. సీజన్ మొదలైనప్పుడు ఎక్కువ ధరకు గింజలు కొనుగోలు చేసిన వ్యాపారులు.. తక్కువ ధరకు జీడి పప్పు అమ్మాల్సి రావడంతో ఉత్పత్తి నిలిపివేశారు. ధర లేక, కొనుగోలు చేసి గింజల నుంచి పప్పు ఉత్పత్తి నిలిపివేయడంతో వ్యాపారుల వద్ద.. ఉత్పత్తి పెరిగి, అమ్మకాలు తగ్గడంతో రైతుల వద్ద భారీ స్థాయిలో గింజలు పేరుకుపోయాయి. దీనికితోడు ప్రస్తుతం ఆషాఢం, శూన్య మాసాలు కావడంతో శుభకార్యాలు లేక జీడి పప్పు వినియోగం కూడా తగ్గింది. అన్ సీజన్ మరో రెండు నెలలు కొనసాగనుంది. ఉత్పత్తి మానేశాం ధర పడిపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. గత ఏప్రిల్‌లో 80 కేజీల జీడి గింజల బస్తా రూ.9,500కు కొన్నాం. అప్పట్లో చాలా సరకు నిల్వ చేశాం. ఇప్పుడు రూ.3,500కు కూడా లభిస్తోంది. దీంతో ఉత్పత్తి మానేశాం. – కొడవటి ప్రసాద్, వ్యాపారి, మోరిపోడు ధర నిలకడ లేదు వర్షాలు అధికంగా కురిసి మరోసారి పూత రావడంతో ఈ ఏడాది గింజల ఉత్పత్తి పెరిగింది. ఫలితంగా ధర పడిపోయింది. ఈ సమయంలో పప్పు ఉత్పత్తి చేసి విక్రయించలేం. పైగా రెండు నెలలు శుభకార్యాలుండవు. దీంతో అమ్మకాలు కూడా ఉండవు. – ముప్పర్తి నాని, జీడి గింజల దిగుమతిదారు, మోరిపోడు -
Recipe: చిలగడ దుంపతో తియ్యటి కట్లెట్.. ఇంట్లోనే ఇలా ఈజీగా!
బయట చిటపట చినుకులు పడుతూ ఉంటే.. వేడివేడిగా ఇంట్లో ఏదైనా క్రిస్పీగా చేసుకుని తింటే ఆ మజానే వేరు! ఈ వర్షాకాలంలో చిలగడ దుంపతో తియ్యటి కట్లెట్ ట్రై చేయండి మరి! తియ్యటి కట్లెట్ కావలసినవి: ►నానపెట్టిన సగ్గుబియ్యం – అరకప్పు ►చిలగడ దుంప – పెద్దది ఒకటి ►వడగట్టిన సొరకాయ తురుము – పావు కప్పు ►జీడిపప్పు పొడి – రెండు టేబుల్ స్పూన్లు ►పుదీనా ఆకులపొడి – టీస్పూను ►జీలకర్ర పొడి – టీస్పూను ►కారం – అరటీస్పూను ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం: ►చిలగడ దుంపను ఉడికించి పొట్టు తీసి, మెత్తగా చిదుముకోవాలి ►చిదుముకున్న దుంప మిశ్రమంలో మిగతా పదార్థాలన్నింటిని వేసి చక్కగా కలపాలి ►ఇప్పుడు రెండు చేతులకు ఆయిల్ రాసుకుని మిశ్రమాన్ని కట్లెట్లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి ►బాణలిలో ఆయిల్ వేయాలి. ►ఆయిల్ వేడెక్కిన తరువాత కట్లెట్లను వేసి రెండువైపులా క్రిస్పీ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చాలి. ►ఇలా చేస్తే తియ్యటి కట్లెట్ రెడీ. ఏ చట్నీతోనైనా ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Fish Pakodi Recipe: నోటికి కాస్త కారంగా, క్రిస్పీగా.. ఇంట్లో ఇలా ఫిష్ పకోడి చేసుకోండి! Chilakada Dumpa Poorilu: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా! -
జీడిపప్పులో నాణ్యత లేదు
తిరుపతి అలిపిరి: శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందున.. సంబంధిత కాంట్రాక్టును వెంటనే రద్దు చేయాలని అధికారులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి సిద్ధంగా ఉంచిన జీడిపప్పును పరిశీలించారు. ప్రస్తుతం 3 కంపెనీలు జీడిపప్పు సరఫరా చేస్తుండగా.. అందులో ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పులో నాణ్యత లోపించినట్లు గుర్తించారు. దుమ్ము, విరిగిపోయినవి ఉన్నట్లు తేల్చారు. వెంటనే సదరు సంస్థ కాంట్రాక్టు రద్దు