![What Is Type 1.5 Diabetes American Singer Lance Bass Has Been Diagnosed With](/styles/webp/s3/article_images/2024/08/4/singer_0.jpg.webp?itok=1EFYGH_j)
సైలెంట్ కిల్లర్‌లాంటి డయాబెటీస్ వ్యాధులకు సంబంధించి టైప్ 1, టైప్ 2 గురించి విన్నాం. కానీ ఇందులో మరొకటి కూడా ఉంది. అదే డయాబెటిస్ టైప్ 1.5. ఈ వ్యాధితోనే అమెరికన్ గాయకుడు బాధపడుతున్నాడు. ఒకరకంగా అతని కారణంగానే ఈ డయాబెటిస్ టైప్ 1.5 వెలుగులోకి వచ్చింది. అసలు ఏంటీ వ్యాధి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..
అమెరికన్ గాయకుడు నర్తకి లాన్స్ బాస్ తొలుత టైప్ 2తో బాధపడుతున్నట్లుగా వైద్యులు తప్పుగా గుర్తించడం జరిగింది. అందుకు సంబంధించిన చికిత్సే కొన్నేళ్లు తీసుకున్నాడు. చివరికీ అతడు డయాబెటస్ టైప్ 1.5 అనే మరో రకం మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇంతకీ ఏంటీ డయాబెస్ టైప్ 1.5 అంటే..
టైప్ 1.5 డయాబెటిస్ అంటే..
దీన్ని లాడా లేదా లాటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ పోలిన లక్షణాలనే చూపిస్తుంది. ఇద యుక్త వయసులో వచ్చే వ్యాధిగా పేర్కొన్నారు. ఇది అచ్చం టైప్ 2 వలే ఉండి క్రమంగా లాడా మాదిరి స్వయం ప్రతి రక్షక పరిస్థితిని కలుగజేస్తుంది. ఇది ఆహారం, జీవనశైలి మార్పులతో సరి అయ్యేది కాదు. దీని ప్రకారం గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచుకోవడం చాల కష్టంగా ఉంటుంది.
ఎప్పుడూ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేని స్థితి అని చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు మధుమేహం ఉన్నవారిలో దాదాపు 10% మందికి లాడా ఉందని అన్నారు. ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్న రోగి గ్లూకోజ్ మానిటర్‌ని ధరించాల్సి ఉంటుంది. ఇది ప్రతి కొన్ని నిమిషాలకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను రీడింగ్‌లను నమోదు చేస్తుంటుంది. ఒకవేళ అందులో మార్పులు జరిగితే హెచ్చరికలు జారీ చేస్తుంటుంది.
లక్షణాలు..
తరచుగా దాహం
అధిక మూత్రవిసర్జన
వివరించలేని బరువు తగ్గడం
అస్పష్టమైన దృష్టి, నరాలు జలదరింపు
చికిత్స చేయకుండా వదిలేస్తే, టైప్ 1.5 డయాబెటిస్ డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌కు దారి తీస్తుంది, ఇది ఇన్సులిన్ లేకపోవడం, కొవ్వును కరిగించడం వంటి వాటికి దారితీసి చివరికి గ్లూకోజ్‌ను ఇంధనంగా ఉపయోగించలేకపోతుంది. తద్వారా శరీరంలో విషపూరితమైన కీటోన్‌లను ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది.
ఎందువల్ల వస్తుందంటే..
ఇన్సులిన్-ఉత్పత్తి చేసే కణాలకు వ్యతిరేకంగా ప్రతిరోధకాల నుంచి ప్యాంక్రియాస్‌కు నష్టం జరగడం వల్ల టైప్ 1.5 వస్తుందని చెబుతున్నారు వైద్యులు. కొన్ని సందర్భాల్లో, స్వయం ప్రతిరక్షక పరిస్థితుల కుటుంబ చరిత్ర వంటి జన్యుపరమైన అంశాలు కూడా ఉంటాయి. టైప్ 1.5 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ దెబ్బతిన్నప్పుడు టైప్ 1 మాదిరిగా శరీరం ప్యాంక్రియాటిక్ బీటా కణాలను నాశనం చేస్తుంది. ఈ టైప్ 1.5 మధుమేహం ఉన్న వ్యక్తి ఒకవేళ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే ఇన్సులిన్ నిరోధకత కూడా ఉండే అవకాశం ఉటుందని అన్నారు వైద్యులు.
చికిత్సకు
శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల టైప్ 1.5 మధుమేహం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే టైప్ 2 డయాబెటిస్ మాదిరిగా నోటి ద్వారా తీసుకునే మందులతో నయం చేయొచ్చు. అలా కాకుండా చాలా ఆలస్యంగా గుర్తించితే మాత్రం ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ వ్యాధి చికిత్సలో చాలా వరకు ఇన్సులిన్ ఇవ్వడమే జరుగుతుంది. అదికూడా రోజువారీ మోతాదు మారుతు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
(చదవండి: శారీరక మానసిక ఆరోగ్యం కోసం బ్రేక్ తీసుకోవాల్సిందేనా? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment