నాన్‌స్టిక్ వంట సామానులు వాడొద్దని ఎన్నేళ్లుగానో నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని విన్నాం. కానీ ఇటీవల ఈ నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ల వాడకం వల్ల యూఎస్‌లో సరికొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. వాటిని అధికంగా వేడిచేయడం వల్లే ఈ వ్యాధి వస్తున్నట్లు పరిశోధనలో తేలింది. అసలేంటి వ్యాధి? అందుకు నాన్‌స్టిక్ పాన్ ఎలా కారణం..?.
నాన్‌స్టిక్ పాన్‌లు అధికంగా వేడి చేయడం వల్లే పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ వంటి ఫ్లూ మాదిరి వ్యాధులు వస్తున్నాయని సుమారు మూడు వేలకు పైగా నివేదికలు చెబుతున్నాయి. అందుకు నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ల్లో ఉపయోగించే రసాయన పూత కారణమని గత 20 ఏళ్లుగా లాభప్రేక్ష లేని సంస్థ యూఎస్ పాయిజన్ సెంటర్స్ చెబుతున్నాయి. ఈ వంట సామానుల్లో వాడే కెమికల్స్ కారణంగా పాలిమర్ ఫ్యూమ ఫీవర్‌కి సంబంధించిన కేనులు 267కి పైగా నమోదయ్యాయి.
టెఫ్లాన్‌లోని ప్రధాన పదార్థం. పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్(పీటీఎఫ్‌ఈ). అందువల్లే దీన్ని వందల ఏళ్లుగా నిపుణులు ప్రమాదకరమైన కెమికల్స్‌తో కూడిన పాన్‌లని చెబుతున్నారు. అన్ని నాన్‌స్టిక్ వంటసామాను సెట్‌లు పీఎఫ్‌ఏఎస్(పర్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధాలు) కెమికల్ ఉంటుందని అన్నారు. మనం ఈ నాన్‌స్టిక్ పాత్రను దాదాపు 500 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా వేడి చేసినప్పుడూ..దానిపై ఉండే ఈ రసాయన పూత విరిగిపోయిన లేదా డ్యామేజ్ అయినప్పుడూ ఈ "టెఫ్లాన్ ఫ్లూ"కి దోహదపడే పొగలను విడుదలవడం జరుగుతుంది.
అందువల్ల దీనిలో వండే పదార్థాలు మనకు అనారోగ్యాలను కలుగుజేస్తాయని తెలిపారు. అందువల్ల టెఫ్లాన్ పూతతో కూడిన పాన్లు అధిక్ష ఉష్ణోగ్రత వద్ద వేడి చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు జర్మనీలో జరిపిన అధ్యయనంలో పరిశోధకులు ఖాళీ నాన్‌స్టిక్ ప్యాన్‌లను అరగంట పాటు వేడి చేయడం ద్వారా పీఎఫ్‌ఏఎస్ ఉద్గారాలు విడుదలవ్వుతున్నట్లు గుర్తించారు. దాదాపు 698 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడూ పాన్ అత్యధిక ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద మానవ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల నిపుణులు నాన్ స్టిక్ కుక్‌వేర్‌ని ఎప్పుడూ ముందుగా వేడి చేయకూడదని నొక్కిచెబుతున్నారు.
తక్కువ మంట మీద వండితే ఎలాంటి సమస్య ఉండదు గానీ, వేడి చేసిన నాన్‌స్టిక్ పాన్‌లో కర్రిని అలా ఉంచేయడం వల్ల కూడా పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేగాదు టెఫ్లాన్‌తో పూసిన పాన్‌పై ఒక్క స్క్రాచ్ తొమ్మిది వేల కణాలను ఉత్పత్తి చేస్తుందని, ఇది మానవ శరీరంలో మూత్రపిండాలు, వృషణాలకు సంబంధించిన కేన్సర్ ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరించారు. అలాగే వంట చేసేటప్పుడూ తప్పనిసరిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేదా ఓపెన్ విండోలను కూడా ఉపయోగించాలని సూచించారు పరిశోధకులు.
(చదవండి: వాల్‌నట్స్ తింటున్నారా..?ఐతే అలాంటివాళ్లు మాత్రం..!)
Comments
Please login to add a commentAdd a comment