నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే అంతమంచిదని అంటారు. అలా అని ఎప్పుడుపడితే అలా తాగడం మంచిది కాదని కూడా చెబతున్నారు నిపుణులు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగాలని..ఇలా చేస్తే మలబద్దక సమస్య ఉండదని అంటారు. ఆ తర్వాత వీలు కుదిరినప్పుడైన నీళ్లు తాగే యత్నం చేయండని అంటారు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బోజనం అయ్యిన వెంటనే లేదా భోజనం మధ్యమధ్యలో అదేపనిగా తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదంట. ఇలా చేయడం వల్ల తలెత్తే సమస్యలు గురించి సవివరంగా చెప్పుకొచ్చారు నిపుణులు. అవేంటంటే..
నీళ్లు ఆరోగ్యానికి చాలా అవసరం. దాహార్తిని తీర్చడమే కాకుండా ఆహారాన్ని చక్కగా విచ్ఛిన్నం చేసి సులభంగా జీర్ణమవ్వడంలో సహాయపడుతాయి. తద్వారా శరీరం త్వరిగతగతిన పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం..భోజనం అయ్యిన వెంటనే నీళ్లు తాగకూడదు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటంటే..
జీర్ణ సమస్యలు..
తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్టిక్ రసాలు, జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని చెబతున్నారు. దీని వల్ల పోషకాల సహజ శోషణపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కడుపులో ఉన్న ఆహారం నీళ్లు తాగిన వెంటనే శీతలీకరణం అయిపోతుంది. దీంతో సాధారణంగా జీర్ణం అయ్యే వ్యవధిలో మార్పులు వచ్చి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.
బరువు పెరగడం..
తిన్న వెంటనే నీళ్లు తాగడంతో తొందరగా ఆహారం విచ్చిన్నమయ్యి వేగంగా జీర్ణ మయ్యిపోతుంది. దీంతో వెంటనే ఆకలిగా అనిపించి..అతిగా తినడానికి దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరగడం, ఓబెసిటీ వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
గుండెల్లో మంట..
భోజనం చేసిన వెంటనే తాగిన నీరు జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి ఆమ్లత్వానికి దారితీసి గుండెల్లో మంటకు కారణమవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ రసాయనాలు, డైజిస్టివ్ ఎంజైమ్‌లు అదనపు నీటితో కరిగించబడి ఆమ్లత్వానికి దారితీస్తుంది. దీంతో గుండెల్లో మంట వంటివి కలుగుతాయి.
ఇన్సులిన్ పెరుగుదలకు..
ఇలా నీళ్లు తాగడం వల్ల కొంత ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోయే అవకాశం ఉంది. ఇది కాస్త కొవ్వుగా మారి శరీరంలో నిల్వ చేయడబడి ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో మధుమేహానికి దారితీసి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడానికి కారణమవుతుంది.
ఎలా తాగడం మంచిదంటే..
భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత నీరు తాగడానికి సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ భోజనం చేస్తున్నప్పుడూ ఎక్కిళ్లు వచ్చి నీళ్లు తాగక తప్పడం లేదు అనుకుంటే..తింటున్నప్పుడూ మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీటిని సిప్ చేయండి. ఇలా చేస్తే కాస్త గొంతులో ఆహారం సాఫీగా దిగడమే కాకుండా ఆహారం మృదువుగా అయ్యి సులభంగా జీర్ణమవుతుంది.
అలాగే బాగా చల్లగా ఉన్న నీటిని అస్సలు తాగొద్దు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసి జీర్ణమయ్యే వ్యవధిని మందగించేలా చేస్తుంది. పైగా యాసిడ్ రిఫ్లక్స్‌కి దారితీసి, టాక్సిన్ సేకరణకు దారితీస్తుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ తినేటప్పుడూ ఎరేటెడ్ డ్రింక్స్, కెఫిన్ వంటి పానీయాలను తీసుకోకండి అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?)
Comments
Please login to add a commentAdd a comment