కొర్రలతో కొండంత ఆరోగ్యం! | How Much Protein Is In Korralu Or Foxtail Millets | Sakshi
Sakshi News home page

కొర్రలతో కొండంత ఆరోగ్యం!

Published Tue, Nov 5 2024 11:24 AM | Last Updated on Tue, Nov 5 2024 3:30 PM

How Much Protein Is In Korralu Or Foxtail Millets

ఇటీవల చిరుధాన్యాల వాడకం పెరిగిపోయిన కాలంలో కొర్రలకు మంచి ప్రాధాన్యం ఏర్పడింది. చాలామంది కొర్రలను పిండిగా కొట్టించి, వాటితో చేసిన ఆహారాలను వాడటం పరిపాటి అయ్యింది. నిజానికి గోధుమ పిండి కంటే కొర్రల పిండి మంచిదంటున్నారు న్యూట్రిషన్‌ నిపుణులు. కొర్రలలో ఉండే పోషకాలూ, వీటితో సమకూరే ఆరోగ్య ప్రయోజనాలూ లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం...

ఒక కప్పు కొర్రపిండిలో  ప్రోటీన్‌ 10 గ్రాములు డయటరీ ఫైబర్‌ 7.4 గ్రాములు, మెగ్నీషియమ్‌ 83 మిల్లీగ్రాములతో తోపాటు ఇంకా చాలా రకాల సూక్ష్మపోషకాలు అంటే మైక్రోన్యూట్రియెంట్లూ ఉంటాయి.  

కొర్రపిండితో సమకూరే కొన్ని ప్రయోజనాలు...  
కొర్రపిండిలో పీచుపదార్థాల పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి దీంతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం తేలిగ్గా నివారితమవుతుంది. ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, అనర్థాలూ దూరమవుతాయన్న సంగతి తెలిసిందే. కొర్రల్లోని ప్రోటీన్లు కండరాల్లోని కణజాలానికి మంచి బలాన్ని ఇస్తాయి. 

ఈ ప్రోటీన్లే కండరాల్లో తమ రోజువారీ పనుల కారణంగా దెబ్బతినే కండరాలను రిపేర్లు చేస్తుంటాయి. దాంతో దెబ్బలు త్వరగా తగ్గడం, గాయాలు త్వరగా మానడం  జరుగుతాయి. బలంగా మారిన ఈ కణజాలాలు మరింత ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించగలుగుతాయి కాబట్టి మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. 

అంతేకాదు చాలాసేపు అలసి΄ోకుండా పనిచేయగలుగుతాయి. ఫలితంగా మనం పనిచేసే సామర్థ్యం, అలసి΄ోకుండా పనిచేయగల సమయం (టైమ్‌ డ్యూరేషన్‌) పెరుగుతాయి. ఈ అంశాలన్నీ కలగలసి రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది.  

డయాబెటిస్‌ నివారణకూ... 
కొర్రల్లో చాలా ఎక్కువ పరిమాణంలో ఉండే పీచు దేహంలోని గ్లూకోజ్‌ను చాలా మెల్లగా రక్తంలో కలిసేలా చేస్తుంది. దాంతో డయాబెటిస్‌ నివారణకు ఇది బాగా తోడ్పడుతుంది. ఈ పీచు పదార్థమూ, ఈ గుణం కారణంగానే టైప్‌–2  డయాబెటిస్‌ ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఆహారంగా రూపొందాయి. 

అంతేకాదు కొర్రలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులోని మెగ్నీషియమ్‌ వల్ల ఎముకలు మరింత పటిష్టమవుతాయి. జీవకణాల్లోని ఎంజైములు మరింత సమర్థంగా పనిచేస్తాయి. కొర్రల్లో జింక్‌ మోతాదులూ ఎక్కువే కావడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు ఈ అంశం దోహదపడుతుంది. ఈ జింక్‌ వల్ల జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది. థైరాయిడ్‌ పనితీరు క్రమబద్ధంగా మారుతుంది. 

(చదవండి: స్పాండిలోసిస్‌ అంటే..?)
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement