
శరీరంలో పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! నిర్లక్ష్యం వద్దు.. వీటిని తింటే మేలు..!
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది.
అదే విధంగా.. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది.
అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాలి.
పొటాషియం లోపిస్తే మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే..
►కండరాలు బలహీనంగా మారుతాయి.
►కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది.
►అలసట, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు అవుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
►కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది.
►అందువల్ల శరీరంలో పొటాషియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి.
►సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది.
మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.
పొటాషియం ఎందులో లభిస్తుందంటే(Potassium Rich Foods)..
►కోడిగుడ్లు
►టమాటాలు
►చిలగడ దుంపలు
►విత్తనాలు
►నట్స్
►అరటి పండ్లు
►యాప్రికాట్స్
►చేపలు
►తృణ ధాన్యాలు
►పెరుగు
►పాలు
►మాంసం
►తర్బూజా
►క్యారెట్
►నారింజ
►కివీ
►కొబ్బరినీళ్లు
బీట్‌రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది.
చదవండి: Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే..
5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..!
Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం!