వాల్‌నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మెదడు ఆకారంలో ఉండే దీనివలన జ్ఞాపకశక్తికి మంచి ఉపయోగం ఉటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది వాల్‌నట్స్‌లో ఫైబర్, విటమిన్లు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. ప్రధానంగా పోషకాలకు పవర్ హౌస్ లాంటి వాల్‌నట్‌ను నానబెట్టి తింటే దాని లాభాలు రెట్టింపవుతాయి.
వాల్‌నట్‌లను రాత్రంతా నానబెట్టి, ఉదయం తినడం ఉత్తమమైన మార్గం. 2-4 వాల్‌నట్ ముక్కలను ఒక కప్పు నీటిలో రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తినాలి.
నానబెట్టిన వాల్‌నట్-ఆరోగ్య ప్రయోజనాలు
మెదడుకు మంచిది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పని తీరుకు సహాయపడతాయి. అంతేకాదు వయససురీత్యా వచ్చే మెదడు సమస్యలను దూరం చేస్తాయి.
బరువు : తొందరగా బరువు తగ్గాలనుకునేవారికి నానబెట్టిన వాల్‌నట్స్ బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్ కారణంగా పెద్దగా ఆకలి వేయదు. వాల్ నట్స్ నానబెట్టి తీసుకోవడం జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో ఖనిజాలు ఫైబర్ జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగు ఎముకలకు బలమైన మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇందులో లభిస్తాయి.
చర్మ ఆరోగ్యం: ఇందులోని విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతం చేస్తుంది. మెలటోనిన్, పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు ఎండనుంచి చర్మాన్ని రక్షించడంలో సాయపడతాయి.
మధుమేహులకు వాల్‌నట్ గ్లైసోమిక్ సూచి తక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా కాపాడతాయి.
రోగనిరోధక శక్తికి మంచిది వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు , పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబు, జ్వరం లాంటి అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.
నిద్రకు: వాల్‌నట్స్‌లో సహజసిద్ధమైన మెలటోనిన్ రసాయనం కారణంగా మంచి నిద్ర పడుతుంది. మెలటోనిన్ చాలా సంవత్సరాలుగా మనకు మంచి నిద్రను పొందడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రజాదరణ పొందింది. నానబెట్టిన వాల్‌నట్‌లను ఉదయం , పడుకునే ముందు తీసుకుంటే మంచిది.
గుండె ఆరోగ్యం: నానబెట్టిన వాల్‌నట్న్ శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ వాల్‌నట్‌లతో పోలిస్తే, నానబెట్టిన తరువాత ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఆ పోషకాలను బాడీ కూడా సులభంగా గ్రహిస్తుంది. ఇందులోని ఒమేగా ఫ్లాటీ 3 ఆసిడ్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాయిల్ స్థాయిలను పెంచుతాయి.
Comments
Please login to add a commentAdd a comment