మారుతున్న జీవనశైలి కారణంగా మనదేశంలో డయాబెటీస్ రోగులు అంతకంతకు పెరిగిపోతున్నారు. ఇది ఒక దీర్ఘకాలికి సైలంట్ కిల్లర్ వ్యాధి. నెమ్మదిగా శరీర భాగాల పనితీరుని దెబ్బతీస్తుంది. అప్రమత్తతతో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం డేంజర్‌లో ఉన్నట్లే. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉండే ఆహారం తీసుకోవడమే మంచిది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదా కాదా అన్న సందేహం వస్తుంది. ముఖ్యంగా దుంప జాతికి సంబంధించిన చిలగడ దుంపలు, బంగాళ దుంపల విషయంలో చాలామందికి ఈ డౌటు వస్తుంది. అయితే ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే..
ముఖ్యంగా ఈ రెండిటీ విషయంలోనే ఎందుకూ అందరూ తినొచ్చా? వద్దా? అన్న డౌటు పడుతున్నారంటే.. ప్రధాన కారణం రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటమే. ఇవి రెండు భూమిలోనే పెరుగుతాయి. ఇక చిలగ దుంప తియ్యగా కూడా ఉంటుంది. దీంతో బాబోయ్! అని వాటి జోలికి కూడా పోరు షుగర్ పేషెంట్లు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం చిలగడ దుంపలను బేషుగ్గా తినండి అని చెబుతున్నారు. ఎందుకంటే? గ్లైసెమిక్ ఇండెక్స్ బంగాళదుంపలోనూ చిలగడదుంపల్లోనూ వేర్వురుగా ఉంటుందట. అందులో బంగాళదుంపలకు సంబంధించిన కొన్ని జాతుల్లో మరీ వ్యత్యాసం ఉంటుందట. అయితే చిలగడదుంపల్లో ఫైబర్‌తో కూడి ఉంటాయి. పైగా గ్లైసెమిక్ కంటెంట్ కూడా చాలా తక్కువే. ఇందులో ముఖ్యంగా అధిక ఫైబర్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ ఉంటాయని అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు చిలగడ దుంపలు తీసుకోవడమే మేలని సూచిస్తున్నారు.
బంగాళ దుంపలను వండుకుని తీనే తీరుని బట్టి డయాబెటీస్ రోగులకు మంచి షోషకాహారంగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే? ఉడకబెట్టిన బంగాళదుంపలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. అదే వాటిని డీప్ ఫ్రై లేదా ఇతరత్ర విధానంలో ఫ్రై వంటి కూరల్లా చేసుకుంటే మాత్రం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. అలాగే చిలగ దుండపలను చక్కగా ఉడకబెట్టుకుని ఏదైనా ప్రోటీన్ మూలంతో తినడం మంచిదని అంటున్నారు. అమ్మో అవి స్వీట్‌గా ఉంటాయన్న భయం ఉంటే..కనీసం ఆ స్వీట్ పొటాటోని ఉకడబెట్టి వాటిపై దాల్చిన పొడి జల్లుకుని తీసుకున్న మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు.
అలాగే బంగాళదుంపల్లో పోటాషియం అధికంగా ఉండటమే గాక కొన్నిరకాల బీ కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రెండిటిని మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. అంతేగాదు ఈ దుంపలు కార్బోహైడ్రేట్ వర్గంలోకి వస్తాయి కూరగాయాల కిందకి రావని అర్థం చేసుకోండని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి తినేటప్పుడూ చీజ్, ఆయిల్ వంటి ఇతరత్ర కొలస్ట్రాల్‌తో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ కార్బోహైడ్రేట్ అనేది శక్తి వనరుగా శరీరానికి అత్యంత అవసరమైనదని గుర్తించుకోవాలి. దాన్ని సమతుల్యంగా తీసుకుంటే ఎలాంటి సమ్య ఉండదని చెబుతున్నారు నిపుణులు
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే ఇస్తున్నాం. పాటించే మందు మీ ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకుని మీ వ్యక్తిగత వైద్యులు లేదా డైటీషియన్లన సలహాలు సూచనలతో ఫాలో అవ్వడం మంచిది.
(చదవండి: కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బొలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)
Comments
Please login to add a commentAdd a comment