నట్స్ అనంగానే గుర్తొచ్చేవి వేరుశెనగ, బాదం, జీడిపప్పు తదితరాలే. కానీ మధురమైన రుచిలో అంతకు మించి అనే నట్స్ మరొకటి ఉన్నాయి. అవే పైన్ నట్స్. ఒక్కసారి టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు. ధర వింటే మాత్రం తినాలన్న కోరిక పోతుంది. ఆ రేంజ్‌లో ధర పలుకుతాయి ఈ గింజలు.
ఈ పైన్‌నట్స్‌ని తెలుగులో చిల్గోజా అంటారు. రుచికరమైన జీడిపప్పులు, బాదాంలకు మించి అన్నట్లు టేస్టీగా ఉంటాయి. చెప్పాలంటే ఇవి తింటే ఓ చక్కటి స్వీట్ తిన్న ఫీల్ కలుగుతుంది. దీనిపై చింతపండుకు ఎలాగైతే గోధుమరంగు తొడుగు ఉంటుందో అలానే ఉంటుంది. దాన్ని పగలకొడితే తెల్లటి గింజ బయటకు వస్తుంది. అవే పైన్ నట్స్. రోజూ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
ధర మాత్రం..
ఈ పైన్‌నట్స్ ధర చాలా ఎక్కువ. కిలోకు ఏకంగా రూ.8000ల వరకు పలుకుతాయి. అంటే..దగ్గర దగ్గర ఓ గ్రాము బంగారం ధర పలుకుతుంది. ఆరోగ్యం కావాలనుకుంటే ధర గురించి పట్టించుకోకుండా చక్కగా కొని ఆస్వాదించండి. మరి ఖరీదు అనిపిస్తే..కనీసం ఒక్కసారైనా వందగ్రాముల గింజల్ని తెచ్చుకుని తప్పకుండా రుచి చూడండి.
చిల్గోజాలో పోషకాలు:
వంద గ్రాముల గింజల్లో సుమారు 673 కేలరీలు ఉంటాయి. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల చిల్గోజా తినడం వల్ల 13.69 ప్రోటీన్లు లభిస్తాయి. అదే సమయంలో, చక్కెర పరిమాణం 3.59గ్రాముల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా, 100 గ్రాముల చిల్గోజాలో 251 మి.గ్రా మెగ్నీషియం, 16 మి.గ్రా కాల్షియం, 597 గ్రాముల పొటాషియం ఉంటాయి. వీటి తోపాటే ఫోలేట్, ఐరన్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ వంద గ్రాముల చిల్గోజా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.
గుండె ఆరోగ్యం:
చిల్గోజాలో 90% అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బు బారిన పడకుండా ఉండొచ్చు. దీనిలో ఇతర గింజల కంటే ఎక్కువ కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.
జంక్ ఫుడ్‌పై ఆసక్తి తగ్గుతుంది..
వీటిని తినడం వల్ల కొవ్వులున్న జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇవి తిన్నవెంటనే విడుదలయ్యే హార్మోన్లే దానికి కారణం. బరువు తగ్గాలని ఆలోచించే వ్యక్తులు చిల్గోజా తినడం ప్రారంభించాలి. అనారోగ్యకర ఆహారాలు తినాలనే కోరిక తగ్గించడంతో పాటూ బరువు తగ్గడంలోనూ ఇది సాయపడుతుంది.
కేన్సర్:
చిల్గోజాలో ఒమేగా 6, సెలీనియం ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. కేన్సర్ రాకుండా కాపాడుతుంది.
సంతానలేమికి చెక్ పెడుతుంది..
సెలీనియం పరిమాణం సంతానోత్పత్తి సమస్యను తొలగిస్తుంది. చిల్గోజా పురుషుల్లో సెక్స్ శక్తిని పెంచుతుంది. చిల్గోజాలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంతానలేమి వంటి సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది. రోజూ చిల్గోజా తినడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరగడంతో పాటు వీర్యకణాల నాణ్యత కూడా పెరుగుతుంది. అలాగే, చిల్గోజా ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
ఇతర ప్రయోజనాలు..
చిల్గోజా సాధారణ జలుబు నుండి రక్షించడానికి కూడా సహాయపడుతుంది. జింక్ పరిమాణం గాయం వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది.
డిప్రెషన్, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఉన్నవారు నిరాశ సమస్యతో పోరాడతారు. వీరు ఆహారంలో చిల్గోజా చేర్చుకోవాలి. మెగ్నీషియం మోతాదు ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రాత్రిపూట చిల్గోజా తింటే కండరాలు రిలాక్స్ అవుతాయి.
మోనోపాజ్ తరువాత, మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. అలాంటి మహిళలు తప్పనిసరిగా చిల్గోజా తినాలి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చిల్గోజాలో ఉండే మెగ్నీషియం మొత్తం శరీరానికి కాల్షియం రవాణా చేయడానికి సహాయపడుతుంది.
పైన్ గింజల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువవ్వడం వల్ల డయాబెటిస్‌లో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ పనితీరు పెరుగుతుంది. చిల్గోజా తినడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
(చదవండి: ఈ విటమన్‌ని తక్కువగా తీసుకుంటే ఎక్కువ కాలం జీవించొచ్చట..! పరిశోధనలో షాకింగ్ విషయాలు..)
Comments
Please login to add a commentAdd a comment