వాల్‌నట్స్ సూపర్ హెల్తీ నట్స్. ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలతో నిండి ఉంటాయి. దీనిలో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. అధిక పోషకాలు కలిగిన వాల్‌నట్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ను ఉంటాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, అలాంటి వ్యాధి ఉన్నవారికి ఈ వాల్‌నట్స్ ఎంత మాత్రం మంచివి కావని తేల్చి చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి వ్యాధులు ఉన్నవారు వీటిని తీసుకోకూడదు?ఎందుకని..? తదితరాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
డయాబెటిస్‌తో బాధపడుతున్ వారికి ఈ వాల్‌నట్స్ వారి మూత్రం ఆమ్లత్వానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. మూత్రంలో కాల్షియం ఆక్సలేట్ అధిక సాంద్రతలు క్రిస్టలైజ్ అవ్వడంతో ఈ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రనాళంలోకి ప్రయాణించి మూత్రప్రవాహాన్ని అడ్డుకుని ఇన్ఫెక్షన్ లేదా రక్తస్రావాన్ని కలిగిస్తాయి.
మూత్రపిండాల్లో రాళ్ల సంకేతాలు, లక్షణాలు
వికారం, వాంతులు
మూత్ర విసర్జనలో రక్తం
మూత్ర విసర్జన చేసినప్పుడు నొప్పి
మూత్ర విసర్జన చేయలేకపోవడం
మూత్ర విసర్జన చేయాలనే కోరిక విపరీతంగా ఉండటం
జ్వరం లేదా చలి
దుర్వాసనతో కూడిన మూత్ర విసర్జన
డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎన్ని వాల్‌నట్స్ తినాలి..?
మధుమేహం ఉన్నవాళ్లు రోజువారీగా వాల్‌నట్‌లను 30 నుంచి 50 గ్రాములకు పరిమితం తీసుకుంటే మంచి ప్రయోజనాలను పొందగలరు. ఒక అధ్యయనం ప్రకారం, ఎనిమిది వారాలపాటు ప్రతిరోజూ 43 గ్రాములు లేదా 1.5 ఔన్సుల వాల్‌నట్‌లను తినడం వల్ల మచి సానుకూలా ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు.
ప్రయోజనాలు
రోగనిరోధక శక్తిని పెంచుతాయి
ఇతర సాధారణ గింజల కంటే వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇందులో విటమిన్ ఈ, మెలటోనిన్, పాలీఫెనాల్స్ వంటి మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
వాపును తగ్గిస్తాయివాల్నట్లను క్రమం తప్పకుండా తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె సమస్యలు, టైప్ -2 డయాబెటిస్, అల్జీమర్స్, కేన్సర్ వంటి వ్యాధులకు చెక్‌పెడుతుంది. వాల్‌నట్‌లోని పాలీఫెనాల్స్ ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడటానికి సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహిస్తుంది.. అధ్యయనాల ప్రకారం, ఇందులో గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రేగు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కాబట్టి, వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తింటే మైక్రోబయోటా, గట్ ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది.
ఆహారంలో వాల్‌నట్‌లను చేర్చుకోవడం వల్ల రొమ్ము, ప్రోస్టేట్, కొలొరెక్టల్ కేన్సర్‌తో సహా కొన్ని రకాల కేన్సర్‌ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వాల్‌నట్స్‌లో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాల్స్ నిండి ఉంటాయి కాబట్టి. కొన్ని గట్ సూక్ష్మజీవులు వీటిని యురోలిథిన్స్ అని పిలిచే సమ్మేళనాలుగా మార్చగలవు.
వాల్‌నట్‌లు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, శరీరం వాటి పోషకాల ఆధారంగా ఊహించిన దాని కంటే 21 శాతం తక్కువ శక్తిని గ్రహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల ఇది ఆకలిని నియంత్రిస్తుంది, జీవక్రియను పెంచుతుంది, తద్వారా బరువు తగ్గడం లేదా నిర్వహణలో సహాయపడుతుంది.
(చదవండి: ఏసీలో పడుకుంటున్నారా..? ఐతే ఈ సమస్యలు తప్పవు..!)
Comments
Please login to add a commentAdd a comment