ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ మహిళల గట్ హెల్త్ కోసం పిలుపునిచ్చింది. అందుకోసం సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా హాబిటాట్ సెంటర్‌లోని అపోలో హాస్పిటల్స్ సహకారంతో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ నిపుణులతో ఇల్‌నెస్ టు వెల్నెస్ అనే ప్రోగ్రామ్ నిర్వహిచింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులచే గట్ హెల్త్‌పై అవగాహన కల్పించేలా 'గట్ మ్యాటర్స్- ఉమెన్స్ హెల్త్ అండ్ గట్ మైక్రోబయోమ్' అంశంపై సెమినార్‌ని నిర్వహించింది.
ఆరోగ్య సమస్యలకు మూలం..
ఆ సమావేశంలో హర్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి, పీసీఓఎస్ వంటి దీర్ఘకాలిక పరిస్థితులుపై గట్ మైక్రోబయోమ్ ప్రభావం గురించి చర్చించారు. అలాగే మహిళ తరుచుగా ఎదుర్కొన్నే ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టిసారించారు. ఈ సెమినార్‌లో పాల్గొన్న క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషి ఖోస్లా, డాక్టర్ అర్జున్ డాంగ్, డాక్టర్ డాంగ్స్, డాక్టర్ హర్ష్ మహాజన్, ఇండియన్ కోయలిషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ అయోడిన్ డెఫిషియెన్సీ డిజార్డర్ (ICCIDD) అధ్యక్షుడు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ చంద్రకాంత్ పాండవ తదితరాలు మహిళల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే గట్ హెల్త్ సంరక్షణ గురించి నొక్కి చెప్పారు.
అంతేగాదు సమాజంలో ముఖ్యపాత్ర పోషించే మహిళల ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన ప్రాముఖ్యతను గురించి కూడా హైలెట్ చేశారు. అలాగే మహిళల ఆరోగ్యంలో గట్ హెల్త్ అత్యంత కీలకమైనదని అన్నారురు. ఇది హర్మోన్లు, సంతానోత్పత్తి, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. మహిళలకు సంబంధించిన ప్రశూతి ఆస్పత్రులు లేదా ఆరోగ్య క్లినిక్స్‌లో దీనిపై అవగాహన కల్పించాలన్నారు. ఈ గట్ ఆరోగ్యం అనేది వైద్యపరమైన సమస్య కాదని మొత్తం కుటుంబాన్నే ప్రభావితం చేసే సమస్యగా పేర్కొన్నారు.
సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇల్‌నెస్ టు వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లో తాను పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఆస్కామ్ నేషనల్ సీఎస్‌ఆర్ ఛైర్‌పర్సన్‌అనిల్ రాజ్‌పుత్. ఆరోగ్యకరమైన సమాజాన్నినిర్మించేందుకు ఇలాంటి ఆరోగ్య పరిజ్ఞానానికి సంబందించిన సెమినార్‌లు అవసరమన్నారు. ఇక ఆ సెమినార్‌లో డాక్టర్ అర్జున్ డాంగ్ మహిళల్లో పేగు ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసే అలర్జీలు, సరిపడని ఆహారాలు గురించి కూడా చర్చించారు.
అలాగే అభివృద్ధి చెందుతునన్న రోగ నిర్థారణ సాధానాల ప్రాముఖ్యత తోపాటు అందుబాటులో ఉన్న సమర్థవంతమైన చికిత్సపై రోగులకు సమగ్రమైన అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గురించి నొక్కిచెప్పారు.
మిల్లెట్ల పాత్ర..
పోషకాహారం తీసుకునేలా మిల్లెట్లను మహిళల డైట్‌లో భాగమయ్యేలా చూడాలని వాదించారు. దీనివల్ల మొటిమలు, నెలసరి సమస్యలు, అధిక బరవు తదితర సమస్యలు అదుపులో ఉంటాయని ఉదహరించి మరి చెప్పారు. అంతేగాదు సెమినార్‌లోని నిపుణులు 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన భారతదేశ మిషన్ మిల్లెట్స్ గురించి లేవనెత్తడమే గాక దానిపై మళ్లీ ఫోకస్ పెట్టాలన్నారు. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మిల్లెట్ ఆధారిత ఆహారాలను ప్రోత్సహించాలన్నారు.
అంతేగాదు పెరుగుతున్న ఆటిజం కేసులు, తల్లిబిడ్డల ఆరోగ్యంతో సహా మహిళల ప్రేగు ఆరోగ్యం ఎలా ప్రభావితం చేస్తుందన్నది సెమినార్‌లో నొక్కి చెప్పారు. వీటన్నింటిని నిర్వహించడంలో ఆహారం, మైక్రోబయోమ్ బ్యాలెన్స్‌ల పాత్రపై మరింతగా పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించారు.
చివరగా ఈ సెమినార్‌లో ప్రజారోగ్య విధానాల్లో గట్ హెల్త్ ప్రాముఖ్యత, మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా బడ్జెట్ కేటాయింపుల చర్చలతో ముగిసింది. కాగా, సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రజారోగ్య కార్యక్రమాలలో గట్ హెల్త్ పై అవగాహన పెంచడమే గాక ఇలాంటి సెమినార్‌లో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేలా ప్రోత్సహిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
(చదవండి: ఇండియా నన్ను స్వీకరిస్తే చాలు..!: జాక్వెలిన్ ఫెర్నాండేజ్)
Comments
Please login to add a commentAdd a comment