soaked
-
కిస్మిస్ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!
కిస్మిస్ లేదా ఎండుద్రాక్షను నీళ్లల్లో నానబెట్టి తీసుకోమని నిపుణులు చెబుతుంటారు. ఇలానే ఎందుకు అంటే..కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇలా అయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకావు. అలాగే పోషాకాలను త్వరగా విచ్ఛిన్నం చేసి ఎంజైమ్‌లను సక్రియం చేయగలదు. ఇది మంచి శోషణకు దారితీస్తుంది. అంతేగాదు ఇలా నానబట్టి ఎండుద్రాక్షలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమో సవివరంగా చూద్దాం..!.ఐరన్ పవర్: ఎండుద్రాక్ష ఐరన్ మూలం. శరీరం అంతటా ఆక్సిజన్ సరఫరా కావడానికి అవసరమైన ఐరన్ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. అలసటను నివారిస్తుంది.శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.బ్యాలెన్స్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్: ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ నానబెట్టడం వల్ల రక్తప్రవాహంలో వాటి విడుదలను నియంత్రిస్తుంది. పైగా మధుమేహ రోగులకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది.డిటాక్సిఫైయింగ్ డుయో: ఎండుద్రాక్షలను నానబెట్టడానికి ఉపయోగించే నీరు వాటి పోషకాలు, ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇది సహజమైన డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.బలోపేతంగా రోగనిరోధక వ్యవస్థ: ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీతో నిండి ఉంది. బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఇవి కీలకం. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడేలా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.మలబద్ధకం నివారణ: దీనిలోని ఫైబర్ కంటెంట్, నానబెట్టడం ద్వారా మరింత పెరుగుతుంది. సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.బోన్ బిల్డర్: ఇందులో బోరాన్ ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజం. ఇక్కడ నానబెట్టడం వల్ల బోరాన్ జీవ లభ్యత పెరుగుతుంది. ఫలితంగా శరీరం సులభంగా ఆ పోషకాన్ని గ్రహించి, బలమైన ఎముకల కోసం వినియోగించేలా చేస్తుంది.గుండె ఆరోగ్యానికి: ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించి వాపును తగ్గించడం వంటివి చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇలా నానబెట్టడం వల్ల మరిన్ని ప్రయోజనాల పొందడమే కాకుండా వివిధ ప్రమాదాల నుంచి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.సహజ స్వీటెనర్: నానబెట్టిన ఎండుద్రాక్ష పెరుగు, తృణధాన్యాలు లేదా స్మూతీస్‌లో శుద్ధి చేసిన చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది తీపి తినాలనే కోరికను నియంత్రిస్తంఉది. చర్మ ఆరోగ్యానికి: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతీసి వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి.మవీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు.గమనిక: నానబెట్టిన కిష్మిష్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, దానిని మితంగా తీసుకోవడం చాలా కీలకం. రోజుకు కొన్ని (సుమారు 20 నుంచి 30 గ్రాములు) తీసుకోవాలి. ఏమైన అంతర్లీనా ఆరోగ్య పరిస్తితుల దృష్ట్యా నిపుణులు లేద్య వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: రోగి భద్రతకు కావాల్సింది భరోసా..!) -
డ్రై ఫ్రూట్స్, ఇతర గింజల్ని నానబెట్టి తింటున్నారా? అయితే ..!
ఆయుర్వేదం ప్రకారం, డ్రై ఫ్రూట్స్, ఇతర కొన్ని రకాల గింజలను తినే ముందు రాత్రిపూట నీటిలో నానబెట్టడం మంచిది తద్వారా వాటిల్లోని జీవపదార్థం ద్విగుణీ కృతమవుతుందని తినడానికి సులభంగా ఉంటుందని చెబుతారు. నానబెట్టడం వల్ల నట్స్ , డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాల లభ్యతను పెరుగుతుంది. రాత్రంతా నానబెట్టిన గింజలు, డ్రైఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలుంటాయి.నానబెట్టడం వలన కలిగే ప్రయోజనాలు నానబెట్టిన గింజల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలతో కూడిన అద్భుతమైన మూలాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించి, వ్యాధులను నివారించడానికి, శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.నానబెట్టినపుడు గింజల రుచి, ఆకృతి రెండూ పెరుగుతాయి. అజీర్ణానికి కారణమయ్యే ఫైటిక్ యాసిడ్ తొలగి పోతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే టానిన్ లేదా (ఆమా) గణనీయంగా తగ్గిస్తుంది. గట్ దీంతో గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.మానవ శరీరాన్ని నియంత్రించే మూడు వాత, పిత్త , కఫ దోషాలు రాకుండా ఉంటాయి. వీటి వల్ల బాడీలో అసమతుల్యత, ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.మచ్చుకు కొన్నిమెంతులు: రెండు చెంచాల మెంతుల్ని త్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఉనాలి. ఆ నీటిని తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రపరిచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.అవిసె గింజలు: వీటిలో పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-బి, ఇనుము, మాంసకృత్తులు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ చెంచా నాన బె ట్టిన గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.అంజీరా: ఇది పోషకాల గని. దీంట్లో ఏ, బీ విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, సోడియం, పొటాషియం, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.ఇది మహిళల ఆరోగ్యానికి చాలామంచిది. గుమ్మడి విత్తనాలు: వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని తినడం వల్ల స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మలబద్దకం సమస్యకు కూడా మంచి పరిష్కారం. చెడు కొలెస్ట్రాల్ కరుగుతంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అలాగే మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. పురుషులలో వీర్య కణాల నాణ్యత కూడా పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడే వా ప్రశాంతమైన నిద్ర కావాలంటే వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది.నోట్: రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ , గింజలను చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఏదైనా అనారోగ్య సమస్యలను ఎందుర్కొంటున్నా, ఏదైనా ఇతర సమస్యలున్నా, వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
Soaked Walnuts : వాల్ నట్స్ నానబెట్టి తినాలా? మామూలుగా తినాలా?
వాల్నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మెదడు ఆకారంలో ఉండే దీనివలన జ్ఞాపకశక్తికి మంచి ఉపయోగం ఉటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది వాల్‌నట్స్‌లో ఫైబర్, విటమిన్లు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. ప్రధానంగా పోషకాలకు పవర్ హౌస్ లాంటి వాల్నట్ను నానబెట్టి తింటే దాని లాభాలు రెట్టింపవుతాయి. వాల్నట్లను రాత్రంతా నానబెట్టి, ఉదయం తినడం ఉత్తమమైన మార్గం. 2-4 వాల్నట్ ముక్కలను ఒక కప్పు నీటిలో రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తినాలి.నానబెట్టిన వాల్నట్-ఆరోగ్య ప్రయోజనాలుమెదడుకు మంచిది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పని తీరుకు సహాయపడతాయి. అంతేకాదు వయససురీత్యా వచ్చే మెదడు సమస్యలను దూరం చేస్తాయి. బరువు : తొందరగా బరువు తగ్గాలనుకునేవారికి నానబెట్టిన వాల్నట్స్ బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్ కారణంగా పెద్దగా ఆకలి వేయదు. వాల్ నట్స్ నానబెట్టి తీసుకోవడం జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో ఖనిజాలు ఫైబర్ జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగు ఎముకలకు బలమైన మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇందులో లభిస్తాయి.చర్మ ఆరోగ్యం: ఇందులోని విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతం చేస్తుంది. మెలటోనిన్, పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు ఎండనుంచి చర్మాన్ని రక్షించడంలో సాయపడతాయి.మధుమేహులకు వాల్నట్ గ్లైసోమిక్ సూచి తక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తికి మంచిది వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు , పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబు, జ్వరం లాంటి అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.నిద్రకు: వాల్‌నట్స్‌లో సహజసిద్ధమైన మెలటోనిన్ రసాయనం కారణంగా మంచి నిద్ర పడుతుంది. మెలటోనిన్ చాలా సంవత్సరాలుగా మనకు మంచి నిద్రను పొందడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజాదరణ పొందింది. నానబెట్టిన వాల్నట్లను ఉదయం , పడుకునే ముందు తీసుకుంటే మంచిది. గుండె ఆరోగ్యం: నానబెట్టిన వాల్నట్న్ శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ వాల్‌నట్‌లతో పోలిస్తే, నానబెట్టిన తరువాత ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఆ పోషకాలను బాడీ కూడా సులభంగా గ్రహిస్తుంది. ఇందులోని ఒమేగా ఫ్లాటీ 3 ఆసిడ్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాయిల్ స్థాయిలను పెంచుతాయి. -
బియ్యం నానబెట్టి వండుకుంటే షుగర్ పేషెంట్లకు మంచిదేనా?