చేయాలని వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. అనంతరం యాలకులను పరిశీలించారు. వాసన తక్కువగా ఉండటంతో.. నాణ్యతను తేల్చేందుకు ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఆవు నెయ్యి వాసన కూడా సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ప్రసాదాల తయారీ కోసం ఏటా రూ.500 కోట్ల ఖర్చుతో జీడిపప్పు, నెయ్యి, యాలకులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే వీటిలో నాణ్యత లోపిస్తోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. సరుకులను టీటీడీ ల్యాబ్‌లో పరీక్షించడంతో పాటు సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్‌కు పంపించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆయన వెంట మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. -
జీడిపప్పు, బాదం పప్పు, వాల్ నట్స్ రోజూ తింటే
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఐరన్ ఒక ముఖ్యమైన అంశం. ఐరన్ లోపం వల్ల శరీరంలో రక్తహీనత వస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. వాస్తవానికి, హిమోగ్లోబిన్ రక్త కణాలలో ఉండే ఐరన్ అధికంగా ఉండే ప్రోటీన్, ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి పనిచేస్తుంది. ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడితే, చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది సజావుగా పనిచేయాలంటే, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను ఆహారం లో చేర్చడం చాలా ముఖ్యం. నాన్–వెజ్, సీఫుడ్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హిమోగ్లోబిన్ పెంచడానికి మంచి వనరులు. అవి మీ శరీరంలోని ఐరన్ లోపాన్ని పూరిస్తాయి. శరీరంలో హిమోగ్లోబిన్ వేగంగా పెరిగే డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.. ఐరన్ అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు: ఐరన్ అధికంగా ఉంటుంది. మీరు రోజూ కొన్ని జీడిపప్పులను తీసుకుంటే, అది శరీరంలో 1.89 మి.గ్రా ఐరన్‌ను సరఫరా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, స్నాక్స్ తినాలని అనిపించినప్పుడల్లా, మీరు కొన్ని జీడిపప్పు తినాలి. బాదం పప్పు రోజూ పొద్దున్నే నానబెట్టిన బాదంపప్పును తీసుకుంటే, అది మీ శరీరంలో రక్తం లేకపోవడాన్ని నయం చేస్తుంది. కొన్ని బాదంపప్పులో 1.05 మి.గ్రా ఐరన్ ఉంటుంది, ఇది ఒక రోజులో శరీర అవసరాన్ని తీర్చగలదు. అందువల్ల, మీ ఆహారంలో బాదంపప్పును చేర్చండి. వాల్ నట్స్: మామూలు గా మెదడుకు పదును పెట్టడానికి అక్రోట్లను తినమని సలహా ఇస్తారు, అయితే ఇది హిమోగ్లోబిన్ లోపాన్ని కూడా తీర్చగలదు. రోజూ కొన్ని అక్రోట్లను తీసుకుంటే, 0.82 మి.గ్రా ఐరన్ శరీరానికి అందుతుంది. పిస్తా సాధారణంగా పిసా ్తపప్పులను స్వీట్ల రుచి, అందాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు, కాని ఇది ఐరన్‌తో సమృద్ధిగా ఉందని మీకు తెలియజేయండి, శరీరంలో ఐరన్ కొరత ఉన్నప్పుడు సులభంగా సరఫరా చేయగలదు. మీరు రోజూ కొన్ని పిస్తాపప్పులు తింటుంటే, శరీరానికి 1.11 మి.గ్రా ఐరన్ లభిస్తుంది. -
పోషకాల రారాజు.. జీడిపప్పు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన జీడిపప్పు వినియోగం ప్రస్తుతం మధ్యతరగతి వర్గాలకు సైతం చేరువవుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో చాలా డ్రైఫ్రూట్స్ ఉన్నప్పటికీ జీడిపప్పుకున్న ఆదరణ మరే ఉత్పత్తికి లేకుండాపోయింది. ప్రత్యేకించి కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో అత్యధిక పోషకాలు కలిగిన జీడి ప్రతి ఒక్కరి ఆహారంలో భాగమయ్యిందంటే అతిశయోక్తి కాదు. పండుగల సమయంలో ప్రముఖులకు, ఆత్మీయులకు స్వీట్ బాక్సులు గిఫ్ట్‌గా పంపడం ఆనవాయితీ. అలాగే కరోనా సమయంలోనూ బయట తయారు చేసే స్వీట్ల పట్ల విముఖత పెరగడంతో వాటికి బదులు పోషకాలు ఎక్కువగా ఉన్న డ్రైఫ్రూట్స్ బాక్సుల్ని బహుమతులుగా పంపి ఆత్మీయతను చాటుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలను సవరించిన ప్రస్తుత తరుణంలో జీడి పప్పు వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు ఇది ఖరీదైన వ్యవహారమనే సాధారణ ప్రజల అభిప్రాయం మారడం కూడా డ్రైఫ్రూట్స్ ప్రత్యేకించి జీడిపప్పుకు గిరాకీ పెరగడానికి కారణమైంది. వంటిళ్లలో తయారు చేసే తీపి పదార్థాల స్థానంలో జీడిపప్పును స్నాక్స్‌గా ఇచ్చే సంప్రదాయం కూడా ఇందుకు కలిసివచ్చింది. అత్యవసరమైన పోషక వస్తువుగా జీడి.. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజల వైఖరిలో మార్పు వచ్చింది. అత్యవసరమైన పోషక వస్తువుగా జీడిని గుర్తించారు. ఫలితంగా వినియోగం పెరిగింది. రాబోయేది పండుగల సీజన్. కరోనా ఆంక్షలు తొలగాయి. అందువల్ల ఈ ఏడాది జీడిపప్పు గిఫ్ట్ బాక్సుల వ్యాపారం బాగా సాగవచ్చునని హోల్‌సేల్ జీడిపప్పు వ్యాపారి కె.శ్రీనివాస్ చెప్పారు. కిలో రూ.450 నుంచి రూ.900 వరకు జీడిపప్పు దొరుకుతుంది. జీడిపప్పు వినియోగం ఇలా.. 2017 నుంచి 2020 వరకు సేకరించిన డేటా ప్రకారం జీడిపప్పు తలసరి వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 12 గ్రాములైతే పట్టణ ప్రాంతాల్లో 96 గ్రాములు. గతంలో పోల్చుకుంటే ఇది చాల ఎక్కువని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ ప్రొఫెసర్ టి.గోపీకృష్ణ చెప్పారు. అందువల్ల వ్యాపారులు ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాలలోనే జీడిపప్పు వ్యాపారం చేస్తున్నారు. జీడిపప్పు వినియోగం పెరుగుదల ఏడాదికి 5 శాతంగా అంచనా వేశారు. 60 దేశాలకు ఎగుమతులు.. మన రాష్ట్రం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకే కాకుండా అమెరికా, అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, జపాన్ సహా 60 దేశాలకు జీడిపప్పు ఎగుమతి అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మామూలు పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి జూలై వరకు మార్కెట్లో ముడి జీడి దొరుకుతుంది. అయితే 2018లో వచ్చిన తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాలోని తోటల్ని దెబ్బతీయగా.. 2019లో వచ్చిన కరోనా దేశవ్యాప్తంగా జీడి పరిశ్రమను మరింత దెబ్బతీసింది. వేలాది మందికి ఉపాధి కల్పించే పలు పరిశ్రమలు మూత పడ్డాయి. దీంతో ఇతర దేశాలు.. ప్రత్యేకించి ఆఫ్రికా నుంచి ముడి గింజలను దిగుమతి చేసుకోవడానికి భారత్ దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. సాగు పద్ధతులను ఆధునీకరించి ఎక్కువ బంజరు భూములను సాగులోకి తీసుకురావడం ద్వారా అదే పరిమాణంలో దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చు. ముడి గింజలకు ఇతరులపై ఆధారపడే కన్నా సమీకృత వ్యూహాలను అవలంభిస్తే మేలని నిపుణులు చెబుతున్నారు. ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఏటా రూ.300 కోట్ల వ్యాపారం మనరాష్ట్రంలోని 8 జిల్లాల్లో 4.53 లక్షల ఎకరాల్లో జీడి మామిడి సాగవుతుంది. లక్ష టన్నుల వరకు దిగుబడి వస్తుంది. జీడి ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రతి రోజూ 60 వేల కిలోలకు పైగా జీడిపప్పు (గుండ్రాలు) ఉత్పత్తి అయ్యేవి. సగటున ఒక కేజీ నాణ్యమైన జీడిపప్పు (గుండ్రాలు) రావడానికి మొత్తం 3.5 కిలోల జీడిపప్పును శుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా రూ.300 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. -
పైశాచికం..!
♦ మహిళ మర్మాంగంలో జీడిపోసిన భర్త ♦ సహకరించిన అత్తమామలు.. ముగ్గురిపై కేసు కౌడిపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ పట్ల ఆమె భర్త, అత్తమామలు అకృత్యానికి పాల్పడ్డారు. ఆమె మర్మావయవంలో జీడి పోశారు. ఈ దుశ్చర్య కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ భవానీమందిర్ తండాలో చోటుచేసుకుంది. గురువారం ఏఎస్ఐ ఖలీమొద్ధిన్ తెలిపిన వివరాల ప్రకారం.. భవానీమందిర్ తండాకు చెందిన వివాహిత (20)ని కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త మదన్ ధరావత్, అత్త చెన్నభాయ్, మామ పాండులు పలుమార్లు వేధించారు. ఈ విషయమై గతంలో తండాలో పంచాయితీలు సైతం నిర్వహించారు. ఈనెల 15న రాత్రి బాధితురాలు నిద్రిస్తుండగా అత్త, మామ పట్టుకోగా భర్త జీడిపోసినట్లు ఏఎస్ఐ తెలిపారు. తీవ్రగాయం కావడంతో గురువారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. -
మోడు వారిన జీడి
గుబురుగా పెరిగిన చెట్లు, గుత్తులుగా వేలాడే జీడిమామిడి కాయలతో కళకళలాడిన సాగరతీరం నేడు ఎడారిని తలపిస్తోంది. పచ్చని తోటలతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం మోడువారిన చెట్లతో వెలవెలబోతోంది. చూద్దామన్నా కాపు కనిపించని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ తీరంలోని జీడిమామిడి తోటలను గాలికి వదిలేడంతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే అటవీ సంపద వేరుపురుగు సోకి అంతరించిపోతోంది. పర్యావరణ సమతుల్యతకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న ఈ తోటల పరిరక్షణకు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. పిట్టలవానిపాలెం : గుంటూరు జిల్లాలో ప్రధాన తీరప్రాంతమైన బాపట్ల సమీపంలో ముత్తాయపాలెం, కర్లపాలెం, పేరలి తదితర గ్రామాలు, ప్రకాశం జిల్లాలోని చినగంజాం మండలం కడవకుదురు ప్రాంతంలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో రిజర్వు ఫారెస్టు భూములున్నాయి. ఈ భూముల్లో అటవీ శాఖ 1956, 57, 58 సంవత్సరాల కాలంలో జీడి మామిడి సాగు చేపట్టింది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే జీడిమామిడి తోటల పరిరక్షణకు 1980లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. బాపట్ల ఫారెస్టు రేంజ్ పరిధిలోని జీడిమామిడి తోటలను నెల్లూరు అటవీ అభివృద్ధి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసి బాపట్ల ఫారెస్టు రేంజ్ విభాగాన్ని కావలి నార్త్ డివిజన్‌గా ఏర్పాటు చేసింది. జీడి మామిడి తోటలను ఆసంస్థ పర్యవేక్షణలోకి చేర్చింది. 2000 సంవత్సరం వరకు ఈ ప్రాంతాల్లో జీడి మామిడి తోటల పరిస్థితి బాగానే ఉంది. తర్వాత కాలంలో చెట్లను వేరు పురుగు ఆశించి సమూలంగా నాశనం చేస్తోంది. నాడు 5,000.. నేడు 150.. తోటలు అంతరించిపోతున్నప్పటికీ అటవీ అభివృద్ధి సంస్థ మాత్రం మొద్దు నిద్ర వీడకపోవడంతో జీడిమామిడి ద్వారా ప్రభుత్వానికి అందాల్సిన రాబడి పూర్తిగా పడిపోయింది. ఆయా ప్రాంతాలలో తోటలపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దెబ్బతింది. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంలో 65 హెక్టార్లలో విస్తరించి ఉన్న జీడిమామిడి చెట్లు 15 ఏళ్ల క్రితం ఐదు వేల చెట్లు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య కేవలం 150 చెట్లకు చేరుకుంది. దీన్ని బట్టి జీడి మామిడి తోటల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంలో 65 హెక్టార్లు, పేరలిలో 1000 హెక్టార్లు, బాపట్ల మండలం ముత్తాయపాలెంలో 2000 హెక్టార్లు, ప్రకాశం జిల్లా కడవకుదురులో 100 హెక్టార్లు విస్తీర్ణంలో జీడిమామిడి తోటలు ఉన్నాయి. గణనీయంగా తగ్గిన ఆదాయం.. గడచిన పదేళ్లుగా జీడిమామిడి ధరలు పెరుగుతున్నాయి. కానీ ఆదాయం తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం తోటల్లో చెట్లు సంఖ్య తగ్గి, ఫలసాయం తగ్గిపోవడమే. వేలంపాటల ద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడి గణనీయంగా తగ్గిపోతుంది. గతేడాది బాపట్ల సెక్షన్ పరిధిలోని జీడిమామిడి తోటలకు రూ.80 లక్షల ఆదాయం సమకూరగా ఈ ఏడాది రూ.40 లక్షలకు పడిపోయింది. దిద్దుబాటు చర్యలతో పూర్వ వైభవం.. అంతరించిపోతున్న జీడిమామిడి తోటలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. తిరిగి తోటలను అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు, అవి పెరిగి ఫలసాయం అందించే వరకు ఆయా అటవీ భూముల్లోని రైతులకు నామమాత్రపు లీజుకు ఇవ్వాలి.దీని వలన మొక్కల పెంపకానికయ్యే ఆర్థిక భారం తగ్గడంతో పాటు రైతులకు ఉపాధి కలుగుతుంది. గతంలో చాలా బాగుండేది.. గతంలో జీడిమామిడి తోటలు చాలా గుబురుగా ఉండేవి. గత పదేళ్లుగా చెట్లు ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతమంతా ఎడారిగా మారింది. ఈసంవత్సరం అసలు చూద్దామన్నా కాపు కన్పించడం లేదు. అధికారులు పరిశీలించి మొక్కలు నాటి పూర్వవైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. - శ్రీనివాసరెడ్డి, తోట కాపలాదారు, కొత్త నందాయపాలెం, కర్లపాలెం మండలం తిరిగి మొక్కలు నాటితే బాగుంటుంది.. నిరుడు చూసిన చెట్లు ఈఏడు ఎండిపోతున్నాయి. దాదాపుగా 65 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నందాయపాలెం తోట పూర్తిగా ఎండిపోయే స్థితికి చేరుకుంది. పచ్చని తోటల దగ్గర ఉండే మాలాంటి వారం చల్లదనం కోల్పోయా. తోట ఎండిపోవడం వలన పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుంది. తిరిగి మొక్కలు నాటితే బాగుంటుంది. - వెంకట్రామిరెడ్డి, కొత్త నందాయపాలెం, కర్లపాలెం మండలం