కిస్‌మిస్ లేదా ఎండుద్రాక్షను నీళ్లల్లో నానబెట్టి తీసుకోమని నిపుణులు చెబుతుంటారు. ఇలానే ఎందుకు అంటే..కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇలా అయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకావు. అలాగే పోషాకాలను త్వరగా విచ్ఛిన్నం చేసి ఎంజైమ్‌లను సక్రియం చేయగలదు. ఇది మంచి శోషణకు దారితీస్తుంది. అంతేగాదు ఇలా నానబట్టి ఎండుద్రాక్షలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమో సవివరంగా చూద్దాం..!.
ఐరన్ పవర్: ఎండుద్రాక్ష ఐరన్ మూలం. శరీరం అంతటా ఆక్సిజన్ సరఫరా కావడానికి అవసరమైన ఐరన్ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. అలసటను నివారిస్తుంది.శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.
బ్యాలెన్స్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్: ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ నానబెట్టడం వల్ల రక్తప్రవాహంలో వాటి విడుదలను నియంత్రిస్తుంది. పైగా మధుమేహ రోగులకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది.
డిటాక్సిఫైయింగ్ డుయో: ఎండుద్రాక్షలను నానబెట్టడానికి ఉపయోగించే నీరు వాటి పోషకాలు, ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇది సహజమైన డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
బలోపేతంగా రోగనిరోధక వ్యవస్థ: ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీతో నిండి ఉంది. బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఇవి కీలకం. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లతో పోరాడేలా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
మలబద్ధకం నివారణ: దీనిలోని ఫైబర్ కంటెంట్, నానబెట్టడం ద్వారా మరింత పెరుగుతుంది. సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
బోన్ బిల్డర్: ఇందులో బోరాన్ ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం. ఇక్కడ నానబెట్టడం వల్ల బోరాన్ జీవ లభ్యత పెరుగుతుంది. ఫలితంగా శరీరం సులభంగా ఆ పోషకాన్ని గ్రహించి, బలమైన ఎముకల కోసం వినియోగించేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి: ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించి వాపును తగ్గించడం వంటివి చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇలా నానబెట్టడం వల్ల మరిన్ని ప్రయోజనాల పొందడమే కాకుండా వివిధ ప్రమాదాల నుంచి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సహజ స్వీటెనర్: నానబెట్టిన ఎండుద్రాక్ష పెరుగు, తృణధాన్యాలు లేదా స్మూతీస్‌లో శుద్ధి చేసిన చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది తీపి తినాలనే కోరికను నియంత్రిస్తంఉది.
చర్మ ఆరోగ్యానికి: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసి వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి.మవీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
గమనిక: నానబెట్టిన కిష్మిష్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, దానిని మితంగా తీసుకోవడం చాలా కీలకం. రోజుకు కొన్ని (సుమారు 20 నుంచి 30 గ్రాములు) తీసుకోవాలి. ఏమైన అంతర్లీనా ఆరోగ్య పరిస్తితుల దృష్ట్యా నిపుణులు లేద్య వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: రోగి భద్రతకు కావాల్సింది భరోసా..!)
Comments
Please login to add a commentAdd a comment