భారతీయుల ఆహారంలో ప్రధానమైన ఆహార పదార్థాలలో బియ్యం ఒకటి. ఇండియాలో ఎక్కువగా పండించేది, భారత ప్రజలు ఎక్కువగా తినేది బియ్యమే. ప్రతి సంవత్సరం సగటున 125.038 మిలియన్ టన్నుల బియ్యాన్ని భారతదేశం మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఊబకాయం, మధుమేహ వ్యాధి బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో రైస్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది ప్రచారంలో ఉంది. అయితే బియ్యాన్ని ఉడికించే ముందునీటిలో నానబెట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ నేపథ్యంలో బియ్యాన్ని నానబెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం.అనేక అధ్యయనాల ప్రకారం ఏదైనా గింజల్ని నానబెట్టినపుడు వాటిల్లోని పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి. అలాగే బియ్యాన్ని నానబెట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. బియ్యం నానబెట్టడం దాని గ్లైసెమిక్ సూచిక (GI), పోషకాహార ప్రొఫైల్‌ను ప్రభావితం చేస్తుంది. డయాబెటిక్ రోగులు సాధారణంగా అన్నం తినకూడదని సలహా ఇస్తారు. అయితే బియ్యాన్ని నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచే జీఐని తగ్గిస్తుంది. ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ చేసి జీఐని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నానబెట్టడం వల్ల సెరోటోనిన్, మెలటోనిన్ విడుదలకు సహాయపడుతుంది.బియ్యాన్ని నానబెట్టడం వల్ల అదనపు పిండిపదార్థాలు తొలగిపోతాయి. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ వ్యాధి గ్రస్తులకు కొంతమేరకు ఉపయోగపడుతుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుందిబియ్యం నానబెట్టడం వల్ల పోషకాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ పద్ధతిని ఉపయోగించి బియ్యంలో ఉండే ఫైటోకెమికల్స్, టానిన్లను విచ్ఛిన్నం చేయవచ్చు. అలాగే విటమిన్లు. ఖనిజాల జీవ లభ్యత పెరుగుతుంది.ఇది అన్నం సులభంగా జీర్ణం కావడానికి, అందులోని పోషకాలను గ్రహించేలా చేస్తుంది.ఉడికించే ముందు బియ్యాన్ని నానబెట్టిడం ద్వారా క్లిష్టమైన కార్బోహైడ్రేట్లను సాధారణ చక్కెరగా మార్చడానికి సహాయ పడుతుంది. శరీరంలో ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.వంట సమయాన్ని తగ్గిస్తుందిఅంతేకాదు బియ్యాన్ని నీటితో నానబెట్టడం వల్ల వండే సమయం కూడా తగ్గుతుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల గింజలు మెత్తబడి సులభంగా ఉడుకుతాయి. దీంతో వంట ఖర్చు కూడా ఆదా అవుతుంది.నోట్: ఇది అవగాహనా సమాచారం మాత్రమే. షుగర్ వ్యాధి జీవనశైలితోపాటు అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. -
నట్టేట ముంచిన నకిలీ విత్తనాలు
170 ఎకరాల్లో మిర్చి తోట తొలగింపు దిక్కుతోచని స్థితిలో గిరిజన రైతులు ఆదుకోవాలని వేడుకోలు నేలకొండపల్లి : గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని మిర్చి విత్తన కంపెనీలు నట్టేట ముంచాయి. పూత, కాత రాని విత్తనాలను వారికి అంటగట్టి సొమ్ము చేసుకుని, రైతుల జీవితాల్లో కారం చల్లారు. దీంతో మండలంలో దాదాపు 170 ఎకరాల్లో మిర్చి తోటను తీసివేసి తిరిగి కొత్తగా మిర్చినారును నాటుతున్నారు. కొత్తగా పెట్టుబడి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజవర్గంలోని నేలకొండపల్లి మండలంలో శంకరగిరితండా, మోటాపురం గ్రామాల్లో నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోయాయి. శంకరగిరితండా గ్రామానికి చెందిన 110 మంది రైతులు దాదాపు 150 ఎకరాలకు ముదిగొండ మండల కేంద్రంలోని ఓ దుకాణంలో మిర్చి విత్తనాలను కొనుగోలు చేశారు. ప్యాకెట్ రూ.300 చొప్పున ఎకరానికి 12 ప్యాకెట్లను కొనుగోలు చేశారు. ఆగస్టు 21న విత్తనాలు నాటారు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా మిర్చి మొక్క ఎదిగిన తరువాత పూత, కాత రాకుండా ఉంది. మరికొన్ని మొక్కలు ఎదుగుదల లోపించి ఉన్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన మిర్చి విత్తనాలు నకిలీ అని గుర్తించారు. పంట చేతికొచ్చే సమయంలో మిర్చితోట ఇలా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులంతా ఒకే కంపెనీకి చెందిన విత్తనాలు నాడటంతో ఊరంతా మిర్చి తోటలది ఇదే పరిస్థితి. కౌలు రైతుల కంటతడి.. ఇక కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. తండాలోని బాణోత్ రంగా అనే రైతు రూ.1.30 లక్షలతో కొంత భూమి కౌలుకు తీసుకున్నాడు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్డాడు. ప్రస్తుతం పంటను మొత్తం పీకేశాడు. తిరిగి కొత్తనారు కోసం ఎకరానికి రూ.10 వేల వరకు ఖర్చు పెట్టి తెచ్చాడు. కూలీలకు రూ.5 వేలు ఇవ్వాల్సి ఉంటుందని రైతు తెలిపాడు. ఇలా ప్రతి రైతు బోరున విలపిస్తున్నాడు. మండలంలోని మోటాపురం గ్రామానికి చెందిన 8 మంది రైతులు మరో 20 ఎకరాలు సాగు చేశారు. ఇక్కడ అదే పరిస్థితి నెలకొంది.