![US FDA Calls Broccoli Most Severe Over Listeria Risk](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/bracoli.jpg.webp?itok=3SdzN7Bv)
ప్రస్తుంతం అందరూ ఆరోగ్య స్ప్రుహతో బ్రకోలిని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. అస్సలు కాలీఫ్లవర్ వైపుకి చూడనివాళ్లు సైతం బ్రకోలి ప్రయోజనాలు తెలిసి మిస్ చేయకుండా కొంటున్నారు. అయితే ఆరోగ్యానికి మంచివని కొనేముందు తాజాగా ఉందా లేదా అనేది గమనించాలి. ఏమరపాటుతో కొంటే మాత్రం ఆరోగ్యదాయకమైనవి కూడా అత్యంత ప్రమాదకరమైనవిగా మారిపోతాయి. ఇలాంటివి కొనేటప్పడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన అధికారులు. ఎందుకంటే..?..
యూఎస్‌లోని సుమారు 20 రాష్ట్రాల్లోని ప్రజలు కొన్ని దుకాణాల నుంచి ప్యాక్ చేసి ఉన్న బ్రకోలి(Broccoli)ని కొనుగోలు చేశారు. వెంటనే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US Food and Drug Administration (FDA)) అప్రమత్తమై తినొద్దని హెచ్చరించింది. వాటిని వెనక్కి ఇచ్చేయండి లేదా ఉపయోగిచకండి అని విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఎఫ్‌డీఏ అధికారులు ఓ దుకాణంలో యాదృచ్ఛికంగా బ్రకోలిని టెస్ట్ చేయగా దానిలో ప్రాణాంతక లిస్టెరియా మోనోసైటోజీన్ బ్యాక్టీరియాలు(Listeria monocytogenes) ఉన్నట్లు గుర్తించారు.
దీంతో డిసెంబర్ 2024 తొలివారంలో ఎవరైతే ఈ బ్రకోలిని కొన్నారో వారు.. డిసెంబర్ 10 కల్లా ఉపయోగిస్తే పర్లేదని అలాకాని పక్షంలో తక్షణమే వినియోగించటం మానేయాలని సూచించింది. ఎందుకంటే ప్యాకింగ్ చేసినప్పుడు నిల్వ తక్కువ ఉండే ఆహార పదార్ధాల్లో ఆటోమేటిగ్గా ఇలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందట.
అందువల్ల దయచేసి ఇలాంటి కూరగాయాలను ప్యాకింగ్ కవర్‌పై ఉండే డేట్ ఆధారంగా కొనడం, ఉపయోగించడం వంటివి చేయండి అని చెబుతున్నారు. ఇలాంటి కలుషితమైన బ్రకోలి తింటే ఆరోగ్యవంతుడైన వ్యక్తులలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి స్వల్పకాలిక లక్షణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. అదే గర్భిణీ స్త్రీలలో గర్భస్రావాలు, నెలలు నిండకుండానే ప్రసవించడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు.
ఏంటీ లిస్టెరియా మోనోసైటోజీన్‌లు:
లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనేది వ్యాధికారక బాక్టీరియం. ఇది మానవులకు జంతువులకు సోకుతుంది. అనేక ఇతర బాక్టీరియాలా కాకుండా లిస్టెరియా రిఫ్రిజిరేటెడ్ పరిసరాలలో వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆహర ఉత్పత్తి నిల్వలో ఈబ్యాక్టీరియా ఉత్ఫన్నమవుతుంది. అందువల్ల కొన్ని ఆహార పదార్థాలు అంటే.. మహా అయితే ఐదు రోజులకి మించి నిల్వ చేయలేని కూరగాయల్లో ఇది ఫామ్ అవుతుంది.
తాజా కూరగాయాలు ఆరోగ్యానికి మంచివి. అది కూడా రైతులు కోసుకొచ్చిన.. రెండు మూడు రోజులకి మించి నిల్వ లేనివి అయితేనే మంచివనే విషయం గ్రహించాలి. నిజానికి బ్రకోలి సూపర్ ఫుడ్. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని ఇస్తుంది. కానీ అన్నింటికంటే ఇది ఫ్రెష్‌గా ఉందా లేదా అనేది నిర్థారించి తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్‌చేస్తే..)
Comments
Please login to add a commentAdd a comment