భారతీయుల ఆహారంలో ప్రధానమైన ఆహార పదార్థాలలో బియ్యం ఒకటి. ఇండియాలో ఎక్కువగా పండించేది, భారత ప్రజలు ఎక్కువగా తినేది బియ్యమే. ప్రతి సంవత్సరం సగటున 125.038 మిలియన్ టన్నుల బియ్యాన్ని భారతదేశం మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఊబకాయం, మధుమేహ వ్యాధి బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో రైస్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది ప్రచారంలో ఉంది.
అయితే బియ్యాన్ని ఉడికించే ముందునీటిలో నానబెట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ నేపథ్యంలో బియ్యాన్ని నానబెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం.
అనేక అధ్యయనాల ప్రకారం ఏదైనా గింజల్ని నానబెట్టినపుడు వాటిల్లోని పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి. అలాగే బియ్యాన్ని నానబెట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. బియ్యం నానబెట్టడం దాని గ్లైసెమిక్ సూచిక (GI), పోషకాహార ప్రొఫైల్‌ను ప్రభావితం చేస్తుంది.
డయాబెటిక్ రోగులు సాధారణంగా అన్నం తినకూడదని సలహా ఇస్తారు. అయితే బియ్యాన్ని నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచే జీఐని తగ్గిస్తుంది. ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ చేసి జీఐని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నానబెట్టడం వల్ల సెరోటోనిన్, మెలటోనిన్ విడుదలకు సహాయపడుతుంది.
బియ్యాన్ని నానబెట్టడం వల్ల అదనపు పిండిపదార్థాలు తొలగిపోతాయి. దీంతో బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ వ్యాధి గ్రస్తులకు కొంతమేరకు ఉపయోగపడుతుంది.
పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది
బియ్యం నానబెట్టడం వల్ల పోషకాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ పద్ధతిని ఉపయోగించి బియ్యంలో ఉండే ఫైటోకెమికల్స్, టానిన్‌లను విచ్ఛిన్నం చేయవచ్చు. అలాగే విటమిన్లు. ఖనిజాల జీవ లభ్యత పెరుగుతుంది.ఇది అన్నం సులభంగా జీర్ణం కావడానికి, అందులోని పోషకాలను గ్రహించేలా చేస్తుంది.
ఉడికించే ముందు బియ్యాన్ని నానబెట్టిడం ద్వారా క్లిష్టమైన కార్బోహైడ్రేట్లను సాధారణ చక్కెరగా మార్చడానికి సహాయ పడుతుంది. శరీరంలో ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.
వంట సమయాన్ని తగ్గిస్తుంది
అంతేకాదు బియ్యాన్ని నీటితో నానబెట్టడం వల్ల వండే సమయం కూడా తగ్గుతుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల గింజలు మెత్తబడి సులభంగా ఉడుకుతాయి. దీంతో వంట ఖర్చు కూడా ఆదా అవుతుంది.
నోట్: ఇది అవగాహనా సమాచారం మాత్రమే. షుగర్ వ్యాధి జీవనశైలితోపాటు అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందనేది గమనించాలి.
Comments
Please login to add a commentAdd a comment