
కోహీర్ (జహీరాబాద్): చిలగడ దుంప, రత్నపురిగడ్డ, మొర్రం గడ్డ ఇలా పలు పేర్లతో పిలిచే స్వీట్ పొటాటో సాధారణంగా 50 గ్రాముల నుంచి 250 గ్రాముల బరువు తూగుతుంది. ప్రత్యేక శ్రద్ధతో సాగు చేస్తే అరకిలో బరువు తూగే అవకాశముంది.
అయితే సంగారెడ్డి జిల్లా కోహీర్‌కు చెందిన రైతు రాఘవేందర్‌రెడ్డి పొలంలో పండిన చిలగడ దుంప ఒకటి ఏకంగా 5 కిలోలకు పైగా బరువు తూగుతోంది. కోతకొచ్చిన పంటను వారం రోజుల కిందట రాఘవేందర్‌రెడ్డి నాగలి సాయంతో దున్నించారు. పొలంలో పండిన ఇతర చిలగడ దుంపలు అరకిలో కంటే తక్కువ బరువున్నాయని ఈ ఒక దుంప మాత్రం 5 కిలోలకు పైగా బరువు ఉందని తెలిపారు. (క్లిక్: ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు..)