చిన్న గింజలే కదాని లైట్‌ తీసుకోవద్దు : చికెన్‌ కూడా దిగదుడుపే! | Check These High Protein Nuts to Add to Your Diet | Sakshi
Sakshi News home page

చిన్న గింజలే కదాని లైట్‌ తీసుకోవద్దు : చికెన్‌ కూడా దిగదుడుపే!

Published Thu, Sep 5 2024 1:35 PM | Last Updated on Thu, Sep 5 2024 4:16 PM

Check These High Protein Nuts to Add to Your Diet

పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, మహిళలు భారత దేశంలో చాలామందే ఉన్నారు. పేదరికం, అవగాహన లేక పోవడం, ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఫాస్ట్ ఫుడ్ తదితరాలను దీనికి  కారణాలుగా చెప్పుకోవచ్చు. పోషకాహారం అంటే అదేదో ఖరీదైన వ్యవహారంగా చాలా మంది అపోహపడతారు. బ్రెజిల్‌ నట్స్‌,హాజిల్‌ నట్స్‌, బాదం, పిస్తా, జీడి పప్పు లాంటివే అనుకుంటారు. కానీ భారతదేశంలో చక్కటి పోషకాలందించే గింజలు  ఇంకా చాలా ఉన్నాయి. వీటి వల్ల శరీరానికి అనేక పోషకాలంది ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సులభంగా, తక్కువ ధరలో దొరికే వీటిని తీసుకోవడం వల్ల లాభాలేంటి? తెలుసుకుందాం!

సులభంగా లభించే ఎక్కువ పోషకాలు లభించేవాటిలో వేరుశనగలునువ్వులు, గుమ్మడి గింజలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు.

పల్లీలు, వేరుశనగలు
వేరుశనగలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి,. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఫైబర్‌  ఎక్కువగా అధిక బరువుపెరగకుండా నియంత్రిస్తాయి. వేరుశనగల్లో పుష్కలంగా లభించే కాల్షియం, మెగ్నీషియంఎదిగే పిల్లల్లో ఎముకల వృద్ధికి తోడ్పడతాయి.  ఎముకలకు బలాన్నిస్తాయి. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి.   వీటిల్లోని విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ముడతలు పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. వేరుశనగల్లో ఉండే మాంగనీస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.


ఎలా తీసుకోవాలి
ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఆహారానికి రుచితోపాటు, పోషకాలు అందుతాయి. పచ్చిగా తీసుకోవచ్చు. వేయించి తినవవచ్చు.  నాన బెట్టి మొలకలు వచ్చిన తరువాత తింటే ఇంకా ​‍ శ్రేష్టం.
బెల్లంతో కలిపి చేసిన వేరుశనగ ఉండల్ని, అచ్చులను తినిపిస్తే రక్త హీనత నుంచి కాపాడుకోవచ్చు.
వంటల్లో  వేరుశనగ నూనెను  వాడవచ్చు. ఇది. ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది.
దక్షిణ భారతదేశంలో కరకర లాడే కారం  మాసాలా పల్లీలు, పల్నీ చట్నీ గురించి  ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనేలేదు.  ఇడ్లీ, దోసలతో కలిపి తింటే పోషకాలు అందుతాయి. 

గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో అత్యధిక స్థాయిలో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి.రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తుంది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు తోడ్పడుతుంది. మానసిక ఒత్తిళ్ల నియంత్రణ, జుట్టు పెరుగుదలలో గుమ్మడి గుంజలు బాగా పనిచేస్తాయి.  ఆధునిక జీవన శైలి పురుషుల్లో కనిపిస్తున్న సంతానోత్పత్తి సమస్యలకు చెక్‌ చెబుతుంది.  స్పెర్మ్ నాణ్యత మంచి పరిష్కారం. ఐరన్ తగిన స్థాయిలో ఉండేందుకు గుమ్మడి గింజలు తోడ్పడుతాయి.

ఎలా తీసుకోవాలి
గుమ్మడి గింజల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే  తీసుకోవచ్చు.
సాధారణంగా రోజూ తీసుకునే ఆహారంలో గుమ్మడి గింజలను భాగం చేసుకోవచ్చు. 
పెరుగు, పండ్లు, సలాడ్లు సూప్‌లో కొన్ని గుమ్మడి గింజలను వేసుకోవచ్చు.
కుకీలు, బ్రెడ్, తీపి పదార్థాల్లో గుమ్మడి గింజల్ని చక్కగా అమరుతాయి.

నువ్వులు, లడ్డూలు
నువ్వుల గింజలు కాల్షియం, రాగి, ఫైబర్, మెగ్నీషియం, ఇనుము  అధికంగా లభిస్తాయి.  పిల్లల్లో పోషకాహార లోపానికి నువ్వులు, బెల్లం లడ్డూలను తినపించవచ్చు. ఆడపిల్లల్లో అనేక గైనిక్‌సమస్యలకు చక్కటి పరిష్కారంగా  నువ్వుల గురించి పెద్దలు చెబుతారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement