ఎండలు చుర్రుమంటున్నాయి. ఒక్కటే దాహం, దాహం అన్నంతగా భగభగమంటోంది వాతావరణం. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంచేందుకు చల్లటి పానీయాలు, పళ్ల రసాలు వెంట పరిగెడతారు అందరూ. ఐతే చాలామంది కొబ్బరినీళ్లు మంచివని. వాటికే ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ కొబ్బరి నీళ్లు రుచిగా ఉండటమేగాక తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల కొబ్బరి బోండాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వేసవిలో కొబ్బరి బోండాలను కొనగానే నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడాదట. నేరుగా కొబ్బరి బొండం నుంచి నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణలు. అదేంటీ..?
నిజానికి ఎండ వేడిలో వస్తూ రోడ్డుపై కొబ్బరి బోండాలు కనిపించగానే హమ్మయ్యా అనుకుని వెంటనే కొబ్బరి బోండాలు కొని నేరుగా తాగేస్తాం. అలా అస్సలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బయటి వాతావరణం వేడిగా ఉంది. ఇక ఈ బోండాలు కూడా ఎంతసేపు ఈ వేడిలోనే ఉన్నాయన్నది తెలియదు. అందువల్ల అలా అస్సలు చెయ్యొద్దని చెబుతున్నారు. ఎందుకంటే వాటిని కుప్పలుగా వేసి విక్రయిస్తుంటారు. అలా చాలా రోజుల నుంచి లేదా చాల సేపటి నుంచి ఎండలో ఉండిపోవడంతో దానిలో ఒక రకమైన ఆకుపచ్చని ఫంగస్ వస్తుందట.
అందువల్ల కొబ్బరి బోండాన్ని కొన్న వెంటనే నేరుగా స్ట్రా వేసుకుని తాగేయ్యకుండా..ఓ పారదర్శకమైన గాజు గ్లాస్‌లో వేయించుకుని తాగాలని అంటున్నారు. అందులో నీరు స్పష్టంగా, ఎలాంటి చెడు వాసన లేదని నిర్థారించుకుని తాగడం అనేది ముఖ్యం అంది. ఎందుకంటే ఈ ఎండల ధాటికి ఎలాంటివైనా తొందరగా పాడైపోతాయి. నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అందువల్ల దాహం అంటూ ఆత్రతగా కొబ్బరి నీళ్లు తాగేయొద్దని సూచిస్తున్నారు.
ఈ ఫంగస్ ఎలా వ్యాపిస్తుందంటే..
ఆకు పచ్చని ఫంగస్ ఆహార పదార్థాల ఉపరితలాలపై వస్తుంది. అది ఆహార పదార్థాన్ని కుళ్లిపోయేలా చేయడం ద్వారా పోషకాలు పొందుతుంది. ఇది ఎగురుతూ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. చాలా కఠినమైన వాతావరణంలో చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. తగినంత నీరు, సేంద్రియ పదార్థాలలో ఉన్న పదార్థాలపై ఇది పెరగడం ప్రారంభించి, నెమ్మదిగా మొత్తం వ్యాప్తి చెందుతుంది.
ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..
తీవ్రమైన అలెర్జీ, తుమ్ములు, ఎరుపు లేదా నీటి కళ్లు, చర్మంపై దద్దుర్లు, ముక్కులో దురద, కళ్ల నుంచి నీళ్లు రావడం. దగ్గు, శ్వాస ఆడకపోవడం, తదితర లక్షణాలు ఉంటాయి. ఈ ఫంగస్‌లో హానికరమైన మైకోటాక్సిన్‌లతో నిండి ఉంటాయి. ఇది తీవ్రమైన విషాన్ని కలిగిస్తుంది. కడుపు, మూత్రపిండం, కాలేయం వంటి వాటిల్లో అనేక సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుంది.
నివారణ..
ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. తాజా పండ్లు, కూరగాయాలను మాత్రమే తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు
చెడిపోయే వస్తువులను ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకండి
గాలి చొరబడని కంటైనర్లలో ఆహార పదార్థాల్ని నిల్వ చేయాలి.
కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంత కాలం సురక్షితంగా ఉంటాయో తెలుసుకుని నిల్వ ఉంచడానికి యత్నించాలి.
(చదవండి: నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?)
Comments
Please login to add a commentAdd a comment